కరీంనగర్

క్రీడలతో మానసిక ఉల్లాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, మార్చి 19: సింగరేణి సంస్థకు చెందిన పాఠశాలల విద్యార్థులకు కంపెనీ స్థాయి క్రీడాపోటీలను శనివారం ఉదయం స్థానిక జవహార్‌లాల్ నెహ్రూ స్టేడియం గ్రౌండ్‌లో ఎస్ ఓటూ జిఎం సుధాకర్ రెడ్డి ప్రారంభించారు. క్రీడాపోటీల్లో సింగరేణి సంస్థ పరిధిలోని 13రీజియన్లకు చెందిన పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడా పతకాన్ని ఆవిష్కరించి అనంతరం ఎస్ ఓటూ జిఎం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థకు చెందిన పాఠశాలల విద్యార్థుల క్రీడానైపుణ్యాన్ని పెంచేందుకు పోటీలను నిర్వహించామని అన్నారు. క్రీడలవల్ల విద్యార్థులకు మానసిక ఉల్లా సం ఉంటుందని, పోటీల్లో గెలుపు ఓటమిలు సహజమని, ఓడిన టీం విద్యార్థులు మరింత పట్టుదలతో కృషి చేస్తే విజేతలుగా నిలుస్తారని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు 400మీటర్ల పరుగు పందెం, త్రో బాల్, లాంగ్ జంప్, హైజంప్, జావ్‌లింగ్ త్రో, డిస్కస్ త్రో పోటీలను నిర్వహించారు. శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు పట్టుదలతో క్రీడల్లో పాల్గొని గెలుపుకోసం తీవ్రంగా కృషి చేశారు. పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్‌గా ఆర్జీ-2, రెండవ స్ధానాన్ని మందమర్రి, మూడవ స్థానాన్ని కొత్తగుండెంకు చెందిన విద్యార్థులు సాధించారు. సాయంత్రం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మేడిపల్లి ఓసీపీ ఇన్‌చార్జి జిఎం బల్లారి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు సర్ట్ఫికెట్లు, బహుమతులు, టి-షర్ట్స్‌ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సింగేణి అధికారులు బి. ఆర్ దీక్షితులు, యూనియన్ నాయకులు ఆరెల్లి పోచయ్య, సారంగ పాణి, యాదగిరి సత్తయ్య, నాయిని ఓదెలుతో పాటు స్పోర్ట్స్ కమిటి అధికారులు రాజ్ కొమురయ్య, రాజ్ నారాయణ రెడ్డి, కైలాసం, సంపత్ కుమార్, బేబి శ్రీను, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

పనులతోపాటు చదువుకోవాలి
* అప్పుడే జీవితంలో వెలుగులు * కలెక్టర్ నీతూప్రసాద్
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, మార్చి 19: ఉపాధి హామీ కూలీలు పనులతోపాటు చదువుకోవాలని, అప్పుడే మీ జీవితాలలో వెలుగులు నిండుతాయని జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. శనివారం తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండిలోని డైట్ కళాశాలలో, పర్లపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను కలెక్టర్ పరిశీలించారు. ముందుగా కలెక్టర్ డైట్ కళాశాలలో ఉపాధి హామీలో చేపట్టిన ఫాంఫాండ్స్, ఇంకుడు గుంతలు, మట్టి పనులను పరిశీలించి పనులు బాగా జరుగుతున్నాయని అభినందించారు. కళాశాల ఆవరణలో మొక్కను నాటి నీరు పోశారు. అనంతరం పర్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ అన్ని పనులు చేసుకుంటూ మీ కోసం చదువుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పనుల వద్ద కో-ఆర్డినేటర్లను ఏర్పాటు చేసి విరామ సమయంలో అక్షరాలు దిద్దించి చదవడం, రాయడం నేర్పిస్తున్నామని తెలిపారు. మీరు చదువుకుంటే సమాజంలో జరిగే ఎన్నో అన్యాయాలను, అక్రమాలను ఎదిరించవచ్చునని, ఉపాధిలో ఎంతవరకు పని చేస్తున్నాం, కూలీ డబ్బులు ఎంత ఇస్తున్నారనేది కూడా మీరే లెక్కలు వేసుకోవచ్చునని అన్నారు. మోసాలకు తావులేకుండా బిల్లులు పొందవచ్చునని సూచించారు. చదువుకు చిన్నపెద్ద అనే తేడాలేదని, ఏ వయస్సులోని వారైనా చదవడం, రాయడం నేర్చుకోవచ్చునని అన్నారు. త్వరలో ఉపాధి హామీ పాత బకాయిలను చెల్లిస్తామని, ప్రస్తుతం జరుగుతున్న పనులకు వెంటవెంటనే చెల్లింపులు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉపాధి పనుల వద్ద నీడ వసతి కల్పిస్తామని, ఫస్ట్‌ఎయిడ్ బాక్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు. వర్షాలు లేక రైతులు పంటలు సాగు చేయడం లేదని, భూగర్భ జలాలు అడుగంటిన నేపథ్యంలో ఉన్న తక్కువ నీటితో పశుగ్రాసం పెంచుకోవాలని సూచించారు. ప్రతి ఇంటికి ఒక వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకోవాలని, మండలంలో ఇంకా 3వేల ఐఎస్‌ఎల్ నిర్మిస్తే బహిరంగ మల విసర్జన రహిత మండలంగా ప్రకటించుకోవచ్చునని అన్నారు. మిగిలిన ఐఎస్‌ఎల్‌ను నిర్మించుకునే విధంగా ప్రజల్ని ప్రోత్సహించాలని ప్రజాప్రతినిధులను కోరారు. ఈ కార్యక్రమంలో డ్వామా పిడి గణేష్, వయోజన విద్యాశాఖ డిడి జయశంకర్, ఎపిడి కిరణ్, తహాశీల్దార్ కోమల్‌రెడ్డి, ఎంపిడిఓ కిషన్‌స్వామి, ఎంపిపి ప్రేమలత, సర్పంచ్ మాతంగి స్వరూప, ఎపిఓ రాధ తదితరులు పాల్గొన్నారు.

కన్నుల పండువగా
లక్ష్మీ వేంకటేశ్వర కల్యాణం
మల్లాపూర్, మార్చి 19: మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామంలో శ్రీలక్ష్మి వెంకటేశ్వర కల్యాణ కన్నుల పండువగా నిర్వహించగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు- సరోజ దంపతులు కన్యాదాతలు గా పాల్గొన్నారు. శనివారం ఆలయ వ్యవస్థాపకులు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు- సరోజ దంపతులు స్వామివారి హోమం, కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించి యాగశాల ప్రారంభించారు. గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఉత్సవ మూర్తులను ఎమ్మెల్యే దంపతులు ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ ఎంపిపి బద్ధం విజయ నర్సారెడ్డి,జడ్పీటిసి దేవ ముత్తమ్మ మల్లయ్య,సర్పంచ్ గంథాల సత్తమ్మ శివప్రసాద్, ఎంపిటిసి గురిజెల నర్సయ్య, కోరుట్ల సిఐ రాజశేఖరరాజు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

నేటి కల్యాణానికి ప్రభుత్వ పట్టు వస్త్రాలు
ధర్మపురి, మార్చి 19: ధర్మపురి క్షేత్రంలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ఏటా నిర్వహించే లక్ష్మీ నరసింహ స్వామి, శ్రీవెంకటేశ్వర స్వామివారల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పట్టు వస్త్రాలు అందజేయడం జరుగుతున్నది. ధర్మపురి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన యోగ, ఉగ్ర లక్ష్మీ సమేత నారసింహ, శ్రీవేంకటేశ్వర మువ్వురు స్వాముల కల్యాణోత్సవానికి ప్రభుత్వం పక్షాన పట్టు వస్త్రాది కానుకల సమర్పణ దశాబ్దాల విజ్ఞప్తులకుగాను 7ఏళ్ల క్రితం తాజామాజీ రాష్ట్ర దేవాదాయ మంత్రి, బుగ్గారం చివరి ఎమ్యెల్యే జువ్వాడి రత్నాకర్ రావు కృషి ఫలితంగా చివరి క్షణంలో ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడి, పట్టు వస్త్రాలను నాటి జిల్లా కలెక్టర్‌లు అందించడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో నిర్వహించే మువ్వురు స్వాముల కల్యాణాలకు ప్రభుత్వ పక్షాన పట్టు ధోవతులు, పంచెలు, అమ్మవారలకు పట్టు చీరలు, జాకెటు ముక్కలు కలెక్టర్ ద్వారా అందజేయాలని పేర్కొన్నారు. ఈక్రమంలో ఆదివారం ఉదయం 11గంటలకు దేవస్థానంలో జరుగనున్న మువ్వురు స్వాముల కల్యాణాలకు జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ పట్టు వస్త్రాలు సమర్పించ నున్నారు.

వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు
చందుర్తి, మార్చి 19: చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంలో అరాధన బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నంనుండి నిత్యరాధన, ద్రావిడ వేద పారాయణం, తీర్థప్రసాదాలు, సాయంత్రం 4నుండి 7గంటల వరకు అధ్యాయనాలు, 7నుండి 8గంటలకు సమ్మాక్వార్ల పరమపదోత్సవం తదితర కార్యక్రమాలను నిర్వహించినట్లు అర్చకులు వెంకటనర్సింహచార్యులు, కోదంగుళ్ల శ్రీకాంతచార్యులు తెలిపారు.

‘షాదీ ముబారక్’లో అక్రమాలకు పాల్పడితే చర్యలు
ఎసిబి డిఎస్పీ సుదర్శన్‌గౌడ్
జగిత్యాల, మార్చి 19: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మైనార్టీల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన షాదీ ముబారక్ లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేయకుండా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ ఎసిబి డిఎస్పీ సుదర్శన్‌గౌడ్ అన్నారు. ఎసిబి డిజి ఎకె ఖాన్ ఆదేశాల మేరకు శనివారం జగిత్యాల పట్టణ సెంట్రల్ ముస్లిం కమ్యూనిటీ హాల్‌లో షాదీ ముబారక్ పథకం లబ్ధిదారుల ఎంపికపై సమగ్ర విచారణ చేపట్టారు. షాదీ ముబారక్ లబ్థిదారుల అందరినీ పిలిచి డబ్బులు సక్రమంగా అందాయా..లేక మధ్య దళారుల ఆశ్రయించారా..? డబ్బులు విడుదల కోసం మధ్య దళారులకు ఏమైనా డబ్బులు చెల్లించారా..? అనే అంశాలపై విచారణ చేపట్టారు. జగిత్యాల పట్టణంలో ఇప్పటివరకు షాదీముబారక్ పథకం క్రింద 221మంది దరఖాస్తులు చేసుకోగా 192మంది లబ్ధిదారులకు డబ్బులు చెల్లించినట్లు డిఎస్పీ సుదర్శన్‌గౌడ్ తెలిపారు. 19మంది లబ్ధిదారుల జాబితా పెండింగ్‌లో ఉండగా 4దరఖాస్తులను తిరస్కరించినట్లు డిఎస్పీ చెప్పారు.ఇదే విధంగా జగిత్యాల మండలం గ్రామాల్లో షాదీముబారక్ పథకం క్రింద 35మంది దరఖాస్తులు చేసుకోగా 2దరఖాస్తుల తిరస్కరించగా 30మందికి డబ్బులు చెల్లించగా మిగితా 3దరఖాస్తులు పరిశీలనలోఉన్నాయని డిఎస్పీ తెలిపారు. ఈసందర్భంగా డిఎస్పీ సుదర్శన్‌గౌడ్ మాట్లాడుతూ షాదీ ముబారక్ పథకంలో దళారులు, ఖాజీలను ఆశ్రయించి వారి మధ్యవర్తిత్వం పొందరాదని, ఎవరికీ ఒక్క రూపాయి చెల్లించడానికి వీలు లేదని సూచించారు. షాదీ ముబారక్ పథకం మంజూరుకు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే తమను సంప్రదిస్తే చర్యలు తీసుకుంటామని ఎసిబి డిఎస్పీ సుదర్శన్‌గౌడ్ తెలిపారు. ఈ సమావేశంలో సెంట్రర్ ముస్లిం కమిటీ ఉపాధ్యక్షులు సయ్యద్ జమీల్ హైమ్మద్, ఖాజీ మతీన్, ముజీబొద్దిన్, సత్తార్, మన్సూర్, ఖాలీద్ తదితరులున్నారు.

ఘనంగా మృత్తికా సంగ్రహణం
ధర్మపురి, మార్జి 19: ధర్మపురిలో ప్రారంభమైన శ్రీలక్ష్మీ నరసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో ప్రారంభ దిన కార్యక్రమమైన మృత్తికా సంగ్రహణ కార్యక్రమాన్ని శనివారం రాత్రి సంప్రదాయ రీతిలో నిర్వహించారు. ముందుగా దేవస్థానం నుండి నారసింహ, వేంకటేశ్వరుల ఉత్సవ మూర్తుల సేవల ఊరేగింపు నిర్వహించారు. అనంతరం శే్వత వరాహ తీర్థ ప్రారంభ ప్రదేశంలో నారసింహ స్వాముల వేంచేపు చేసి, దేవస్థాన యాజ్ఞికులు పురుశోత్తమాచార్య, ప్రధానార్చకులు రఘునాథాచార్య, వేద పండితులు రమేశ శర్మ, దిలీప్ శర్మ, నటరాజ్ శర్మ పూజలొనర్చారు. మరునాడు నిర్వహించే స్వాముల కళ్యాణార్థం బంగారు ఆభరణాలు చేయించుటకై పుట్ట బంగారం పేరుతో మృత్తిక (మట్టి)ని సంగ్రహించి, దేవస్థానానికి చేరుకున్నారు. ఇఓ సుప్రియ, అభివృద్ధి కమిటీ బాధ్యులు శ్రీకాంత్ రెడ్డి, వెంకటేశ్వర్‌రావు, లింగన్న, రాజన్న, సునీల్ కుమార్, నటరాజ్, గంగాధర్, సావిత్రి, రమాదేవి, వైస్ ఎంపిపి రాజేశ్, పిఎసిఎస్ చైర్మన్ రాజేందర్, సర్పంచ్ సత్తమ్మ, ఎంపిటిసిలు దినేశ్, రమేశ్, విజయలక్ష్మి, రాజ్యలక్ష్మి, సిఐ వెంకటరమణ, ఎస్‌ఐ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

విదేశీ కంపెనీల మేలుకే కేంద్ర బడ్జెట్
* సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబా
గోదావరిఖని, మార్చి 19: కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టి బడ్జెట్‌లో కార్మికులకు, రైతులపై భారం మోపుతూ విదేశియ కంపెనీల మేలు కోసమే బడ్జెట్‌ను రూపొందించారని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సాయిబాబా అన్నారు. శనివారం స్ధానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 20లక్షల కోట్ల బడ్జెట్‌లో కార్మికులకు, రైతులకు మేలు చేసేది ఏం లేవని, ఉద్యోగులకు ఐటీలో రాయితీని ప్రకటించలేదని, ఉద్యోగుల పి ఎఫ్ మీద పన్ను విధించడం, వడ్డీని తగ్గించడం చేపట్టాయని అన్నారు. ప్రైవేటు రంగంలో ఉన్న ఇన్స్‌రెన్స్ కంపెనీలకు పి ఎఫ్ నిధులు మళ్లీంచి, వాటి మేలు కొరకే బడ్జెట్‌లో ఇలాంటివి ప్రవేశపెట్టారని అన్నారు. అంతేకాక ప్రభుత్వ రంగ సంస్ధలను వ్యూహాత్మకంగా ప్రైవేటీకరణ జరిపే తీరును కూడా కొత్త కొత్త విధానాలతో అమలు చేస్తూ, లాభాల్లో ఉన్న కోల్ ఇండియాతో పాటు అనేక ప్రభుత్వ రంగ సంస్ధల్లో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తూరని అన్నారు. అంతేకాక ప్రభుత్వ రంగ సంస్ధలకు చెందిన అత్యంత విలువైన భూములను అమ్ముకునేందుకు అనుకూలంగా బడ్జెట్‌లో ప్రవేశపెట్టారని అన్నారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 29న తలపెట్టిన ఒక్కరోజు టోకెన్ సమ్మెలో కార్మికుందంరూ పాల్గొని, కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కల్పించాలని అన్నారు. ఈ నెల 30న ఢిల్లీలో 12 జాతీయ కార్మిక సంఘాలు సమావేశమై భవిష్యత్తు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు కీలుబొమ్మలుగా మారారని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అడుగలేక పోతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కెసి ఆర్ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో చేపట్టిన నిరాహార దీక్ష అనంతరం ఆసుపత్రిలో నర్సుల పరిస్ధితులను గమనించి, తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటయిన వెంటనే నర్సులను పర్మినెంట్ చేస్తూ అన్ని రకాల హక్కులను కల్పిస్తామని ఆ సందర్భంగా హామి ఇచ్చారని అన్నారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఆసుపత్రిలోని నర్సులు మోటర్నీటి సెలవులపై వెళ్ళి వచ్చిన వారిని విధుల్లోకి తీసుకొకుండా, నర్సులు పెళ్ళిల్లు చేసుకొని పిల్లలను కనడం నిబంధనలకు విరుద్ధమని విధుల్లోకి తీసుకొకుండా తొలగించడం ఎంత వరకు సమంజసం అని అన్నారు. ముఖ్యమంత్రి కెసి ఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలు ఎన్నడు చేయని విధంగా 450కోట్ల రుణాలను ఒక సంవత్సర కాలంలోనే అప్పులు చేశాడని అన్నాడు. రైతు రుణాలను పట్టించుకోని ముఖ్యమంత్రి సి ఎం స్పెషల్ బడ్జెట్ క్రింద 4800కోట్ల నిధులను కేటాయించుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈకార్యక్రమంలో నాయకులు నర్సింహారావు, రాజారావు, రాజిరెడ్డి, నాగరాజు, మెగిళి, రాజయ్య, రాజేశం, మెండె శ్రీను తదితరలు పాల్గొన్నారు.