కర్నూల్

సీమ వెనుకబాటుకు ఫ్యాక్షనే కారణం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవనకొండ, ఏప్రిల్ 24: ఫ్యాక్షన్ కారణంగా రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందలేదని డిప్యూటీ సిఎం కెయి కృష్ణమూర్తి అన్నారు. ఆదివారం ఎస్పీ రవికృష్ణ దత్తత గ్రామమైన కప్పట్రాళ్ళలో డిజిపి జెవి. రాముడుతో కలిసి రూ.32 లక్షలతో నిర్మించిన జిల్లా పరిషత్ ప్రహరీగోడను, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, రూ.3లక్షల 50వేలతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను, మహిళ కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ గతంలో లీడర్ల వాహనాలు తుపాకులతో నిండి ఉండేవని, ప్రస్తుతం ఆ సంస్కృతి లేదన్నారు. గతంలో కప్పట్రాళ్ళ గ్రామాన్ని చూస్తే కళ్ళుకు నీళ్లు వచ్చేవని, ఎస్పీ తీసుకున్న ప్రత్యేక చొరవతో నేడు ఆనంద బాష్పాలు వస్తున్నాయని కెయి అన్నారు.
రాష్ట్రంలో డిపిజి తీసుకుంటున్న ప్రత్యేక చొరవ వల్ల ఫ్యాక్షన్ పూర్తిగా తగ్గిందన్నారు. సిఎం చంద్రబాబునాయుడు ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని కెయి పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నీరు-చెట్టు పంట సంజీవిని రైతులకు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టిన వారికి ప్రజలే బుద్ధి చెప్పారన్నారు. చంద్రబాబునాయుడు రాజధాని నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేస్తుంటే రాయలసీమకు ద్రోహం చేసి అమరావతిని నిర్మిస్తున్నారని కొందరు చేస్తున్న ఆరోపణలు అవస్తవమని అన్నారు. చంద్రబాబు రైతులకు 20 గంటలు విద్యుత్ ఇస్తున్నారని, రూ.24వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని అన్నారు. ఆయన నాయకత్వంలో ఇంక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, అయితే వాటికి ప్రజల సహకారం అవసరమని కెయి అన్నారు. అనంతరం డిజిపి మాట్లాడుతూ కప్పట్రాళ్ళ గ్రామంలో ఫ్యాక్షన్ అంతం చేయడమే కాక గ్రామ ప్రజల్లో ఎస్పీ మార్పు తేవడం నిజమైన అభివృద్ధిని అన్నారు. పాత ఆలోచనల పక్కన పెట్టి కొత్త ఆలోచనలతో ముందుకెళి కప్పట్రాళ్ళ గ్రామాన్ని రాష్ట్రంలోనే కాక దేశంలోనే అగ్రగామిగా నిలుపవచ్చని డిజిపి తెలిపారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని యువత భారత దేశానికి ఉందని, ఆ యువతకు మంచి విద్యనందించి తల్లిదండ్రులు మంచి మార్గంలో నడిపిస్తే మనదేశాన్ని ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలుపవచ్చన్నారు. యువత ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాక్షన్ వైపు చూడకూడదన్నారు. చేతినిండా పని లేకపోతే పక్కదారి పట్టే అవకాశం ఉందన్నారు. కప్పట్రాళ్లను దేశంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని డిజిపి స్పష్టం చేశారు.
ఎస్పీ మాట్లాడుతూ 10 ఏళ్ళులో కప్పట్రాళ్ళ గ్రామం నుండి ఒక ఐఎఎస్, ఒక ఐపిఎస్‌ను తయారు చేయడమే తమ లక్ష్యమని తెలియజేశారు. ఈకార్యక్రమంలో ఎపిబిజి చైర్మన్ సంపత్‌కుమార్ ఆచారి, రాయలసీమ ఐజి వేణుగోపాల్ కృష్ణ, రాయలసీమ డిఐజి రమణకుమార్, రెండో బెటాలియన్ కామాండెంట్ విజయ్‌కుమార్, అడిషనల్ ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఆలూరు టిడిపి ఇన్‌ఛార్జి వీరభద్రగౌడ్, మంత్రాలయం ఇన్‌ఛార్జి తిక్కారెడ్డి, ఎంపిపి రామచంద్రనాయుడు, జడ్పీటీసీ బొజ్జమ్మ, ఎంపిటిసి హైమావతి, డిఎస్‌పి బాబా ఫకృద్దీన్, బాబుప్రసాద్, వీరరాఘవరెడ్డి, దేవదానం, సుప్రజలు, పత్తికొండ సిఐ విక్రమ సింహ, దేవనకొండ ఎస్‌ఐ శ్రీనివాసులు, నాయకులు ఉచ్చిరప్ప, రామరావునాయుడు, సుబాన్, చంద్రబాబునాయుడు, హెచ్‌ఎం రామరాజు, పోలీసు సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.