కరీంనగర్

అందరి సహకారంతో వీర్నపల్లికి గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డిపేట, జూలై 28: మారుమూల పల్లెను తాను దత్తత తీసుకుంటే కొందరు సాధ్యమవుతుందా.. అని ప్రశ్నించారు. మధ్యలోనే వదిలి వెళ్లిపోతారని హేళనగా మాట్లాడుకున్నారు. అందరి సహకారంతో అభివృద్ధి పరిచి దేశంలో వీర్నపల్లికి గుర్తింపు తీసుకు వచ్చామని కరీంనగర్ ఎంపి బోయనపల్లి వినోద్‌కుమార్ అన్నారు. గురువారం ఆయన మంత్రి కెటిఆర్, సాగీ డైరెక్టర్ కుశాల్ పథక్‌లతో కలిసి పర్యటించారు. ఎంపి వినోద్‌కుమార్ మాట్లాడుతూ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేని వీర్నపల్లిని మంత్రి కెటిఆర్ సహకారంతో ముందు వరుసలో నిలిపాలని అన్నారు. ఎనిమిది గిరిజన తండాలను కలుపుతూ రింగ్ రోడ్డును నిర్మించామని అన్నారు. ఉపాధి అవకాశాలు కల్పించామని అన్నారు. త్రీజీ, వైఫై సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చామని అన్నారు. బ్యాంకు, పెట్రోల్ బంక్ సేవలు అందుతున్నామని అన్నారు. దేశంలోనే వీర్నపల్లిని ఆదర్శవంత గ్రామంగా నిలువనుందని ఎంపీ వినోద్‌కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. టెస్కాబ్ అధ్యక్షుడు రవీందర్‌రావు, జడ్పీటిసి ఆగయ్య, ఎంపిపి సుజాత, సర్పంచ్ సంజీవలక్ష్మీ, ఎంపిటిసి లక్ష్మీ, ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.