కరీంనగర్

జిల్లాలో కోటి 87లక్షలు మొక్కలు నాటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందుర్తి, జూలై 26: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు కోటి 87లక్షల మొక్కలు నాటామని, అగస్టు చివరి నాటికి మరో కోటి 50లక్షల మొక్కలు నాటుతామని కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. మంగళవారం చందుర్తి మండలం లింగంపేట గ్రామంలోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 214లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి, కలెక్టర్ స్వయంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉద్యమంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని నాలుగు కొట్ల మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టామని ఇప్పటివరకు కోటి 87లక్షల మొక్కలు నాటామన్నారు. హరితహారం కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రతిఓక్కరూ భాగస్వాములై విజయవంతం చేయడం అభినందనీయమన్నారు. లింగంపేట, రుద్రంగి అటవీ ప్రాంతంలో హరితహారం కార్యక్రమాన్ని ఉదయం 11గంటలకు ప్రారంభించవల్సి ఉండగా కలెక్టర్ అలస్యంగా రావడంతో వర్షం పడింది. వర్షంతో కార్యక్రమానికి కాస్త అంతరాయం ఎర్పాడినప్పటికీ మొక్కలు నాటారు. కలెక్టర్ గొడుగు సహయంతో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జడ్పీచైర్ పర్సన్ తూల ఉమ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసీఅర్ బంగారు తెలంగాణలో భాగంగా హరిత తెలంగాణ కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారని ఇందులో ప్రతిఓక్కరూ భాగస్వాములై విజయవంతం చేసి నాటిన మొక్కలను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అర్డీవో శ్యాంప్రసాద్‌లాల్, మండల ప్రత్యేకాధికారి రమేష్, ఎంపీడీవో జనగామ నాగరాజు, తహశీల్దార్ రవింద్రచారి, జడ్పీటీసీ అంబటి గంగాధర్, ఏంపిపి తిప్పని శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్, మార్కెట్ చైర్మన్ దప్పుల అశోక్, సర్పంచ్‌లు జలగం కిషన్‌రావు, బైరి గంగరాజు, వైస్ ఎంపిపి రాజేశ్వర్‌రావు, ఎంపీటీసీ సభ్యులు చెల్కల రాజవ్వ, అల్లూరి పావని, మోతె జల, ఎపీవో అరుణ, ఎపీఎం రజిత, ఐసిడిఎస్ సూపర్‌వైజర్ రమాకళ, పీఅర్‌ఎఈఈ లక్ష్మిరాజం, మాజీ ఎంపిపి చిలుక పెంటయ్య, నాయకులు గట్ల మీనయ్య, మాడిశెట్టి అనందం, కొండ లక్ష్మణ్, చెల్కల తిరుపతి, మోతె నర్సయ్య, బీట్ అధికారి వినోద్ పాల్గొన్నారు.