కరీంనగర్

భూ సేకరణకు రైతులు సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మార్చి 26: జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించిన భూ సేకరణకు రైతులు సహకరించాలని జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ కోరారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు, రైతులతో భూముల ధరల నిర్ణయంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణాలకు అవసరమైన భూమిని 123జివో ప్రకారం ప్రాజెక్టులలో భూములు కోల్పోతున్న రైతులకు నష్టం జరగకుండా రిజిస్ట్రేషన్ విలువ, మార్కెట్ విలువను పరిగణలోకి తీసుకుని తగిన ధర నిర్ణయిస్తామని తెలిపారు. నిర్ణయించిన రేటు ప్రకారం రైతులు భూములిచ్చి సహకరించాలని కోరారు.
భూములు ఇచ్చిన రైతులకు ఏలాంటి ఖర్చు లేకుండా ఇంటి వద్దనే అధికారులు చెక్కులు అందజేస్తారని తెలిపారు. రైతులు కోల్పోతున్న భూములలో ఉన్న బావులకు, బోర్లకు, చెట్లకు, పైపులైన్లకు అదనంగా లెక్కించి డబ్బులు చెల్లిస్తామని అన్నారు. ఈ సందర్భంగా గంభీరావుపేట మండలం లక్ష్మిపూర్, వేములవాడ, కరీంనగర్ మండలంలోని ఆసిఫ్‌నగర్, నాగులమల్యాల గ్రామాలకు భూములకు ధర నిర్ణయించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలోని చెక్‌డ్యాం గ్రామంలో పెండింగ్‌లో కట్టడాలకు వెంటనే చెల్లింపులు చేయాలని ఆదేశించారు. వచ్చే జూన్, జూలై వరకు ప్రాజెక్టులలో నీరు నిలుస్తుందని, వెంటనే డబ్బులు చెల్లిస్తే నిర్వాసితులు త్వరగా ఇళ్లు నిర్మించుకుంటారని తెలిపారు. అలాగే రుద్రారం పునరావాస కాలనీలో త్రీఫేజ్ లైను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పునరావాస కాలనీలలో మిగిలియున్న ప్లాట్లను లబ్దిదారులకు పంపిణీ చేయాలని అన్నారు. చింతలఠాణా గ్రామంలోని నిర్వాసితుల పునరావాస కాలనీలో ప్లాట్లు కేటాయించి పునరావాస కాలనీ అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పౌసమి బసు, స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా రిజిష్ట్రార్ రమణారావు, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి ఆర్డీఓలు చంద్రశేఖర్, భిక్షానాయక్, నారాయణరెడ్డి, స్పెషల్ డిప్యూటి కలెక్టర్లు వెంకటేశ్వర్, శంకర్, నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.