కరీంనగర్

మనోహరబాద్ రైల్వేలైన్ ఉత్తర భారత లైన్‌కు కలపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాలటౌన్, ఆగస్టు 4: మనోహరబాద్ - కొత్తపల్లి రైల్వేలైన్‌ను ఉత్తర బారత రైల్వేలైనుకు కలిపే విధంగా సిఎం కెసిఆర్ చొరవచూపాలని సిఎల్‌పి ఉపనేత జగిత్యాల ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి సిఎం కెసిఆర్‌కు వినతి చేసారు. ఈమేరకు జగిత్యాల పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల పట్టణాన్ని కలుపుతూ ధర్మపరి, లక్షేట్టిపేట ద్వారా మంచిర్యాల ఉత్తర భారత రైల్వేలైనుకు కలపాలన్నారు. మనోహరబాద్ నుండి సిద్దిపేట, సిరిసిల్ల, కొత్తపల్లి, కరీంనగర్ జిల్లా నిజామాబాద్ రైల్లేలైనుకు కలిపేవిధంగా కేంద్ర ప్రభుత్వం మంజూరు పొందడం హర్షించదగ్గ విషయం అయినప్పటికి ప్రతిపాదిత రైల్వేలైను సిరిసిల్ల, వేములవాడ నుండి జగిత్యాలకు ప్రస్తుతం ఉన్న రైల్వేలైనుకు కేవలం 20 కిలో మీటర్ల పరిధిలోగల కొడిమ్యాల మండలం నమిలికొండ ప్రాంతంలో అనుసంధానం చేసినట్లైతే జగిత్యాల పట్టణంతో పాటు రాష్ట్ర రాజదాని హైదరాబాద్ చేరుకోవడానికి ఏమాత్రం రైల్లే లైను సౌకర్యం లేని జగిత్యాల డివిజన్‌లోని 14 మండల ప్రజలతో పాటు సౌకర్యంగా ఉంటుందన్నారు. ఈనెల 7న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేసుకుంటున్న ప్రస్తుత ప్రతిపాదింపబడిన మనోహరబాద్ కొత్తపల్లి రైల్వేలైను ప్రత్యేక చొరవ తీసుకుని ప్రతిపాదిత మార్పు చేయబడే రైల్లేలైన్‌కు అవసరమయ్యే స్థల సేకరణ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేవిధంగా మనోహరబాద్, సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, ధర్మపురి, లక్సెట్టిపేట, మంచిర్యాలకు మంజూరుకు చర్యలు చేపట్టాలని సిఎల్‌పి ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి లేఖ ద్వారా వినతి చేసినట్లు వెల్లడించారు.