కర్నూల్

రుణమాఫీ కాని రైతులు దరఖాస్తు చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు, జనవరి 3:నిబంధనలకు లోబడి, ప్రభుత్వ షరతుల ప్రకారం ఇప్పటికీ రుణమాఫీ కాని రైతులు వుంటే ధ్రువపత్రాలతో పాటు సమస్యను తమ దృష్టికి తెస్తే వారికి రుణమాఫీ వర్తించేందుకు చర్యలు తీసుకుంటామని రైతు సాధికార సంస్థ ఓఎస్‌డి కృష్ణారావు, ఆడిటర్ దేవేంద్రకుమార్ తెలిపారు. రైతుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం చేసిన రుణమాఫీ సొమ్ము అర్హుల ఖాతాలోనే జమ అయ్యిందా లేదా అని వారు మంగళవారం స్థానిక జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, ప్రాథమిక సహకార సంఘంలోని రైతుల ఖాతాలను తనిఖీ చేశారు. అనంతరం వారు విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రైతు సాధికార సంస్థ చైర్మన్ కుటుంబరావు, సిఇఓ మధుసూదన్‌రావు ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేశామన్నారు. 2014 రైతు రుణమాఫీ ఫేజ్-1 నుంచి ఫేజ్-7 వరకూ, రెండవ విడత రుణమాఫీ మొత్తాలు నిజమైన రైతుల ఖాతాలో జమ అయినట్లు తేలిందన్నారు. సహకార బ్యాంకు, సహకార సంఘాల్లోని 847మంది రైతుల ఖాతాల్లో రూ. 1.1 కోట్లు జమ అయినట్లు తెలిపారు. రైతుల ఖాతాల్లో ఎటువంటి అక్రమాలకు చోటులేకుండా నిజమైన లబ్ధిదారులకే రుణమాఫీ చేకూరినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అగ్రికల్చర్, హార్టికల్చర్ కింద అన్ని బ్యాంకుల్లో 59 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 11,011 కోట్లు జమ చేశామన్నారు. రుణమాఫీతో పాటు బ్యాంకు కార్యకలాపాలు, సహకార సంఘాల పనితీరు సక్రమంగా వుండడంతో వారిని అభినందించారు. కార్యక్రమంలో సహకార కేంద్ర బ్యాంకు మేనేజర్ పులిరాజు, సూపర్‌వైజర్ వెంకటరమణ, సహకార సంఘం సిఇఓ రబ్బాని పాల్గొన్నారు.
రాఘవేంద్రుని సేవలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్
మంత్రాలయం, జనవరి 3: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం మంగళవారం రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ సతీ సమేతంగా వచ్చారు. వారికి మఠం అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. వారు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని పసుపుకుంకుమ సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందానాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు శేష వస్త్రం, ఫల పుష్ప మంత్రాక్షితలు, జ్ఞాపికను ఇచ్చి ఆశీర్వదించారు. కార్యక్రమంలో మేనేజర్ శ్రీనివాస్‌రావు, సహాయ మేనేజర్ ఐపి నరసింహమూర్తి, ధార్మిక సిబ్బంది వ్యాసరాజాచార్ తదితర మఠం అధికారులు పాల్గొన్నారు.