కర్నూల్

లక్ష్య సాధనకు వైకల్యం అడ్డుకాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఏప్రిల్ 10:లక్ష్య సాధనకు అంధత్వం అడ్డుకాదని ఎస్పీ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. అంధత్వ నివారణ కోసం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో లక్ష మందితో సంతకాలు చేయించాలనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ‘నేత్రదానం చేయండి-ఇద్దరికి వెలుగునివ్వండి’ అనే నేత్రదాన ప్రతిజ్ఞ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరణించిన తర్వాత కళ్లను దానం చేయడానికి నేత్రదానం అంగీకార పత్రాలపై ఎస్పీ ఆకే రవికృష్ణ, ఆయన సతీమణి ఆకే పార్వతి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పట్టుదల, ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తే విజయం వరిస్తుందన్నారు. అంధులైన బ్యాంకు ఆఫ్ బరోడా ఉద్యోగి కోటిరెడ్డి, ఆంధ్ర బ్యాంకు ఉద్యోగి వీరేష్ ఆఫీసర్లుగా బ్యాంకు ఉద్యోగాలు సాధించినందుకు ఎస్పీ దంపతులు అభినందన సభ ఏర్పాటు చేసి వారిని సన్మానించి, నూతన వస్త్రాలు అందజేశారు. ఎందరో చిన్నారులు చూపు లేకుండా బాధ పడుతున్నారని అటుంవటి వారికి చూపునివ్వడానికి తనవంతు కర్తవ్యంగా నేత్రదానం చేస్తామన్నారు. అదే స్ఫూర్తితో ఓఎస్‌డి రవిప్రకాష్ తన కుటుంబ సభ్యులతో కలిసి నేత్రదానం అంగీకార పత్రంపై సంతకాలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఎవరైనా మృతి చెందినప్పుడు వారి కుటుంబ సభ్యుల అనుమతితో కళ్లు దానం చేయించి అంధులకు ఉపయోగపడేలా కృషి చేస్తామన్నారు. జిల్లాలోని అంధ విద్యార్థులను చైతన్యపరచడానికి అందరి సహాయ సహకారాలు అవసరమన్నారు. ఈ అంధ విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకుని జిల్లాలోని యువకులైన విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని వాటిని సాధించే వరకూ కష్టపడాలని ఎస్పీ సూచించారు. అనంతరం ఎస్పీ కుటుంబ సమేతంగా అంధ విద్యర్థులకు అల్పాహారం వడ్డించి వారితో కలిసి భుజించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డా నరేంద్రనాథ్‌రెడ్డి, జాతీయ అంధత్వ నివారణ సంస్థ మెడికల్ డైరెక్టర్ డా భరణికుమార్‌రెడ్డి, ఏఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఓఎస్‌డి రవిప్రకాష్, డీఎస్పీలు రమణమూర్తి, బాబుప్రసాద్, మురళీధర్, వీరరాఘవరెడ్డి, హుస్సేన్‌పీరా, రాజశేఖర్‌రాజు, దేవదానం, వినోద్‌కుమార్, కృష్ణమూర్తి, ఆర్‌ఐ రంగముని, సిఐలు ములకన్న, నాగరాజారావు, క్రిష్ణయ్య, మధుసూదన్‌రావు, రెడ్‌క్రాస్‌సొసైటీ చైర్మన్ శ్రీనివాసులు, మేనేజర్ నాగరాజు, ఆర్‌ఎస్‌ఐలు సింగర్ శ్రీనివాసులు, సోషల్ వర్కర్ రమేష్‌చంద్ర, తదితరులు పాల్గొన్నారు.