కరీంనగర్

అంత్య పుష్కరాలు షురూ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 31: జిల్లాలో గోదావరి అంత్య పుష్కరాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ధర్మపురి, కాళేశ్వరంలలో గోదావరి నదికి మహా హారతి ఇచ్చి పుష్కరాలను ప్రారంభించారు. ధర్మపురిలో గోదావరి అంత్య పుష్కరాలను విశ్వయోగి విశ్వంజీ మహరాజ్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ దంపతులు, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్ తదితరులు వేదబ్రహ్మణుల మంత్రోచ్ఛారణల మధ్య, సాంప్రదాయ రీతిలో గోదావరి నదీకి ఉదయం 6:30 గంటలకు పూజా కార్యక్రమాలు నిర్వహించి, మహా హరతినిచ్చి పుష్కర స్నానాలు ఆచరించి ప్రారంభించారు. అనంతరం లక్ష్మినరసింహాస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కాళేశ్వరంలో గోదావరి అంత్య పుష్కరాలను మంథని ఎమ్మెల్యే పుట్ట మధు దంపతులు మంగళవాయిద్యాల నడుమ వేద మంత్రోచ్ఛారణలతో గోదావరి నదికి ఉదయం 7:45 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మహా హారతినిచ్చి పుష్కర స్నానాన్ని ఆచరించి ప్రారంభించారు. అనంతరం కాళేశ్వర - ముక్తేశ్వరస్వామి ఆలయంలో మధు దంపతులు పూజలు నిర్వహించారు. ఏడాది క్రితం జరిగిన ఆది పుష్కరాల సందర్భంగా భక్తులతో కళకళలాడిన గోదారి తీరం తిరిగి ఆదివారం నుంచి భక్తుల సందడితో కోలాహలంగా మారింది. ఈ సందడి, కోలాహాలం పనె్నండు రోజుల పాటు కొనసాగనుంది. తొలిరోజు ధర్మపురి, కాళేశ్వరంలలో సుమారు 30వేల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించినట్లు అధికారుల అంచనా. అంత్య పుష్కరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మొత్తం మీద అంత్య పుష్కరాల పుణ్యమా అని గోదారి తీరం భక్తులతో కోలాహాలంగా మారింది.