కరీంనగర్

ఫసల్ బీమా ప్రచారంలో విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిమ్మాపూర్, ఆగస్టు 19: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకాన్ని ప్రచారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బిజెపి జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. మండలంలో తీవ్ర వర్షాభావం ఏర్పడి మొక్కజొన్న పంటలు మొత్తం ఎండిపోవడంతో శుక్రవారం భారతీయ జనతా కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు బేతి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పంటల్ని సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకాన్ని రైతుల వరకు ప్రచారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందన్నారు. మొక్కజొన్న పంటకు ఎకరాకు కేవలం రూ.500 చెల్లిస్తే ఇప్పుడు రూ.25వేలు రైతులకు వచ్చే అవకాశం ఉందన్నారు. రైతులను చైతన్య పరచడంలో జిల్లా యంత్రాంగం, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు విఫలం చెందారని విమర్శించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జిల్లా అధికారులతో సర్వే చేయించి ఎకరాకు మొక్కజొన్నకు రూ.25వేలు నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తమ్మిశెట్టి మల్లయ్య, ఇనుకొండ నాగేశ్వర్‌రెడ్డి, కెతిరెడ్డి అంజిరెడ్డి, బోనాల మోహన్, చింతల శ్రీనివాస్, అలుమల్ల రాజిరెడ్డి, సుంక విజేందర్, ఎడ్ల సంపత్‌రెడ్డి, దుర్శెటి రమేశ్, తాళ్ళపల్లి రాజు, మార్క హరికృష్ణగౌడ్, కుమారస్వామి, తిరుపతి పాల్గొన్నారు.