తెలంగాణ

సకాలంలో మెట్రో మొదటి దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐదు మార్గాల్లో రెండో దశ పనులు : కెటిఆర్

హైదరాబాద్, మార్చి 12: హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాడానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో చిత్త శుద్ధితో పనిచేస్తొందని, రెండో దశ మెట్రోరైల్ నిర్మాణ పనులను 83 కిలోమీటర్ల వరకు ఐదు మర్గాల్లో చేపట్టనున్నట్లు రాష్ట్ర పురపాలక, ఐటి, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కె.తారక రామారావు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మెట్రోరైల్ పనులపై శాసన మండలిలో శనివారం ఎమ్మెల్సీ ఎంఎస్.ప్రభాకర్ అడిగిన ప్రశ్నకు కెటిఆర్ సమాధానమిస్తూ, మెట్రో మొదటి దశ పనులు సకాలంలో పూర్తిచేస్తామన్నారు. ఐదు మార్గాల్లో మెట్రో రైలును పొడిగించేందుకు అధ్యయనం చేస్తున్నామని, లీ అసోసియేట్స్ సంస్థ నగరంలో రెండో దశ మెట్రోరైల్ పనులను విస్తరింపజేయడానికి అధ్యయనం చేస్తుందని తెలిపారు. మియాపూర్-పటాన్‌చేరు వరకు 13 కిలోమీటర్లు, ఎల్బీనగర్-హయత్‌నగర్ వరకు 7కిమీ, నాగోల్-ఎల్బీనగర్-్ఫలక్‌నూమ వరకు 28కిమీ, తర్నాక-ఈసీఐఎల్ వరకు 7కిమీ, రాయదుర్గం-శంషాబాద్ మార్గాల్లో 28 కిమి కలుపుకుని మొత్తం 83 కిమి మెట్రోరైల్ పనులను విస్తరింపజేయనున్నట్లు కెటిఆర్ తెలిపారు. అదే విధంగా ఎంఎంటీఎస్ రెండో దశను యాదాద్రి వరకు పొడిగిస్తామని ఆయన చేప్పారు. పాతబస్తీలో మెట్రో పనులు 5.5 కిలోమీటర్లు పోడవు నిర్మించాల్సి ఉందన్నారు. ఈ విషయంలో స్థానిక పార్లమెంట్ సభ్యుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించి రూట్‌మ్యాప్‌ను రూపొందించడం జరుగుతుందని మంత్రి ఎమ్మెలీస సయ్యద్ ఆల్త్ఫా రజ్వీ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.