కరీంనగర్

నల్లధనం వెలికితీతపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, ఆగస్టు 17: ఎన్నికలకు ముందు దేశ ప్రజలకు బిజెపి ఇచ్చిన హామీ నల్లధనం వెలికితీతపై చిత్తశుద్ధి లేదని సిపిఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి విమర్శించారు. పెరుగుతున్న నిత్యావసర ధరలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఉపసంహరణలో ప్రభుత్వం కనబరుస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బుధవారం ఆపార్టీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ధర్నాలో రాంగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు అలమటిస్తుంటే పాలకులు మాత్రం కార్పొరేట్ రంగానికి వేలకోట్ల రాయితీలు ఇస్తుండటం సిగ్గుచేటన్నారు. ఈ రంగాలకు చెందిన వారే బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించటంలేదని, బ్యాంకర్లు మాత్రం రైతాంగానికి, చిన్న వ్యాపారులకు రుణాలివ్వటంలేదని మండిపడ్డారు. ఇటీవల పార్లమెంటులో ఆమోదం పొందిన జిఎస్టీ బిల్లుతో దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగే అవకాశాలున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. తొమ్మిది కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించటంతో దేశీయంగా రిటైల్ వ్యాపారరంగంలో 5కోట్లకు పైగా వ్యాపారులు వీధినపడే అవకాశాలున్నాయన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతపత్రం అందజేశారు. సుమారు గంటకు పైగా జరిగిన ఈధర్నాలో నాయకులు సదాశివ, భిక్షపతి, కేదారి, అందెస్వామి, రాజిరెడ్డి, రవీందర్‌రెడ్డి, మణికంఠరెడ్డి, అయిలయ్య, కాల్వనర్సయ్యయాదవ్, రాములు, బచన్‌సింగ్, రవి, రాజు, మల్లేశ్ పాల్గొన్నారు.

సెల్ టవర్ ఎక్కిన రైతు
వ్యవసాయ భూమి కబ్జా చేశారని ఆందోళన - కన్నాలలో 5గంటల పాటు హంగామా
గోదావరిఖని, ఆగస్టు 17: కమాన్‌పూర్ మండలం కన్నాల గ్రామానికి చెందిన కొండపలకల భిక్షపతి అనే రైతు తన వ్యవసాయ భూమి కబ్జా చేశారని ఆరోపిస్తూ న్యాయం చేయాలంటూ బుధవారం సెల్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగాడు. బసంత నగ రాజీవ్ రహదారి పక్కనే ఉన్న సెల్ టవర్ ఎక్కి బిక్షపతి 5 గంటల పాటు హంగామా సృష్టించాడు. కబ్జా అయిన భూమి ఇప్పించాలి.. లేదా వేరే వద్ద తనకు భూమైనా ఇప్పించాలని డిమాండ్ చేస్తూ టవర్ పై నుంచి మొర పెట్టుకున్నాడు. బాధితుడి కథనం ప్రకారం.. కమాన్‌పూర్ మండలం కన్నాలకు చెందిన భిక్షపతికి 494 సర్వే నెంబర్‌లో ఎకరంన్నర భూమి ఉంది. ఈ భూమికి పక్కనే గోపాల్ అనే వ్యక్తి క్వారీ నడుపుతుండగా ఆ బ్లాస్టింగ్‌ల వల్ల తన వ్యవసాయ భూమంతా చెడిపోతుందని, అలాగే తన వ్యవసాయ భూమిని కూడా కబ్జా చేస్తున్నాడని బాధితుడు వాపోయాడు. అనేక సార్లు పోలీసులకు, ఇతర అధికారులకు ఎంత మొర పెట్టుకున్న పట్టించుకోలేదని, విసిగిపోయి టవరెక్కిన్నట్లు విలపించాడు. ఘటన స్థలానికి బసంత నగర్ ఎస్‌ఐ విజయేందర్‌తోపాటు కన్నాల ప్రాంత నాయకులు చేరుకొని టవర్ దిగాలని కోరారు. కలెక్టర్‌తో మాట్లాడించి న్యాయం చేస్తానని చెబితేనే టవర్ దిగుతానని భిక్షపతి మొండికేస్తూ అక్కడే కూర్చున్నాడు. ఎలాగైనా న్యాయం జరిగేలా చూస్తానని, ఎలాంటి అఘాయిత్యం చేసుకోవద్దని అధికారులు తన భార్య పుష్ప ద్వారా భిక్షపతికి ఫోన్‌లో మాట్లాడించి హామీ ఇచ్చాక శాంతించి టవర్ దిగాడు.

శుభకార్యానికి కోసం వచ్చి.. అనంత లోకాలకు..
* గౌరి గుండాల జలపాతంలో పడి వరంగల్ యువకుడు మృతి
పెద్దపల్లి రూరల్, ఆగస్టు 17: మండలంలోని సబ్బితం గ్రామ సమీపంలో గల గౌరి గుండాల జలపాతం వద్ద మరో విషాదం చోటు చేసుకుంది. సరదాగా గడపడానికి వస్తున్న వారిలో ఈ జలపాతం వద్ద ఇప్పటికీ ముగ్గురు యువకులు మత్యువాత పడగా, బుధవారం యువకుడి దుర్మరణంతో ఆ సంఖ్య నాలుగుకు చేరింది. కమాన్‌పూర్ మండలం సెంటనరి కాలనీలో బుధవారం జరిగే ఓ శుభకార్యం కోసం వచ్చిన ఓ యువకుడు సరదాగా గడిపేందకు పక్కనే ఉన్న గౌరిగుండాల జలపాతం వద్దకు తన స్నేహితులతో వచ్చి మృత్యువాత పడిన సంఘటన విషాదంగా మారింది. ప్రత్యక్ష సాక్ష్యుల కథనం ప్రకారం.. వరంగల్‌లోని పోచం మైదాన్ ప్రాంతానికి చెందిన పైడి రాజు (23) అనే యువకుడు తన స్నేహితుడు నిశ్చితార్థ కార్యక్రమం కోసం స్నేహితులతో కల్సి బుధవారం ఉదయం కమాన్‌పూర్ మండలం సెంటనరికాలనీకి వచ్చాడు. శుభకార్యక్రమం అనంతరం పక్కనే ఉన్న సబ్బితం గ్రామ సమీపంలోని గౌరి గుండాల జలపాతం వద్దకు స్నేహితులతో కల్సి వెళ్లాడు. కొంత సేపు అక్కడ సరదాగా గడిపిన సాయికుమార్ హఠాత్తుగా జలపాతంలో పడిపోయాడు. ఈత రాక పోవడంతో అప్పటికీ కొన్ని నీళ్లు మింగేశాడు. వెంటనే స్నేహితులు గమనించి అపస్మారక స్థితిలో కొట్టుమిట్టాడుతున్న అతన్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు బసంత్‌నగర్ ఎస్సై విజయేందర్ తెలిపారు.

రాజన్నను దర్శించుకున్న విదేశీయులు
వేములవాడ, ఆగస్టు 17: భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల విదేశీయులు ఆకర్షితులు అవుతున్నారు. దేశీయ కట్టు, బొట్టులకు వారు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆలయాలను దర్శించుకుంటూ ఆధ్యాత్మిక చింతను చాటుతున్నారు. ఈ క్రమంలో అమెరికాకు చెందిన అనటాసియా హజీస్, తావన్, పొలాండ్ దేశానికి చెందిన అనాన్, అన్, స్వీడన్‌కు చెందిన మిర్‌సిన్‌లు తన స్నేహితుని వివాహానికి బుధవారం వేములవాడకు చేరుకున్నారు. ఉదయం భారతీయ సంప్రదాయ ప్రకారం చీర కట్టుకొని, నుదుటన బొట్టు పెట్టుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు.