కరీంనగర్

గౌరి గుండాల జలపాతానికి సందర్శకుల తాకిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, జూలై 31: మండలంలోని సబ్బితం గ్రామ సమీపంలోని గౌరిగుండాల వద్ద గల జలపానికి సందర్శకుల తాకిడి పెరిగిపోయింది. సెలవు రోజు వస్తే చాలు జలపాతం వద్ద సందడి వాతవరణం నెటకొంటుంది. మీడియాతో పాటు సోషల్ మీడియాలో గౌరి గుండాల జలపాతం గురించి తెలుసుకున్న వారు చాలా మంది ఇక్కడి వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. పెద్దపల్లి నుంచి మంథని వెళ్లే దారిలో సబ్బితం గ్రామానికి సమారు మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం ఇటీవల కాలంలో చాలా ప్రధాన్యత కలిగిన ప్రాంతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇటీవల రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, పుట్ట మధులు సందర్శించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. అయితే ప్రస్తుతం సబ్బితం నుంచి అక్కడికి వెళ్లేదారి పూర్తి ఆధ్వాన్నంగా ఉంది. వాహనాలపై వెళ్ళాలంటే రోడ్డు బురద మయంగా ఉండటంతో సందర్శకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చుట్టు గుట్టలు, దట్టమైన చెట్లు, గుట్టల మధ్య నుంచి జాలువారుతున్న జలపాతం, ఆహ్లాదకరంగా ఉండే ఈ ప్రాంతానికి కరీంనగర్‌తో పాటు ఆదిలాబాద్ జిల్లా సింగరేణి ప్రాంతం నుంచి భారీ సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన కొందరు బాహుబలి మాదిరిగా జలపాతంలో గుట్టపైకి ఎక్కుతూ కింద పడి మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు రోడ్డు నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.