కరీంనగర్

ఎక్కడికక్కడే అరెస్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిమ్మాపూర్, జూలై 26: మెదక్ జిల్లాలో నిర్మించ తలపెట్టిన మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు బాధితులకు మద్దతుగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అసెంబ్లీ నుండి మల్లన్న సాగర్ వరకు చేపట్టిన పాదయాత్రకు మద్దతుగా జిల్లా కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఉదయం హైదరాబాద్ వైపునకు తరలివెళ్తుండగా మార్గమధ్యలో తిమ్మాపూర్ మండలంలోని అల్గునూర్ చౌరస్తాలో జిల్లా పోలీసులు సిఎల్పీ ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీ్ధర్‌బాబు, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, డిసిసి అధ్యక్షుడు మృత్యుంజయంతో పాటు జిల్లా నుండి పలు మూల ప్రాంతాల నుండి వచ్చిన నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి మానకొండర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అల్గునూర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. కార్యకర్తలకు పోలీసులకు మధ్య కొంత సేపు వాతావరణం ఉద్రిక్తంగా మారింది. దీంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ చెరువుల పునరుద్ధరణ పేరిట ప్రారంభించిన మిషన్ కాకతీయ అధికార పార్టీ నేతల జేబులు నింపుతోందన్నారు. డిసెంబర్ నెలలో ప్రారంభమై మార్చి నెలలో పూర్తి కావాల్సిన పనులు జూన్ చివరి వారంలో పనులు చేపట్టి వర్షాలు రావడంతో పనులు పూర్తి చేశామని బిల్లు తీసుకుంటున్నారన్నారు. జిల్లాలోని ఏ చెరువును పరిశీలించినా అవినీతి బహిర్గతం అవుతుందన్నారు. మిషన్ కాకతీయపై సామాజిక ఆడిట్ నిర్వహించాలన్నారు. ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ పేరిట వేల కోట్లు దోచుకునేందుకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ప్రాజెక్టులను కట్టాలనే సంకల్పం హరీష్‌రావుకు ఉంటే భూ సేకరణను చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా తమ నిరసనను తెలియచేసేందుకు వెళ్తుంటే పోలీసులు ఒత్తిళ్లకు లొంగి అరెస్టు చేశారని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు అండగా ఉండామని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు.