కరీంనగర్

రాష్ట్రంలో ప్రత్యామ్నాయం మేమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, ఆగస్టు 2: రాష్ట్రంలో అధికార టిఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బిజెపి అని, రాబోవు ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం కాయమని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 7న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటనలో భాగంగా మోదీతో మనం, మహా సమ్మేళనం కార్యక్రమానికి కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మండలంలోని రంగంపల్లి గ్రామంలో గల సాయి గార్డెన్‌లో బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన పోస్టర్‌ను బిజెపి నాయకులు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో గుజ్జుల మాట్లాడుతూ తెలంగాణ సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన వాగ్ధానాలు, ఇచ్చిన హామిలు విస్మరించి మాటల గారడితో పబ్బం గడుపుతున్నారని ఆయన ఆరోపించారు. బంగారు తెలంగాణ అని అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారే తప్ప, పేద ప్రజల అభ్యున్నతి కోసం ఆయన చేసింది ఏమి లేదన్నారు. పేదలందరికి డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పినా, ఆచరణలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగతూ ప్రజలను చైతన్యం చేయాలని ఆయన సూచించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నీరును కరీంనగర్ జిల్లాకు ఇచ్చిన తర్వాతనే ఇతర జిల్లాలకు పంపించాలని, ఖరీప్ పంటలకు ఎస్సారెస్పీ నీటిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు మీస అర్జున్‌రావు, కర్ర సంజీవరెడ్డి, పుట్ట మొండయ్య, రాంసింగ్, కాసర్ల జనార్దన్‌రెడ్డి, పిన్నింటి రాజు, పల్లె సదానందం, కటకం సునీల్‌రావు, దొమ్మటి శ్రీనివాస్, కాసర్ల తిరుపతిరెడ్డి, జంగ సుధాకర్‌రెడ్డి, పర్స సమ్మయ్య తదితరులు ఉన్నారు.