తెలంగాణ

త్వరలోనే లబ్ధిదారులకు వాంబే గృహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రి కెటిఆర్ వెల్లడి

హైదరాబాద్, మార్చి 12:నిర్మాణం పూర్తయినా పంపిణీకి నోచుకోని వేలాది గృహాలకు త్వరలోనే మోక్షం లభించనుంది. నగరంలో జెన్‌ఎన్‌యుఆర్‌ఎం, వాంబే గృహాల నిర్మాణం పూర్తి అయినప్పటికీ గత కొనే్నళ్ల నుంచి లబ్దిదారులకు కేటాయించకుండా వృధాగా ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చోరవ తీసుకుంది. గత ప్రభుత్వాల హయాంలో దరఖాస్తు చేసుకున్న వారు ఇటీవల మంత్రి కె తారక రామారావును కలిసి ఈ సమస్యను వివరించారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లలో వౌలిక సదుపాయాల కల్పనతో పాటు అసంపూర్తిగా మిగిలిన ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. దీనిపై మంత్రి కెటిఆర్ శనివారం రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్ల, జిహెచ్‌ఎంసి మేయర్, అధికారులతో కెటిఆర్ సమావేశం అయ్యారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాన్ని గతంలో ఉన్న నిబంధనల మేరకు పూర్తి చేయాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాలతో లబ్దిదారులకు నోటీసులు ఇవ్వాలని సూచించారు. సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు రాహుల్ బొజ్జా, రఘునందన్‌రావు, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా షఫియుద్దీన్‌లతో పాటు కమీషనర్ జనార్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.