కరీంనగర్

అశ్వవాహనంపై ఊరేగిన స్వాములు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, మార్చి 21: ధర్మపురి క్షేత్రంలో సోమవారం రాత్రి స్థానిక దైవాలు అశ్వవాహనాలపై ఊరేగారు. క్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజైన సోమవారం రాత్రి 8గంటలకు దేవస్థానంలో బలిహరణాలు నిర్వహించిన అనంతరం కళ్యాణానంతర కార్యక్రమంలో అంతర్భాగంగా, అశ్వవాహనారూఢులైన యోగానంద, ఉగ్ర నారసింహ మూర్తులను దేవస్థానం నుండి గోదావరి రోడ్, రామాలయం, నర్మదేశ్వర, రామానందేశ్వర పంచాయతనాల వద్దనుండి బ్రహ్మపుష్కరిణి, ఇసుక స్థంభం మీదుగా తిరిగి దేవస్థానానికి పుర వీధుల గుండా సేవలను ఊరేగించారు. తమ గృహాల ముందునుండి వెళ్ళిన స్వాములకు ఆయా ప్రాంతాల మహిళలు మంగళ హారతులు పట్టారు. దేవస్థానం ఎసి, ఇఓ నాయిని సుప్రియ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆస్థాన వేదపండితులు రమేశ శర్మ, ప్రధానార్చకులు రఘునాథాచార్య, శ్రీనివాసాచార్య, సంతోష్, అశ్విన్ తదితరులతోపాటు భక్తి పాటలు పాడుతూ భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు.