కరీంనగర్

చేనేత కార్మికుల సమస్యలపై అధ్యయనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మికుంట, జూలై 29: చేనేత కార్మికుల సమస్యలపై అధ్యయనం చేసి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నట్లు రాష్ట్ర చేనేత సహకార సంఘాల మేనేజింగ్ డైరెక్టర్ శైలజా రామయ్యర్ వెల్లడించారు. శుక్రవారం పట్టణంలోని చతరంజి చేనేత సహకార సంఘం, బాలాజీ చేనేత సహకార సంఘాలను ఆమె సందర్శించారు. చేనేత కార్మికులు పనితీరును పరిశీలించారు. చేనేత కార్మికుల ఉత్పత్తులను పరిశీలించారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చేనేత సహకార సంఘం అధ్యక్షుడు ఉడుత రమేష్, సర్వేశంలు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఆమెకు వివరించారు. పొద్దస్థమానం పనిచేసినా కూలీ గిట్టుబాటు కావడం లేదని, ఫలితంగా చేనేత కార్మికులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని వివరించారు. దినసరి కూలీ 300 లకు పెంచాలని విన్నవించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఉత్పత్తులకు మీటరు ఒక్కంటికి మూడున్నర చెల్లించనుండగా, దాన్ని ఐదున్నరకు పెంచామని, ప్రస్తుతం కార్మికుల నుండి వస్తున్న విన్నపాల మేరకు ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనాన్ని 30 శాతం మేర పెంచడానికి కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలో 40 వేల మంది చేనేత కార్మికులు ఉండగా, సొసైటీల్లో కార్మికులు 13 వేల మంది ఉన్నట్లు వివరించారు. వీరి సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని చేనేత సహకార సంఘాలను సందర్శిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లకు చేనేత ఉత్పత్తులను వినియోగిస్తున్నామని, ప్రస్తుత డిమాండ్ మేరకు ఉత్పత్తుల పంపిణీని వేగవంతం చేయాలని సూచించారు. ఆమె వెంట జనరల్ మేనేజర్ యాదగిరి, అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశం, డిఎంఓ కృష్ణ ప్రసాద్, టిస్కో మాజీ డైరెక్టర్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.