కరీంనగర్

ఏవీ పుష్కర నిధులు.. కనిపించవేమీ పనులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, జూలై 25: ధర్మపురి క్షేత్రంలో గోదావరి అంత్య పుష్కరాలు జూలై 31 నుండి ఆగస్టు 11 వరకు జరుగనున్నాయి. ఈనేపథ్యంలో గత ఏడాది జూలై 14 నుండి 25 వరకు నిర్వహించిన గోదావరి ఆది పుష్కరాల సమయంలో అధికారుల అంచనాలను మించి అత్యధిక సంఖ్యలో భక్తులు క్షేత్రాన్ని దర్శించుకున్నారు. సిఎం కెసిఆర్, స్పీకర్ మధుసూధనాచారి సహా మంత్రులు, ఉన్నతాధికారులు ధర్మపురిలోనే పుష్కర స్నానాలు చేశారు. కాగా గత ఏడాది అనుభవాలను జోడించి, ఈఏడు అంత్యపుష్కరాల సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేస్తారని భావించిన స్థానికులకు నిరాశే ఎదురవుతున్నది. అంత్య పుష్కరాల నిర్వహణకై ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, జగిత్యాల సబ్ కలెక్టర్ శశాంకలు వేరువేరుగా ఏర్పాట్లపై ప్రత్యేక సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ప్రత్యేక నిధులు పొందేందుకు చేసిన యత్నం సఫలీకృతం కాలేదు. జూలై 31నుండే అంత్య పుష్కరాల ప్రారంభం అవుతుండగా, సమయం సమీపించినా వలసిన ఏర్పాట్లు జరగకపోవడం ఇందుకు నిదర్శనం. అంత్య పుష్కర ప్రారంభానికి ఐదు రోజులు మాత్రమే గడువుండగా, దేవస్థానంలో విద్యుద్ధీకరణలు, చలువ పందిళ్ళు, తాగునీటి వసతులు, ప్రసాదాల కౌంటర్ల ఏర్పాట్లతో పాటు గోదావరి వద్ద పందిళ్లలాంటి వసతుల గురించి పట్టించుకున్న దాఖలాలు కనపడడం లేదు. పుష్కరాల ఏర్పాట్లలో దేవస్థానంతోపాటు ప్రత్యక్ష భాగస్వామ్యం కలిగిన గ్రామ పంచాయతీ కూడా వసతుల కల్పనపై నిర్లక్ష్య ధోరణని అవలంబిస్తున్నట్లే అనిపిస్తున్నది. దేవస్థాన అలసత్వ ధోరణి, పంచాయతీ నిర్లక్ష్య వైఖరి, ఉన్నతాధికారుల బాధ్యతా రాహిత్యం వెరసి క్షేత్రంలో పుష్కరాల ప్రత్యేక ఏర్పాట్లు పుష్కరాల ప్రారంభ సమయం నాటికీ గగన కుసుమాలుగానే మారాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు.