కరీంనగర్

సిరిసిల్ల జిల్లా సాధన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, ఆగస్టు 20: సిరిసిల్ల జిల్లా సాధన కోసం ఇచ్చిన పిలుపుమేరకు అఖిల పక్షం, జిల్లా సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు శనివారం సిరిసిల్ల పట్టణ బంద్ సంపూర్ణంగా జరిగి విజయవంతం అయింది. ఈ సందర్భంగా ఉదయం నుండే బస్సులు బయటకు వెళ్ళలేదు. వెళ్ళినవాటిని రోడ్లపై నిడిపించే పరిస్తితి లేకపోవడంతో వాటిని వెనక్కు తీసుకున్నారు. బ్యాంకులు, పెట్రోలు బంక్‌లు, వ్యాపార వాణజ్య సంస్తలు, దుకాణాలు, హోటళ్ళు అన్ని స్వచ్చందంగా మూసి వేసి బంద్‌ను పాటించారు. ఉదయం నుండే అఖిలపక్షం నేతలు, సిరిసిల్లను జిల్లా కావాలని అకాంక్షించే శక్తులు, సంస్తల నేతలు రోడ్లపైకి వచ్చి బంద్‌ను విజయవంతం చేయించారు. అన్ని కూడళ్ళలో ఆందోళనకారులు, న్యాయవాదులు రాస్తారోకోలు చేశారు. రోడ్లపై బైఠాయించారు. మంత్రి కెటిఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ ఆందోళన సాగించారు. నిరసనలతో రోడ్లన్నీ ఉద్రిక్తంగా మారాయి. బైక్ ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు ఎక్కడిక్కడ నిర్వహించారు. పట్టణంలోని అన్ని ప్రైవేటు విద్యా సంస్థల నుండి విద్యార్థులు ర్యాలీగా తరలివచ్చి జిల్లాను ప్రకటించాలని ఆర్డీవోకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయం ముందు భారీ ప్రదర్శన నిర్వహించారు.

పాడి పరిశ్రమపై
రైతులు దృష్టి సారించాలి
* రాష్ట్ర పశుగణాభివృద్ధి చైర్మన్ రాజేశ్వర్‌రావు
చందుర్తి, ఆగస్టు 20: రైతులు వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమలపై దృష్టి సారించి అధిక లాభాలు పోందాలని కరీంనగర్ మిల్క్ ప్రోడ్యూసర్ కంపెని చైర్మన్, రాష్ట్ర పశుగణాభివృద్ది చైర్మన్ చెల్మడ రాజేశ్వర్‌రావు అన్నారు. శనివారం చందుర్తి మండల కేంద్రంలోని డెయిరీలో పాడి రైతుల పిల్లలకు ఉపకార వెతనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ డెయిరీ ప్రస్థుతం లక్ష 35వేల లీటర్ల పాలను సేకరిస్తుందని ఇందులో లక్ష 28వేల లీటర్ల పాలను అమ్మకానికి ఉపయోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. మీగతా వాటితో తినుబండారాలకు ఉపయోగిస్తున్నామన్నారు. జిల్లాకే పరిమితపైన డెయిరీని రాష్ట్ర రాజధానిలో ప్రారంభించడం జరిగిందన్నారు. గ్రామాల్లోని రైతులు పాడిపరిశ్రమలపై దృషి సారించి అధిక లాభాలు పోందలన్నారు. చందుర్తి మండలం సనుగుల గ్రామానికి చెందిన జగ్‌మాల్ అనే పాడిరైతు చెట్టుపైనుండి పడి మృతి చెందగా అట్టి కుటుంబానికి రూ.లక్ష చెక్కును చైర్మన్ అందజేశారు. ఆలాగే 90మంది విద్యార్థులకు రూ. 800చొప్పున ఉపకార వేతానాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మెనెజింగ్ డైరెక్టర్ శంకర్‌రెడ్డి, పాలక వర్గ సభ్యులు ప్రభాకర్‌రావు, రవిందర్‌రావు, మెనెజర్ సత్యంరావు, రవిందర్‌గౌడ్, చందుర్తి డెయిరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

యజ్ఞంలా ఐఎస్‌ఎల్ నిర్మాణాలు
* సమన్వయంతో లక్ష్యాన్ని పూర్తి చేయాలి
* జిల్లా అదనపు జెసి నాగేంద్ర
జమ్మికుంట, ఆగస్టు 20: వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను యజ్ఞంలా చేపట్టాలని, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేయాలని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ ఎ.నాగేంద్ర ఆదేశించారు. శనివారం జమ్మికుంట మండల పరిషత్ కార్యాలయంలో ఐ.ఎస్.ఎల్ ప్రగతిపై నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. నాలుగు మండలాల పరిధిలో ఐ.ఎస్.ఎల్ నిర్మాణాలపై గణాంకాలను సేకరించారు. పూర్తి చేసినవి, ప్రగతిలో వున్నవి? ఇంకా మొదలు పెట్టనవి ఎన్ని అనే లెక్కలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం మందకోడిగా సాగడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. లబ్దిదారులను ప్రోత్సహించడంలో గ్రామ కార్యదర్శులు చొరవ చూపడం లేదా అని ప్రశ్నించారు. క్షేత్ర స్థాయిలో తలెత్తుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. వ్యక్తిగత మరుగుడ్ల బిల్లులకు సంబంధించి రూ.15 కోట్లు విడుదలయ్యాయని, 7కోట్లు పెండింగ్ నిధులు త్వరలోనే విడుదల కానున్నట్టు చెప్పారు.
నియోజకవర్గంలో ఇంకా 5వేల మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాల్సి వుందని, ఆగస్టు 31 నాటికి వంద శాతం పనులు ప్రారంభించాలని, ఇందులో అలసత్వాన్ని సహించబోమన్నారు. లక్ష్య సాధన కోసం ప్రతి గ్రామానికి ఓ ప్రత్యేక అధికారిని నియమించనున్నట్టు వెల్లడించారు. డి.ఆర్.డి.ఎ పి.డి అరుణశ్రీ మాట్లాడుతూ డబ్బులతో ముడి పెట్టకుండా నిర్మాణాలను పూర్తి చేయాలని అన్నారు. నిధుల కొరత లేదని, లబ్దిదారులతొ పనులు ప్రారంభించే బాధ్యత గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధులు, కార్యదర్శులదేనన్నారు. నిర్మాణాల వేగవంతంపై మండల స్థాయి అధికారులు దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో డ్వామా పి.డి వెంకటేశ్వర్‌రావు, ఆర్.డబ్ల్యు.ఎస్ డి. ఈ కరుణాకర్, ప్రత్యేక అధికారి శ్రీనివాస్, ఎం.పి.డి.వోలు సి.రమేశ్, ఉషశ్రీ, పద్మావతి, తహశీల్దార్ కె.వి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

పండ్ల తోటలకు 70 శాతం సబ్సిడీ
భీమదేవరపల్లి, ఆగస్టు 20: రైతులకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పండ్ల, పూలతోటల పంపకంపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని జమ్మికుంట ఉద్యానవన శాస్తవ్రేత్త వేణుగోపాల్ పేర్కొన్నారు. ఎర్రబెల్లి గ్రామంలో శనివారం నాబార్డు వారు సహకారంతో 70 శాతం సబ్సిడీపై బంతి, చామంతి, గులాబీ పూల తోటలపై శిక్షణ ఇచ్చారు.