కరీంనగర్

32 వేల మొక్కలు నాటిన పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానకొండూర్, జూలై 24: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా మానకొండూర్ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో 32వేల మొక్కలను నాటామని ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. మండల పరిధిలోని ముంజంపల్లి గ్రామంలోని రియల్ కంట్రక్షన్ క్రషర్‌లో మొక్కలను నాటే కార్యక్రమానికి ఎస్‌ఐ వెంకటేశ్వర్లు పాల్గొని మొక్కలను నాటారు. ఈసందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ ఎస్పీ జోయల్ డేవిస్ అదేశాల మేరకు మానకొండూర్ పోలీసులు హరితహారంలో భాగస్వాములై మండల పరిధిలోని ఊటూర్, వెల్ది, లలితపూర్, గట్టుదుద్దనపల్లి, జగ్గయ్యపల్లి, ముంజంపల్లి, సదాశివపల్లి, అన్నారం, రంగపేట, మానకొండూర్, ఈదులగట్టేపల్లి, లింగపూర్, జగ్గయ్యపల్లి, దేవంపల్లి ,సదాశివపల్లి గ్రామల్లో ప్రజలు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని అవగహన కల్పిస్తు ఇప్పటి వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 32 వేల మొక్కలను నాటినట్లు వివరించారు. మండలంలోని గ్రామగ్రామాన మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మొక్కలను నాటే కార్యక్రమంలో గ్రామంలోని ప్రజాప్రతినిధులు, ప్రజలు, మహిళలు, యువత, అన్నివర్గల ప్రజలు ఉద్యమంలా పాల్గొని కార్యక్రమం విజయవంతానికి కృషి చేస్తున్నారు అని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై మొక్కలను నాటాలని ఎస్‌ఐ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో క్రషర్ యాజమన్యలు రవి, రహిమ్, కాలిమ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.