జాతీయ వార్తలు

ఎంపిపి, జెడ్‌పిలకూ నేరుగా నిధులివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రానికి కెటిఆర్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ, డిసెంబర్ 7: పంచాయతీలకే కాక జిల్లా, మండల పరిషత్‌లకూ కేంద్ర ప్రభుత్వ నిధులను నేరుగా విడుదల చేయాలని తెలంగాణ గ్రామీణాభివృద్ధి మంత్రి కెటి రామారావువిజ్ఞప్తి చేశారు. ఈమేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌ను కలిసి కోరారు. సోమవారం సింగ్‌ను కలిసి జెడ్‌పి, ఎంపిపిలకు నేరుగా నిధులు ఇవ్వాలన్నారు. నిధులు లేక జెడ్‌పి, ఎంపిపిలు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయాయని ఆయన స్పష్టం చేశారు. ఈ విధానాన్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని కెటిఆర్ అన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న విధానాన్ని మార్చడానికి అన్ని రాష్ట్రాల అంగీకారం ఎంతో అవసరమని మంత్రి బెరేంద్ర సింగ్ ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే ప్రధానితో సంప్రదించి తుది నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉందని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకాన్ని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని ప్రణాళికలను సమర్పిస్తే కేంద్రం ఆర్థిక సాయం అందించటానికి సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.