కరీంనగర్

పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 31: రాష్ట్రంలో పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానని నూతనంగా ఎన్నికైన రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ చైర్మన్ సిహెచ్ రాజేశ్వర్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని డెయిరీలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాడి పరిశమ్రను అభివృద్ధి పథంలోకి నడిపించడంతోపాటు పాడి రైతులకు ఆదాయం పెరిగేందుకు కావాల్సిన అన్ని చర్యలు చేపడతామన్నారు. పాల ఉత్పత్తులను పెంచేందుకు కృత్రిమ గర్భధారణకు పెద్దపీట వేయనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,289 మంది గోపాలమిత్రలతో కృత్రిమ గర్భోత్పత్తి సేవలు, ప్రాథమిక చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. పశు వీర్య ఉత్పత్తి కేంద్రం కరీంనగర్‌లో మాత్రమే ఉందని, ఇక్కడి నుంచే తెలంగాణ జిల్లాలకు వీర్యం సరఫరా అవుతుందని అన్నారు. కొత్తగా మహబూబ్‌నగర్ జిల్లాలోని కాంసానిపల్లి గ్రామంలో పశు వీర్య సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని, ఇందుకు ప్రభుత్వం భూమిని కేటాయించిందని, త్వరలోనే టెండర్లు పిలిచి పనులు మొదలుపెడతామని తెలిపారు. రాష్ట్రంలో పాలిచ్చే ఆవులు, గేదెలు 38,55,451 ఉండగా, అందులో ఆవులు 15,99,044, గేదెలు 22,56,407 ఉన్నాయని చెప్పారు. పాల ఉత్పత్తి 2015-16 సంవత్సరానికి 44.17 లక్షల మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి లక్ష్యం కాగా, 44.43 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాధించామని, దీనిని వందశాతం తీసుకెళ్లేందుకు చర్యలు చేపడతామని అన్నారు. సిఎం కెసిఆర్ తనపై నమ్మకంతో చైర్మన్‌గా తన పేరును సూచించారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తనకువచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి శాయశక్తులా కృషిచేస్తానని రాజేశ్వర్‌రావు మరోమారు స్పష్టం చేశారు.