కర్నూల్

ఎస్‌ఐ సెలక్షన్స్‌లో ఆగిన కానిస్టేబుల్ గుండె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జనవరి 7 : నగరంలోని ఏపిఎస్పీ మైదానంలో జరుగుతున్న ఎస్‌ఐ సెలక్షన్స్‌లో పాల్గొన్న బాలాజీనాయక్ ఆకస్మికంగా మృతిచెందాడు. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం పోడుగురాళ్లపల్లి గ్రామానికి చెందిన బాలాజీనాయక్ 2007లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తు తం అనంతపురం నగరంలోని 1వ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం ఉదయం 7 గంటల సమయంలో 1600 మీటర్ల పరుగులో పాల్గొన్న బాలాజీనాయక్ ఉన్నఫళంగా కుప్పకూలి పడిపోయాడు. దీంతో పరుగును పర్యవేక్షిస్తున్న పోలీసులు హుటాహుటిన అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అతడు కార్డియాలజీ యూనిట్‌లో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఎస్పీ ఆకే రవికృష్ణ ఆసుపత్రికి చేరుకుని కానిస్టేబుల్ బాలాజీనాయక్ మృతదేహాన్ని సందర్శంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఎస్పీతో పాటు ఎస్బీ డీఎస్పీ బాబుప్రసాద్, 3వ పట్టణ సిఐ మధుసూదన్‌రావు ఉన్నారు. అలాగే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు కర్నూలుకు చేరుకుని కానిస్టేబుల్ మృతదేహాన్ని అనంతపురం తరలించారు.
సిద్దాపురం ఎత్తిపోతల నుంచి
60 రోజుల్లో నీరు పారాలి
* అధికారులకు కలెక్టర్ ఆదేశాలు
ఆత్మకూరు, జనవరి 7 : సిద్దాపురం ఎత్తిపోతల పథకం నుంచి 60 రోజు ల్లో పొలాలకు నీరు పారాలని ఇరిగేషన్, తెలుగు గంగ అధికారులను కలెక్టర్ విజయమోహన్ ఆదేశించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో శనివారం కలెక్టర్ ఇరిగేషన్, తెలుగుగంగ అధికారులతో సిద్దాపురం ఎత్తిపోతల పథకం పనులపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకం పూర్తయితే దాదాపు 25 వేల ఎకరాకు సాగునీరు అందించవచ్చన్నారు. పిల్లకాలువ నిర్మాణం వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించే విషయంపై ప్రత్యేక కలెక్టర్ సత్యంను అడిగి వివరాలు తెలుకున్నారు. భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం రూ. 7 కోట్లు కేటాయించిందని, అందులో ఇప్పటికే కొందరికి రూ. 5 కోట్లు చెల్లించామన్నారు. మిగిలిన రూ. 3 కోట్లు కూడా త్వరలోనే పంపిణీ చేస్తామని ఆయన వివరించారు. భూములను ఇరిగేషన్ అధికారులకు అప్పగించామన్నారు. ప్రభు త్వం పరిహారం పాస్ చేసింది కావున రైతులు పనులను అడ్డుకోకూడదన్నారు. ఎవరైనా పనులకు ఆటంకం కలిగిస్తే పోలీసులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కాలువలు త్వరగా పూర్తి చేయడానికి మరో 5 మిషన్లు ఇస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఇరిగేషన్ శాఖలో ఉన్న జెఇలు బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులు ఆత్మకూరు పట్టణ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత స్తంభాలను పడగొట్టారని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన కలెక్టర్ ఆ విషయపై విచారణ చేయాలని డీఎస్పీని ఆదేశించారు. స్టేజ్-1, స్టేజ్-2 వద్ద జరుగుతున్న విద్యుత్ లైన్ల గురించి తెలుగుగంగ అధికారులు వివరించారు. 11 కి.మీలో 7 కి.మీ అండర్ గ్రౌండ్‌లో 32 కెవి కేబుల్ ఏర్పాటు చేశామని, మిగిలిన పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని వివరించారు. ఆత్మకూరు నుంచి సిద్దాపురం చెరవు వరకూ వున్న 16 కి.మీ పొడవునా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ 60 రోజులు అధికారులు అప్రమత్తంగా ఉండి పనులు వేగవంతంగా చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్‌తో పాటు విద్యుత్ శాఖ ఎస్‌ఇ భార్గవరెడ్డి, ఆర్‌డిఓ రఘురామ్, డీఎస్పీ సుప్రజ, సిఐ కృష్ణుడు, తదితరులు ఉన్నారు.