కడప

రాబోయే కాలం మనదే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేంపల్లె, నవంబర్ 29: తెలుగుదేశం పాలనలో ప్రజలు విసిగి వేసారిపోయారని రాబోయే కాలం మనదే అని వైసీపీ ప్రతిపక్ష నేత, పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం వేంపల్లె మండలం నందిపల్లె గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన ఓబులేసురెడ్డి, పుల్లారెడ్డి చిత్రపటాలకు ఆయన పూలమాలలు వేసి నివాళి అర్పించి వారి కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ను కలిసేందుకు వచ్చిన ప్రజలతో ఆయన కాసేపు సమావేశమయ్యారు. పక్కా గృహాలు కేటాయించలేదని, వృద్ధాప్య పింఛన్లు కూడా సరిగా రావడం లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తాళ్లపల్లె సర్పంచ్ ఆర్‌ఎల్‌వి ప్రసాదరెడ్డి మాట్లాడుతూ తాళ్లపల్లె గ్రామ పంచాయతీ ఏకగ్రీవానికి కేటాయించిన నిధులు గ్రామ పంచాయతీ గతంలో ఉన్న బకాయిల చెల్లింపులకే నిధులు సరిపోయాయన్నారు. ఇక పంచాయతీ అభివృద్ధి ఏమాత్రం జరగడం లేదని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. పెద్దనోట్ల రద్దుతో దినసరి కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజలు తెలిపారు. టీడీపీ అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని కేవలం ప్రజలను చంద్రబాబు మభ్యపెట్టి పాలన సాగిస్తున్నారని రాబోయే కాలం మనదే అన్ని రంగాల ప్రజలకు మేలు చేకూరుస్తామని వైఎస్ జగన్ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వేంపల్లె మండల అధ్యక్షుడు రవికుమార్‌రెడ్డి, జడ్పీటీసీ షబ్బీర్‌అలీ, ఎంపీటీసీలు టోపీవలి, హబీబుల్లా, నాగన్న, వేంపల్లె వైసీపీ మండల కన్వీనర్ చంద్ర ఓబులరెడ్డి, మాజీ సర్పంచ్ సురేష్‌కుమార్, మాజీ ఉపసర్పంచ్ చలపతి, వైసీపీ నాయకులు మునీర్, రామగంగిరెడ్డి, సోమేశ్వర్‌రెడ్డి, కొండయ్య, షేక్షావలి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎమ్మెల్యేలు,
ఎమ్మెల్సీలతో జగన్ భేటీ

ఆంధ్రభూమి బ్యూరో
కడప,నవంబర్ 29: మరో నాలుగుమాసాల్లో పశ్చిమ రాయలసీమ జిల్లాల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు పురస్కరించుకుని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మంగళవారం రాత్రి పొద్దుపోయాక ఆయనకు అత్యంత సన్నిహితులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పిటిసిలతోప్రత్యేకంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. జిల్లాలోని వైకాపా అధ్యక్షుడు ఏ.అమరనాథరెడ్డి, నగర పాలక మేయర్ కె.సురేష్‌బాబు, జెడ్పిచైర్మన్ గూడూరు రవి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీమ జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో జగన్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఆయన తనయుడు, పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి ఎన్.లోకేష్ పశ్చిమరాయలసీమ జిల్లాల్లోని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ, జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టిపెట్టారు. ఈ నేపధ్యంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నుంచి జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీనుంచి ఎన్‌జిఓ సంఘం రాష్టమ్రాజీ నేత గోపాల్‌రెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ నుంచి కత్తి నరసింహారెడ్డిలు వైసిపి తరపున పోటీ చేస్తుండటంతో జగన్ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యంగా సీమ జిల్లాలకు చెందిన జగన్ సొంత ఇలాఖాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు గెలిపించుకోని పక్షంలో పార్టీ దెబ్బతినడంతోపాటు ఈ ప్రభావం 2019 ఎన్నికలపై చూపుతుందని జగన్ భావించి సీమ జిల్లాలకు చెందిన వైసిపి ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, నగరపాలక, పురపాలక చైర్మన్లు, జెడ్పి చైర్మన్లతో వాడివేడిగా చర్చించి, ప్రతి ఒక్కరు రాజకీయ భవిష్యత్ దృష్టిపెట్టుకోవాలన్నారు. టిడిపితో మిలాఖత్ అయితే రాజకీయంగా అందరం నష్టపోతామని జగన్ నేతలందరితో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. రానున్నది మన ప్రభుత్వమేనని చెప్పి నాయకులకు భరోసా ఇచ్చినట్లు సమాచారం. గతంలో తరహాలో జగన్ ఒంటెద్దుపోకడలకు పోకుండా పార్టీ భవిష్యత్ కోసం నేతలందరితో కలివిడిగా ఉండి, నేతలందరితో మమేకమైనట్లు తెలుస్తోంది.
ప్రజా చైతన్యానికి మారుపేరు
తెలుగుదేశం పార్టీ

ఆంధ్రభూమి బ్యూరో
కడప,నవంబర్ 29: ప్రజాచైతన్యానికి మారుపేరు తెలుగుదేశంపార్టీ అని, కడప నగరాభివృద్ధి టిడిపితోనే సాధ్యమని జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి తెలిపారు. 28వ డివిజన్‌లో డిప్యూటీ మేయర్ బి.ఆరిఫుల్లా ఆధ్వర్యంలో జన చైతన్యయాత్రలు ప్రారంభమయ్యాయి. తొలుతు శ్రీనివాసులురెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి, స్వర్గీయ ఎన్‌టిరామారావు చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే మేళతాళాలతో డివిజన్‌లోని బండ్లమిట్ట, గాజులవీధి, కటికవీధి, పెద్దబెస్తవీధి తదితర ప్రాంతాల్లో యాత్రలు కొనసాగాయి. ఈ సందర్భంగా శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ఎల్లప్పుడు డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ నగర సమస్యలను అధికారుల దృష్టికి, రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్న ఆరిఫుల్లా కృషిని ఆయన అభినందించారు. ఇందుకు డిప్యూటీ మేయర్ స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి జిల్లా, రాష్ట్ర నాయకత్వాలు సహకరిస్తున్నాయని, ఇందుకు డివిజన్, నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మాజీ కౌన్సిలర్ టి.స్వర్ణకుమారితోపాటు మరికొంతమంది మహిళలు డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో వాసు సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం వాసు మాట్లాడుతూ నగరాభివృద్ధికి రూ.4కోట్ల ప్రత్యేక గ్రాంటు, రూ.2కోట్లు ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు మంజూరు చేశారన్నారు. అనంతరం సిసి రోడ్డును వాసు, డిప్యూటీమేయర్ తదితరులు ప్రారంభించారు. అనంతరం వాసు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎన్ని ఇబ్బందులున్నప్పటికీ నెరవేర్చేందుకు కృషి చేస్తుందన్నారు. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ తాము అధికారంలోకి వచ్చినా మాఫీ చేయలేమని చేతులెత్తేసిన ప్రతిపక్షనాయకులే ఇప్పుడు విమర్శించడం దారుణమన్నారు. ప్రజల్లో ముఖాల్లో ఆనందం చూసేందుకే అసాధ్యమైన హామీలను ఇచ్చి సుసాధ్యం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి హరిప్రసాద్, గోవర్ధన్‌రెడ్డి, అమీర్‌బాబు, నగర అధ్యక్షుడు హరీంద్రనాధ్, ముక్తియార్, సుభాన్‌బాషా, సుబ్బలక్షుమ్మ, ఫ్లోర్‌లీడర్ విశ్వనాధరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

రాజంపేట, నవంబర్ 29:మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్భ్రావృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనేక సంక్షేమ పథకాలను మహిళల కోసం అమలు చేస్తున్నారని విప్ మేడా వెంకట మల్లికార్జునరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని మన్నూరులో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణా కేంద్రాన్ని మేడా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించేందుకు ప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణా కేంద్రాన్ని, ఉపాధి కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. శిక్షణ పొందిన మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లను అందజేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై మహిళలతో మేడా మాట్లాడారు. శిక్షణా కేంద్రంలో ఫ్యాన్స్, లైటింగ్ సౌకర్యం లేదని మహిళలు ఫిర్యాదు చేయగా, వెంటనే మేడా స్పందిస్తూ అక్కడే ఉన్న మున్సిపల్ కమీషనర్ ఎన్.వి.రమణారెడ్డిని వెంటనే ఫ్యాన్స్, లైటింగ్ వసతి కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు టి.సంజీవరావు, కటారు సుబ్బరామిరెడ్డి, షేక్ అబ్దుల్లా, ఉమామహేశ్వరరెడ్డి, వడ్డెర రమణ, అబుబకర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మంగళవారం మన్నూరులో అనారోగ్యంతో బాధపడుతున్న మహమ్మద్ ఆలీ వైద్య సహాయం కోసం సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.1.39 లక్షల చెక్‌ను మేడా వెంకట మల్లికార్జునరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల వైద్య చికిత్సలకు ఈ సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందూదొందే..
ప్రొద్దుటూరు, నవంబర్ 29:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలు అమలుచేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని, పేదలపై పెనుభారం పడుతోందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం రూరల్ పరిదిలోని బొజ్జవారిపల్లె గ్రామంలో గడప గడపకూ వైకాపా కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీలు అధికారమే ధ్యేయంగా అమలుకాని హామీలను గుప్పించి నేడు అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేలా ప్రవర్తిస్తున్నాయని ఆయన ఘాటుగా విమర్శించారు. గత మూడేళ్ల పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. తాజాగా కేంద్రం నోట్లరద్దు ప్రకటనతో సామాన్య జనాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. పెద్దనోట్ల రద్దు విషయంలో ఎపి సిఎం చంద్రబాబుతోపాటు కేంద్రంలోని బిజెపి అగ్రనేతలకు ముందుగానే సమాచారం అందించిన నేపథ్యంలో వారివద్ద ఉన్నటువంటి అక్రమ సంపాదనను, నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారని ఆరోపించారు. నోట్ల రద్దు ప్రకటనలో భారీ కుంభకోణం చోటుచేసుకుందని ఆయన ధ్వజమెత్తారు. కెసికెనాల్‌కు సాగునీరందించడంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. జిల్లాలో వ్యవసాయానికి ప్రాణప్రధమైనటువంటి కెసికెనాల్, తెలుగుగంగ కాలువలకు నీరు సకాలంలో విడుదల చేయకపోవడంతో ఈ ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. సకాలంలో పంటలను సాగుచేసుకోలేక ఆలశ్యంగా పంటలను సాగుచేసుకుని తగినవిధంగా దిగుబడులను పొందలేకపోతున్నారన్నారు. రైతు, డ్వాక్రా రుణాలమాఫీలో కూడా ప్రభుత్వం విఫలమై కాకిలెక్కలను చూపిస్తున్నారన్నారు.
కొత్త రాజధాని పేరుతో పేద, రైతుల భూములను లాక్కొని అధికారపార్టీ నాయకులు రియల ఎస్టేట్ వ్యాపారానికి తెరతీశారన్నారు. జాబ్ కావాలంటే బాబు రావాలని పిలుపునిచ్చి నిరుద్యోగు యువత ఓట్లు దండుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో వైకాపా పట్టణాధ్యక్షుడు చిప్పగిరిప్రసాద్, క్రిష్ణారెడ్డి, ప్రసాదరెడ్డి, పెంచిలయ్య పాల్గొన్నారు.

నియంతలా వ్యవహరిస్తున్న సీఎం

రాయచోటి, నవంబర్ 29: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక నియంతలా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని రాయచోటి శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం స్థానిక వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను సీఎం చంద్రబాబు పూర్తిగా కాల రాస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబును కలిస్తే కనీస మర్యాద కూడా ఇవ్వకపోగా అగౌరవపరచడమే కాకుండా ఎన్నికైన ఎమ్మెల్యేలు మధ్యవర్తులని పేర్కొనడం సమంజసం కాదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలచే ఎన్నుకోబడిన శాసనసభ్యులను మధ్యవర్తులని పేర్కొనడం ప్రజాస్వామ్యమే తలదించుకునేలా సీఎం వ్యవహరించడం దారుణమన్నారు. రాజకీయ జీవితం మొదలైనప్పటి నుండి క్యాంపు రాజకీయాలు, బ్రోకర్ రాజకీయాలు, అవినీతి రాజకీయాలు చేసింది సీఎం చంద్రబాబేనన్నారు. అటువంటి లక్షణాలున్న సీఎం మమ్ములను మధ్యవర్తిగా పోల్చడం దారుణమన్నారు. మేము చెప్పిన వినతిపత్రాలను చూడకుండా ఇలా మాట్లాడటం చాలా తప్పన్నారు. వెంటనే సీఎం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కడప జిల్లాకు ఏడు మార్లు వచ్చినా జిల్లాకు ఏమీ ఒరగపెట్టలేదన్నారు. కానీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఒక్క రాయచోటి నియోజకవర్గంలోనే అనేక ప్రాజెక్టుల పూర్తి, 50 వేల ఇండ్లను, 30 వేల పింఛన్లు, ఆరోగ్యశ్రీ ద్వారా అనేక మందికి ఆపరేషన్లను చేయించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టకపోగా గంటలకొద్దీ స్పీచ్‌లు తప్ప ఏమీ ఒరగబెట్టడం లేదని ఆరోపించారు. బహిరంగసభలోనే ప్రజాప్రతినిధులను సంతల్లో పశువులలాగా కొనండి అని చెప్పడం ఇంత దిక్కుమాలిన సీఎం మనకు రావడం మనం చేసుకున్న దురదృష్టకరమన్నారు. రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య విలువలను ప్రజలు కోరుకునే హుందా విలువలను అన్నీ సీఎం సర్వనాశనం చేయడమే కాకుండా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధిని అడ్డుకోవడమే కాకుండా ఆ లక్షణాలను ఇక్కడి నాయకులు కూడా అవలంభించేలా చేశారన్నారు. ఇటీవల పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులను టీడీపీలో చేర్చుకున్నారని ధైర్యం ఉంటే వారిచే రాజీనామాలు చేయించి తిరిగి ఎన్నికలు జరిపి అప్పుడు సత్తా చాటాలని సవాల్ విసిరారు. ప్రలోభాలు పెట్టి పనుల కోసం ఇలా ప్రతిపక్ష నాయకులను కొనడం ఎంత దిగజారుడుతనమో ఆలోచించాలన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నిలబెట్టిన వై ఎస్ వివేకానందరెడ్డిని గెలిపించుకు తీరుతామని వివరించారు. ఈ సమావేశంలో మాధవరం, కాటిమాయకుంట ఎంపీటీసీలు గంగిరెడ్డి, రఫి, డీసీసీబీ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి, మార్కెట్‌యార్డు మాజీ ఛైర్మన్ ఆఫ్జల్‌అలీఖాన్, వైసీపీ నాయకులు రమేష్ పాల్గొన్నారు.

కార్తీక అమావాస్య పూజలకు
పోటెత్తిన కన్నడ భక్తులు
రాయచోటి, నవంబర్ 29: స్థానిక భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి వారికి చివరి అమావాస్య సందర్భంగా మంగళవారం కన్నడ భక్తులు పోటెత్తినట్లు ఆలయ ఈవో మంజుల తెలిపారు. తెల్లవారుజామునే స్వామి వారికి బిందు తీర్థము సేవ, సుప్రభాత సేవ, అభిషేకాలు చేసి స్వామి వారిని రకరకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించడం జరిగింది. స్వామి వారికి 348 అభిషేకాలు, 12 నందిపూజలు, కుంకుమార్చనలు, అర్చనలు చేసి భక్తులు స్వామి వారికి టెంకాయలు కొట్టి, మంగళహారతులు ఇచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు. మధ్యాహ్నం దాదాపు వెయ్యి మంది భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ముఖ్య అర్చకులు శంకరయ్య, కృష్ణయ్యస్వాములు కార్తీక అమావాస్య పూజలు నిర్వహించి విశిష్టతను గూర్చి భక్తులకు తెలియజేశారు. అనంతరం ఉత్సవ మూర్తులను పల్లకీలో ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి వచ్చిన భక్తులకు, కన్నడ భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.

ప్రతి విద్యార్థి ఒక శాస్తవ్రేత్త కావాలి

ఆంధ్రభూమి బ్యూరో
కడప,నవంబర్ 29:ప్రతి విద్యార్థి ఒక శాస్తవ్రేత్తగా అవతరించాలని జిల్లా కలెక్టర్ కెవి సత్యనారాయణ విద్యార్థులకు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక మరియాపురం సెయింట్ జోసఫ్ జూనియర్ కళాశాలలో జిల్లా విద్యాధికారి ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు సంబంధించి రాష్టస్థ్రాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటుచేశారు. డిసెంబర్ 1వ తేదీ వరకు మూడురోజులపాటు జరిగే ఈ ప్రదర్శనకు ముఖ్యఅతిధిగా హాజరైన కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ అన్ని వసతులతో రాష్టస్థ్రాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన కడపలో ఏర్పాటుచేయడం మనకు ఎంతో గర్వకారణమన్నారు. చదువుకున్న చదువుకుంటున్న ప్రతి విద్యార్థి ఓ శాస్తవ్రేత్తగా ఎదిగి మానవాళికి ఉపయోగపడాలని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం ఈ ప్రదర్శనలో విద్యార్థులు తమ ప్రతిభాపాఠవాలు ప్రదర్శించి జాతీయ స్థాయికి ఎదగాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా సైన్స్ టెక్నాలజి వేగంగా పరుగులుతీస్తోందని అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరు సైన్స్‌పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. రెండు లక్షల సంవత్సరాలకు ముందు భూమి అవతరించిందని ప్రస్తుతం పర్యావరణం కలుషితవౌతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణం కలుషితంతో మానవాళి మనుగడకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోందన్నారు. గాలిలో మిథిన్ కార్బండయాక్సైడ్ శాతాలు అధికవౌతున్నాయన్నారు. మనం నేర్చుకుంటున్న నేర్చుకోబోతున్న సైన్స్ పర్యావరణానికి విఘాతం కలిగించకుండా ఉండాలన్నారు. విద్యార్థులందరూ పాఠ్యపుస్తకాల్లోని పాఠాలనే కాకుండా ఇతర అంశాలపై కూడా ప్రత్యేక దృష్టిసారిస్తే ఉన్నతస్థాయికి ఎదిగే అవకాశం ఉందని ఈసందర్భంగా ఆయన జిల్లా విద్యాధికారులకు సూచించారు. సైన్స్‌పట్ల నిజమైన అవగాహన కలిగివుండాలని, విద్యలోని పాఠ్యాంశాల పుస్తకాలనే కాకుండా ఇతర పుస్తకాలు చదివి మంచి జ్ఞానాన్ని సంపాదించుకోవాలని సూచించారు. నేడు ప్రతి విద్యార్థి వారి తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు కావాలని విద్యను అభ్యసించడం సరైంది కాదని, అవికాకపోతే ఇతర అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయన్నారు. ప్రతి విద్యార్థి పర్యావరణాన్ని కాపాడే గొప్పశాస్తవ్రేత్తగా పేరుతెచ్చుకోవాలన్నారు. శాస్తవ్రేత్తలుగా ఎదిగి దేశంకోసం ఎన్నో విజయాలు సాధించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి ప్రతాప్‌రెడ్డిమాట్లాడుతూ కడపలో రాష్ట్ర విద్యవైజ్ఞానిక ప్రదర్శన జరగడం విద్యార్థులకు ఎంతో గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో పిడి వెంకటసుబ్బయ్య, సోషల్‌వెల్ఫేర్ డిడి సరస్వతి, కమిషనర్ చంద్రవౌళీశ్వరరెడ్డి, రాష్టప్రాఠశాలల కమిషనర్ సుధారాణి, ఉద్యానవన శాఖ ఏడి మధుసూదన్‌రెడ్డి, డిడి సరస్వతి, డిప్యూటీ సిఇఓ ఖాదర్‌బాష, సైన్స్ అధికారి రవికిరణ్, యుటిఎఫ్ నాయకుడు లక్ష్మిరాజా, ప్రొఫెసర్లు లక్ష్మి, వనజాక్షి తదితరులు పాల్గొన్నారు.