కరీంనగర్

సిపిఐ త్యాగాలతోనే తెలంగాణ వీడిన నిజాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, ఆగస్టు 11: నిజాం నిరంకుశపాలనలో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ ప్రజానీకాన్ని రక్షించేందుకు నాడు భారత కమ్యూనిస్టుపార్టీ చేసిన త్యాగాలకు వెరసిన నిజాం హైద్రాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేసేందుకు నిర్ణయించాడని, ప్రస్తుత పాలకవర్గాలు దీనిని వక్రీకరిస్తూ, సర్దార్ వల్లభాయ్‌పటేల్ సైన్యంతోనే నిజాంను లొంగదీసుకున్నాడనే వ్యాఖ్యలు చేయటం విడ్డూరమన్నారు. గురువారం నగరంలోనిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, విద్య, వైద్యం, సాగునీరు లేక రాష్ట్ర ప్రజానీకం సతమతమవుతుంటే, అనవసర పథకాలను ప్రధాని మోదీచే ప్రారంభింపజేసిన సిఎం కెసిఆర్ ఆయన ప్రాపకం పొందేందుకేనన్నారు. ఎదురెదురుగా ఒకరికొకరు ప్రశంసించుకుంటూనే, పార్టీ సమావేశాల్లో మాత్రం ఒకరిపై ఒకరు విషం కక్కుతున్నారని ఎద్దేవా చేశారు. పటేల్ పేరుతో తెలంగాణలో పాగావేసేందుకు బిజెపి యత్నిస్తోందని, తెలంగాణ ప్రజల పోరాటచరిత్రను హైజాక్ చేస్తే సహించబోమని, బిజెపి వ్యాఖ్యలు ఇక్కడి ప్రజల అస్థిత్వానే్న దెబ్బతీసేవిధంగా ఉన్నాయన్నారు. తప్పుడు ప్రచారంతోప్రజలను తమవైపు తిప్పుకునేందుకు చేస్తున్న కుట్రలను సిపిఐ తిప్పికొడుతుందన్నారు. రాష్ట్రంలో పాలన పరాకాష్టకు చేరిందని, ప్రజాసంక్షేమం వీడి తన అనుచరులకు పదవులు కట్టబెట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పాలన కొనసాగుతుందని విమర్శించారు. తెలంగాణ పోరాట యోధులను సన్మానిస్తున్నామని పేర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం నాటి ఉద్యమకారులనెందుకు పక్కన బెట్టిందని ప్రశ్నించారు. జూన్ 2ను అవతరణ దినోత్సవంగా ఉత్సవాలు చేపడుతున్న ప్రభుత్వం, విలీన దినోత్సవాన్ని ఇతర రాష్ట్రాల్లోని అప్పటి తెలంగాణ జిల్లాల్లో ఆయా ప్రభుత్వాలు ఘనంగా నిర్వహిస్తుంటే, ఇక్కడ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించటం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా విలీనదినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. అటు కోర్టు అక్షింతలు వేసినా, తన ఇష్టారాజ్యంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. పార్లమెంటరీ కార్యదర్శుల తొలగింపు, ప్రాథమిక పాఠశాలల్లో కొరవడిన వౌలిక వసతులపై సుప్రీం కోర్టు తీవ్రంగా మందలించినా, ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా అనిపించటంలేదన్నారు. మరోవైపు విశ్వవిద్యాలయాల ఉప కులపతుల నియామకంపై కోర్టులో వాదోపవాదాలు నడుస్తున్నా, పట్టించుకోకుండా విసిలను నియమించటం దారుణమన్నారు. ఎంసెట్ నిర్వహణలో కూడా ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు. ఇన్నాళ్ళు రాష్ట్రంలో సమాంతర పాలన కొనసాగించిన గ్యాంగ్‌స్టర్ నరుూం ఆగడాలను అడ్డుకోలేక, తుదకు ఎన్‌కౌంటర్ చేయించిందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నరుూం కేసు విచారణ సిట్‌కు కాకుండా సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విలీన దినోత్సవాన్ని పురష్కరించుకుని సెప్టెంబర్ 11నుంచి 17వరకు క్షేత్రస్థాయిలో అన్ని జిల్లాల్లో తెలంగాణ అమరుల వర్ధంతి సభలు, బస్సు ప్రచారయాత్రలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా తెలంగాణ పోరాట యోధులను సన్మానించనున్నట్లు పేర్కొన్నారు. ఈసమావేశంలోసిపిఐ నాయకులు బూడిద సదాశివ, టేకుమల్ల సమ్మయ్య, పన్యాల ఆదిరెడ్డి, కసిరెడ్డి మణికంఠ, బోయిని అశోక్, పొనగంటి కేదారి, పైడిపల్లి రాజు పాల్గొన్నారు.