కర్నూల్

నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోనిటౌన్, జనవరి 20: ఎన్నికల్లో ఇంటికి ఒక ఉద్యోగం లేదా ప్రతి నిరుద్యోగికి రూ.1000నుంచి రూ.2వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టిడిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, నిరుద్యోగులను మోసం చేసిందని వైఎస్‌ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్రప్రధాన కార్యదర్శి ఫయాజ్ అహ్మద్ ఆరోపించారు. శుక్రవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరుద్యోగులు, విద్యార్థులు ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఎన్నికల్లో నిరుద్యోగులకు వరాలు ఇచ్చి గెలుపొందిన అనంతరం చంద్రబాబునాయుడు అసలు పట్టించుకోలేదన్నారు. జాబు రావాలంటే బాబురావాలని విస్త్రృత ప్రచారం చేసి నేడు నిరుద్యోగులను విస్మరించారన్నారు. ఇప్పటికైనా నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ భృతి గత మూడు సంవత్సరాలకు సంబంధించిన రూ.70వేలు బకాయిలు ఒక్కొక్కరికి ఇవ్వాలని అలాగే ఇప్పటి నుంచి రూ.2వేలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేష్, మన్సూర్, లక్ష్మీకాంత్,వినయ్, రాజు, చిన్న, వైఎస్‌ఆర్ సాయియూత్ నాయకులు చలపతి, శంకర్, ఏసేపు, తదితరులు పాల్గొన్నారు.
ఆక్రమిత అటవీ భూముల పరిశీలన
మహానంది, జనవరి 20: అటవీ హక్కు చట్టం ప్రకారం అటవీ భూమిని సెంటు ఆక్రమించినా వారిపై నాలుగు కేసులు నమోదు చేస్తున్నట్లు డిఎఫ్‌ఓ శివ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆ యన నంద్యాల డివిజన్ పరిధిలో ఆక్రమణకు గురైన భూములను పరిశీలించారు. మహానంది, కృష్ణనంది భూ ములు పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ నంద్యాల డివిజన్ పరిధిలో 198 ఎకరాలు, రేంజ్ ప రిధిలో 88.37 ఎ కరాలు అటవీ భూ ములు ఆక్రమణకు గురైనట్లు ధ్రువీకరించామన్నారు. వీటిని స్వాధీన పరచుకొనేందుకు వారికి నోటీసులు అందించేందుకై పరిశీలన చేసేందుకు వచ్చామన్నారు. అటవీ హక్కు చట్టం ప్రకారం భూ ఆక్రమణలు చేసిన వా రిపై వన్యప్రాణి సంరక్షణ, సమస్తజాతి రక్షణ, ఆక్రమణలు, అటవీ హక్కుల చట్టం అనే నాలుగు కేసులు నమోదు చేయబడతాయన్నారు. ఆక్రమించిన రైతు లు స్వచ్ఛందంగా అప్పగించాలన్నారు. వీరి వెంట రేంజ్ ఖాదర్‌బాషా, ఎఫ్‌ఎస్‌ఓ లక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఓటు నమోదుపై అవగాహన
ఆళ్లగడ్డ, జనవరి 20: పట్టణంలోని ప్రజ్ఞా జూనియర్ కళాశాలలో ఓటు హక్కు కార్యక్రమంపై విద్యార్థులకు ఆర్‌డిఓ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌డిఓ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఓటరు ఓటు నమోదు చేసుకోవాలన్నారు. 36 రాష్ట్రాల్లో 85 కోట్ల మంది ఓటర్లు వున్నారన్నారు. మనది ప్రజాస్వామ్య దేశం అని ఎవరినైనా ఎన్నుకోవాలంటే ఓటుద్వారానే అన్నారు. ఈ నెల 25న జాతీయ ఓటరు దినోత్సవా న్ని ప్రభుత్వం పండుగ వాతావరణం లో నిర్వహించాలని నిర్ణయించిందన్నా రు. అందులో 18 సంవత్సరాలు నిండి న వారి నుండి ఓటు నమోదు కోసం దరఖాస్తు స్వీకరణ వుంటుందన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సత్య శ్రీనివాసు లు, సీనియర్ అసిస్టెంట్ అనిల్, ప్రజ్ఞా కళాశాల డైరెక్టర్ నరసింహారెడ్డి, ప్రిన్సిపాల్ హేమలతారెడ్డి పాల్గొన్నారు.