కరీంనగర్

లోక్‌సభలో మోగేనా జిల్లా ‘వాణి’..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 17: కరీంనగర్ జిల్లా వాణి మన ఎంపిల నుంచి కోటి వీణలై పలకాలి. జిల్లాలో అనేక సమస్యలు మన ఎంపిల ముందు ఉండగా, వాటి పరిష్కారం కోసం నేటి నుంచి ప్రారంభంకానున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో గళం విప్పేందుకు సన్నద్ధమయ్యారు. గత యూపిఏ సర్కార్ అనేక హామీలు ఇవ్వటంతోపాటు పలు ప్రాజెక్టులకు హామీలిచ్చి ప్రారంభించలేదు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా రెండేళ్లు గడిచినా సమస్యలు అలాగే ఉన్నాయి. జిల్లాలోని నేదునూర్ గ్యాస్ అధారిత విద్యుత్ ప్రాజెక్ట్ ఇప్పటికీ ఒకడుగు ముందుకు పడలేదు. అసలు ఆ ప్రాజెక్టు ఉంటదా? పోతదా ? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వేలైన్‌కు నిధుల కేటాయింపుల్లో వివక్షత ప్రదర్శించడంతో రెండున్నర దశాబ్దాలు గడిచినా ఆ రైలు నిజామాబాద్‌కు చేరలేదు. ఎఫ్‌సిఐ పునరుద్దరణ చర్యలకు ఎన్డీఏ హామీ ఇచ్చిన అది నేటికి కార్యారూపం దాల్చలేదు. కరీంనగర్ నగరంలో ఉన్న మొక్కజొన్న పరిశోధనా కేంద్రాన్ని జాతీయ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. కమలాపూర్ మండలంలో నిర్మిస్తున్న ఎల్‌పిజి బాటిలింగ్ యూనిట్ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. కరీంనగర్‌లో ఎఫ్‌ఎం రేడియో స్టేషన్‌ను ప్రారంభించిన ప్రసారాలు ఇక్కడి నుండి జరగడం లేదు. మూడేళ్లుగా వరుసగా కరవుతో జిల్లా రైతులు అల్లాడుతున్నా, వారిని ఆదుకునే దిశగా చర్యలు కరువయ్యాయి. కరవు మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో కేంద్ర సహాయం కోసం జిల్లా రైతులు ఎదురుచూస్తున్నారు. విద్యుత్ కేంద్రాల నెలకొల్పే చర్యలు కూడా నోచుకోవడం లేదు. రామగుండం ఏ-్థర్మల్ స్టేషన్ స్థానంలో 6వేల కోట్ల రూపాయలతో 1200 మెగావాట్లతో రెండు విద్యుత్ కేంద్రాలను నిర్మించాలనుకుంది. మొదటగా 600 మెగావాట్లు నిర్మించేందుకు సుమారు ఒకటిన్నర దశాబ్దం కింద పనులు ప్రారంభించారు. ఏ-్థర్మల్ స్టేషన్ స్టేషన్‌ను తొలగించేందుకు ఆధునిక పేలుడు పదార్థాలు ఉపయోగించి నష్టం కలగకుండా తొలగించగా, ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించేందుకు అప్పట్లో జాతీయ మీడియా సైతం రామగుండంకు తరలివచ్చిన సంగతి తెలిసిందే. బిపిఎల్ ప్రాజెక్ట్ కోసం 1275 ఎకరాల స్థలాన్ని కూడా సేకరించారు. వంద కోట్లతో పనులు ప్రారంభించారు. ప్రహారీ, 300 ఎత్తువరకు చినీని నిర్మించారు. ఆ పనులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. పారిశ్రామిక ప్రగతి కోసం చేపట్టాల్సిన చర్యలు శూన్యమే. జిల్లాలోని పలు రహదారులు జాతీయ రహదారులు ప్రకటించినా ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. ఇవేకాక జిల్లాలో పలు సమస్యలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో పేరుకుపోయిన, పెండింగ్‌లో ఉన్న అనేక సమస్యల పరిష్కారం కోసం మన ఎంపిలు బోయినపల్లి వినోద్‌కుమార్, బాల్క సుమన్, కల్వకుంట్ల కవితలు పార్లమెంట్‌లో గళం విప్పుతారనే ఆశతో జిల్లా ప్రజలు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం మన ఎంపిలు ఎలా గళం విప్పుతారో ? వేచి చూడాల్సిందే మరీ.