రాష్ట్రీయం

పంచాయతీలకు కొత్త కళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1000 గ్రామ పంచాయతీలకు కొత్త భవనాలు మంజూరు
పాత వాటి స్థానే కొత్త నిర్మాణాలు: కెటిఆర్
హైదరాబాద్, డిసెంబర్ 31: గ్రామ పంచాయతీలు నూతన భవన సొబగులు సంతరించుకోబోతున్నాయి. నూతన సంవత్సర కానుకగా పంచాయతీ రాజ్ మంత్రి కె.తారకరామారావుగురువారం అనేక వరాలు ప్రకటించారు. రాష్టవ్య్రాప్తంగా 1000 గ్రామ పంచాయతీలకు నూతన భవనాలను అందించడంతో పాటు 656 పాత భవనాల స్థానంలో కొత్త భవనాలను మంజురు చేసినట్టు మంత్రి కెటిఆర్ తెలిపారు. గ్రామ పంచాయతీలకు కొత్త భవనాల మంజురు, పాత భవనాల స్థానంలో కొత్త భవనాల నిర్మాణానికి నూతన సంవత్సర కానుకగా ప్రకటించినట్టు వివరించారు. కొత్త భవనాలు నిర్మించడంతో పాటు పాత భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మిస్తే ఇక రాష్ట్రంలో గ్రామ పంచాయతీ భవనం లేని గ్రామం ఉండదని మంత్రి ప్రకటించారు. గ్రామ పరిపాలన వ్యవస్థను బలవోపేతం చేసేందుకు తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుకునేందుకే నూతన సంవత్సరం తొలి రోజున వీటికి సంబంధించిన అధికారిక ఆదేశాలను జనవరి ఒకటవ తేదీన జారీ చేయనున్నట్టు తెలిపారు. ‘మన ఊరు-మన ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా అందిన ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8695 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, అందులో ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ భవనాలు లేని గ్రామాలు 344 ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. వీటన్నింటికీ కొత్త భవనాలు నిర్మించనున్నట్టు మంత్రి పేర్కొన్నారు.