కరీంనగర్

గోదావరి అంత్య పుష్కరాలు సమాప్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, ఆగస్టు 11: రాష్ట్రంలోనే గొప్పగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా, ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా గోదావరి అంత్య పుష్కరాలు న భూతో న భవిష్యతి చందంగా నిర్వహించ బడినాయని, ఇందుకు ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం అభినందిస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. గురువారం రాత్రి గోదావరి అంత్య పుష్కరాల ముగింపులో భాగంగా నిర్వహించిన మహాహారతిలో పాల్గొన్న సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ, లక్షలాది భక్తుల సంతోషాన్ని చూస్తున్న శుభ సందర్భంగా ధర్మపురి ప్రజలను అభినందిస్తున్నామన్నారు. సిఎం ఆశించిన రీతిలో పుష్కరాలు ఘనంగా జరిగాయని, ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర ఉందన్నారు. ప్రభుత్వ యంత్రాంగ అహర్నిషల కృషి ప్రశంసనీయమన్నారు. ధర్మపురి క్షేత్రం అతి త్వరలోనే ఒక ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా విరాజిల్లగలదన్నారు. భక్తుల రాక సందర్భంగా ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించారు. నది సంరక్షణే పుష్కరాల నిర్వహణ నేపథ్యమన్నారు.
ప్రముఖుల పుష్కర స్నానాలు
పుష్కరాల చివరి రోజైన గురువారం పుణ్య స్నానాలు ఆచరించి, దైవ దర్శనాలు చేసుకున్న ప్రముఖులలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పుచ్చిడి మోహన్‌రెడ్డి, గుజ్జుల రామకృష్ణారెడ్డి, ఆంధ్రాబ్యాంకు డిజిఎం శివానంద శేషగిరి రావు, సెక్రటరీ టు సిసిఎల్‌ఎ కె.కృష్ణ పాల్గొన్నారు.