కరీంనగర్

నేడు ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 18: మరికొన్ని గంటల్లో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి. మంగళవారం ఉదయం 5గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. 5గంటల తరువాత ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహిస్తారు. ఎన్నికలకు సంబంధించి కార్మిక శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 2012 డిసెంబర్ 22న ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు జరగగా, 2014 డిసెంబర్ నాటికి గడువు పూర్తయింది. అప్పటి నుంచి ఎన్నికల కోసం ఆర్టీసీ గుర్తింపు సంఘాలు ఎదురుచూస్తున్న క్రమంలో కార్మిక శాఖ మంగళవారం ఎన్నికలు నిర్వహిస్తోంది. కరీంనగర్ రీజియన్ పరిధిలో 11డిపోలు ఉండగా, వీటిలో 5వేల మందికిపైగా కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. కరీంనగర్-1 డిపోలో 600 మంది, డిపో-2లో 600 మంది, గోదావరిఖనిలో 553 మంది, జగిత్యాలలో 514మంది, కోరుట్లలో 322 మంది, మెట్‌పల్లిలో 310, సిరిసిల్లలో 337, వేములవాడలో 825, హుస్నాబాద్‌లో 268, హుజూరాబాద్‌లో 380, మంథని డిపోలో 300 మంది చొప్పున కార్మికులు గుర్తింపు సంఘాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారు. డ్రైవర్లు, కండక్టర్లతోపాటు జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, మెకానిక్‌లు, ట్రాఫిక్ సూపర్‌వైజర్లు, కంట్రోలర్లు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు, క్యాజువల్, కాంట్రాక్ట్ కార్మికులు, ఇతర సిబ్బంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. కరీంనగర్ రీజియన్ పరిధిలో నాలుగు సంఘాలుండగా, కొత్తగా మరో సంఘం చేరింది. ఎంప్లారుూస్ యూనియన్ (ఈయు), స్ట్ఫా అండ్ వర్కర్స్ యూనియన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్), తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టిఎంయు), తెలంగాణ నేషనల్ మజ్దూర్ యూనియన్ (టిఎన్‌ఎంయు)తో పాటు ఈ సారి తొలిసారిగా ఎన్నికల బరిలో బహుజన కార్మిక యూనియన్ (బికెయు) పోటీ పడుతోంది. ఈ ఎన్నికల్లో ఈయు, ఎస్‌డబ్ల్యూఎఫ్ మధ్య ఒప్పందం కుదరడంతో అవి కలిసి పోటీ చేస్తుండగా, మిగతావన్ని ఒంటరిగానే పోటీ చేస్తున్నాయి. అయితే, కరీంనగర్ రీజియన్ పరిధిలో ప్రధానంగా ఈయు, టిఎంయు మధ్యే ప్రధాన పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యూనియన్ల నాయకులు విందులు, వినోదాలు, ఇతరత్రా కార్యక్రమాలతో కార్మికులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. ఎన్నికల సందర్భంగా బస్టాండ్, డిపోల్లో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. మొత్తానికి మరికొన్ని గంటల్లో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనుండగా, కార్మిక శాఖ అంతా సిద్ధం చేయగా, మూడేళ్ల తరువాత జరుగుతున్న ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న యూనియన్లు తమదైన శైలీలో ముందుకు సాగగా, కార్మికలోకం ఏ యూనియన్‌కు పట్టం కడుతుందో వేచిచూడాల్సిందే మరీ.