కృష్ణ

‘ఉయ్యాలవాడ’ పోరాట స్ఫూర్తి ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని జిల్లా అడిషినల్ ఎస్పీ సోమంచి సాయికృష్ణ అన్నారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఎస్పీ సాయికృష్ణ మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు వింటే గుండె ఉప్పొంగి, తెలుగు నేల పులకిస్తుందన్నారు. భరతమాత బానిస సంకెళ్లు తెంపడానికి రక్తతర్పణం చేసిన తొలి మహాయోధుడన్నారు. నరనరాన దేశ భక్తితో బ్రిటీష్ దోపిడీదారుల గుండెను చీల్చిన ఉగ్రనరసింహుడన్నారు. సిపాయిల తిరుగుబాటు కంటే ముందే బ్రిటీష్ పాలకులకు ఎదురు తిరిగి నాటి సీమలో తూటా పేల్చిన తొలి విప్లవకారుడు అయితే కుట్రతో బంధించి నడి వీధులలో నడిపించి దండోరా వేయించి వేలాది మంది సమక్షంలో ఉరి తీశారని, దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అమరులైన వారి త్యాగాలు నేటి తరాలకు స్ఫూర్తిదాయకం అన్నారు. తొలుత నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు వౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ వెంకటేశ్వరరావు, ఆర్‌ఐలు నాగిరెడ్డి, కృష్ణంరాజు, ఎవో మూర్తి, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది, డీసీఆర్‌బీ, ఆర్ముడు రిజర్వు సిబ్బంది పాల్గొన్నారు.

ముమ్మరంగా మినుము కోతలు
కూచిపూడి, : మొవ్వ మండలంలో మినుము తీతలు ముమ్మరంగా ప్రారంభమయ్యాయి. వాతావరణంలో ఏర్పడిన మార్పులు కారణంగా దాదాపు 15 రోజులకు ముందుగానే కోతలకు సిద్ధం కావటంతో కూలీలకు డిమాండ్ పెరిగింది. మొవ్వ మండలంలో ఈ ఏడాది 26,385 ఎకరాల్లో సాగు చేసిన మినుము పంట కోతకు చేరుకుందని ఎఓ కె శివప్రసాద్ శుక్రవారం తెలిపారు. మండలంలో సుమారు ఎకరాకు ఐదు బస్తాల దిగుబడి అయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే చినముత్తేవి, కోసూరు, అవిరిపూడి తదితర గ్రామాల్లో మినుము కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు.