కరీంనగర్

ఉపాధి కూలీలకు త్వరలోనే కూలీ డబ్బులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగాధర, మార్చి 22: గ్రామాలలో ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలకు త్వరలోనే కూలీ డబ్బులు చెల్లిస్తామని కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. మంగళవారం మండలంలోని గట్ట్భుత్కూరులో ఉపాధిహామీ పథకంలో జరుగుతున్న కోమటి కుంటను ఆమె పరిశీలించారు. అనంతరం ఉపాధి కూలీలతో మాట్లాడారు. కూలీలు రాయడంతో పాటు చదవడం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. కూలీలకు నోట్‌బుక్కులు అందించాలని, అలాగే న్యూస్ పేపర్స్‌ను వారికి చదివి వినిపించాలని ఆమె సాక్షర భారత్ కో-ఆర్డినేటర్‌ను ఆదేశించారు. అనంతరం మహిళలు మాట్లాడుతూ తమకు కూలీ డబ్బులు గత నెల రోజులుగా అందకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రస్తుత కరవు దృష్ట్యా వెంటనే తమకు కూలీ డబ్బులు మంజూరు చేయాలని కోరారు. ఇందుకు కలెక్టర్ స్పందిస్తూ ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, వారం రోజులలో ప్రతీ కూలీకి డబ్బులు అందుతాయని వెల్లడించారు. మహిళలు ఆరుబయటకు వెళ్లకుండా ఇంటిలోనే మరుగుదొడ్డి నిర్మించుకోవాలని, తద్వారా ఆరోగ్యంతో పాటు పరిసరాల పరిశుభ్రత ఉంటుందన్నారు. వంద శాతం మరుగుదొడ్ల లక్ష్యం పూర్తి చేయాలని ఎంపిడిఓను ఆదేశించారు. అలాగే గ్రామంలో శ్మశానవాటికలో బాత్‌రూమ్‌లు, నీటి సరఫరా, బోర్‌వెల్ లేక ఇబ్బందులు జరుగుతున్నాయని, గతంలో జడ్పీటిసి బోరు వేయించినా పనులు పూర్తి కాలేదని కలెక్టర్‌కు తెలుపడంతో రూ.5 లక్షల మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. గట్ట్భుత్కూరు నుండి గర్శకుర్తి గ్రామానికి రోడ్డు సౌకర్యం సరిగా లేదని, స్థానిక సర్పంచ్ గంగాధర శోభ కలెక్టర్‌కు విన్నవించారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్‌తో పాటు 14వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా ఆ రోడ్డు పనులు చేపట్టాలని కలెక్టర్ నీతూప్రసాద్ ఎంపిడిఓకు సూచించారు. గ్రామంలో తాగునీటి కొరత ఉన్న దృష్ట్యా ఎల్‌ఎండి నుండి బద్దిపెల్లి, వెలిచాల గ్రామాలకు జరుగుతున్న నీటి సరఫరా పైపులైన్ ద్వారా తమ గ్రామానికి తాగునీటిని అందించాలని కలెక్టర్‌ను కోరగా మిషన్ భగీరథ రెండో ఫేస్‌లో 2017 జూన్ వరకు గట్ట్భుత్కూరుకు తాగునీటి సరఫరా అవుతుందని కలెక్టర్ తెలిపారు. తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొన్న దృష్ట్యా తమకు బావులు, బోరుబావులు మంజూరు చేయించాలని ఎంపిపి బాలాగౌడ్ కోరగా, ఓపెన్ బావులు చేపట్టాలని, అలాగే ప్రస్తుత వ్యవసాయం సాగు పది శాతం కూడా లేదని, వ్యవసాయ బావులను లీజుకు తీసుకొని తాగునీటి సరఫరా చేయాలన్నారు. తమ గ్రామానికి 30 కోట్ల గ్రానైట్ సీనరేజ్ నిధులు రావాల్సి ఉండగా, ఇదివరకు ఎలాంటి నిధులు రాలేదని సర్పంచ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో డ్వామా పిడి గణేష్, సాక్షర భారత్ డిడి జయశంకర్, ఎంపిపి దూలం బాలాగౌడ్, జడ్పీటిసి ఆకుల శ్రీలత, తహశీల్దార్ రాజేశ్వరి, ప్రత్యేకాధికారి ప్రభాకర్, ఎంపిడిఓ శ్రీనివాస్, సర్పంచ్ గంగాధర శోభ, ఎంపిటిసి గుండ లక్ష్మి, విద్యుత్ ఎడి సాగర్‌తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉపాధిహామీ కూలీలు, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.