జాతీయ వార్తలు

ఇది కళల కుంభమేళా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భిన్న సంస్కృతుల దిక్సూచి భారత్ సాంస్కృతిక సమ్మేళనంలో మోదీ
అవరోధాలు సహజం..ఎదుర్కోవాలి స్పష్టం చేసిన రవిశంకర్
న్యూఢిల్లీ, మార్చి 11:విభిన్న సంస్కృతులు, సంప్రదాయాల మేలుకలయికగా భాసిల్లుతున్న భారతావనిని చూసి ప్రపంచం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడ ప్రారంభమైన ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనాన్ని కళల కుంభమేళాగా అభివర్ణించారు. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన 5కోట్ల రూపాయల జరిమానా వ్యవహారం తీవ్ర వివాదం సృష్టించిన నేపథ్యంలో అసలు ఈ సదస్సు జరుగుతుందా లేదా అన్న సందేహాలు తలెత్తాయి. చివరికి 25లక్షల రూపాయలు శుక్రవారం మిగతా మొత్తాన్ని తదుపరి గడువు చెల్లించాలని ఎన్‌జిటి స్పష్టం చేయడంతో సాంస్కృతికోత్సవం మొదలైంది. ఈ మూడు రోజుల మహోత్సవంలో పాల్గొన్న మోదీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ కృషిని ప్రశంసించారు. ఆయన కృషి వల్లే వైవిధ్య భరిత భారతావని గురించి ప్రపంచానికి మరింతగా తెలిసిందన్నారు. ప్రపంచ దేశాల దృష్టిలో భారత దేశ ఔన్నత్యాన్ని మరింత పెంచడంలో రవిశంకర్ కృషి ఎంతో ఉందన్నారు. ప్రపంచంలో ఏ దేశానికీ లేని వైవిధ్యం, సాంస్కృతిక, సంప్రదాయక వైభవం భారత్ ఉన్నాయని మోదీ అన్నారు. ప్రతి ఒక్కరూ గర్వపడే సమున్నత సాంప్రదాయక వారసత్వం భారత్‌కు ఉందని పేర్కొన్న మోదీ 3ఈ మహోత్సవం కళలు, సంస్కృతుల కుంభమేళ. భారత నలుమూలల నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచీ వేలాదిగా జనం తరలిరావడమే ఇందుకు తార్కాణం2అని అన్నారు. సమావేశ ప్రారంభం సందర్భంగా మాట్లాడిన రవిశంకర్ ప్రధాని మోదీ, ఇతర ప్రపంచ ప్రముఖులకు స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరూ నవ్వుతూ ఉండాలని, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని అన్నారు. ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనం తన వ్యక్తిగత కార్యక్రమం కాదని, మొత్తం ప్రపంచమే తరవి వచ్చిన అద్భుత సందర్భమని రవిశంకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంపై వచ్చిన విమర్శలను ప్రస్తావించిన ఆయన ఓ మహత్తర సమ్మేళనాన్ని చేపట్టినప్పుడు ఇలాంటి అవరోధాలు సహజమేనన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని ఉద్ఘాటిస్తూ..ప్రకృతిని ప్రేమించడం అన్నది ప్రతి ఒక్కడి డిఎన్‌ఏలో ఉందన్నారు.ఈ ప్రపంచమే తన కుటుంబమని పేర్కొన్న రవిశంకర్ స్వార్థ చింతన లేని వ్యక్తి మొత్తం ప్రపంచ సమాజానికే చెందుతాడన్నారు. (చిత్రం) ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనానికి హాజరైన ప్రధాని మోదీ