కర్నూల్

సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, ఏప్రిల్ 24:సమస్య ఏదైనా ఉంటే దానిని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, దాడులకు పాల్పడటం అప్రజాస్వామిక చర్య అని టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి పేర్కొన్నారు. శిల్పా ఆదివారం నగరంలోని జిల్లా టిడిపి కార్యాలయానికి వచ్చి దాడి జరిగిన సంఘటన, విధానం గురించి తెలుసుకుని, ధ్వంసమైన ఫర్నిచర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా శిల్పా మాట్లాడుతూ శాంతియుతంగా నిరసనలు, ఉద్యమాలు చేసుకోవచ్చు కానీ దాడులకు పాల్పడటం సమంజసం కాదన్నారు. గతంలో ఎస్సీ వర్గీకరణను ప్రతిపక్షాలు వ్యతిరేకించినా ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు పరిచారని, అయితే కొన్ని సాంకేతికపరమైన కారణాల దృష్టా అమలు చేయలేకపోయారని వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ఆమోదించాల్సి ఉందని, అది తెలుసుకోకుండా ఇలా దాడులకు పాల్పడటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. శిల్పాతో పాటు టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నాగేశ్వరరావుయాదవ్, కెడిసిసి బ్యాంక్ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, బాబురాజ్, పోతురాజు రవికుమార్, హేమంత్‌కుమార్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.