కర్నూల్

క్రీడలతో ఆరోగ్యం మెరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, జనవరి 20: విద్యార్థి దశ నుండి క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక దారుఢ్యంతోపాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని తద్వారా వృద్దాప్యంలో కూడా ఆరోగ్యంగా ఉండవచ్చని డిఎస్పీ హరినాథ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఆఫీసర్స్ క్లబ్‌లో సీమ స్థాయి షటిల్ బాడ్మింటన్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఆఫీసర్స్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు చిన్నపురెడ్డి, కొండారెడ్డిల నేతృత్వంలో ఉదయం డిఎస్పీ కొద్దిసేపు షటిల్ ఆడి హర్షం వ్యక్తం చేశారు. సీనియర్ సిటిజన్లు పెద్ద సంఖ్యలో షటిల్ బాడ్మింటన్ పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. 60 సంవత్సరాలు పైబడిన వారు షటిల్ బాడ్మింటన్ ఆడుతుంటే వారి ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందన్నారు. విద్యార్థి దశ నుండి క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక వికాసంతోపాటు శారీరకంగా ధృడంగా ఉంటారని దీంతో సైన్యం, పోలీసు శాఖల్లో ఉద్యోగాలు సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ఆఫీసర్స్ క్లబ్ వారు ప్రతి ఏటా వివిధ రకాల క్రీడలు నిర్వహించడం హర్షనీయమన్నారు. ఐదు విభాగాలలో షటిల్ బాడ్మింటన్ పోటీలు సీమ స్థాయిలో నిర్వహించి ఒక్కొక్క గ్రూపుకు రూ.11 వేల నగదు బహుమతులు అందిస్తున్నట్లు క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. ఉగాది పండుగను పురస్కరించుకొని రాష్టస్థ్రాయి క్యారమ్స్ పోటీలు నిర్వహించేందుకు నిర్ణయించుకున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆఫీసర్స్ క్లబ్ స్పోర్ట్స్ కార్యదర్శి డా.కాంతారెడ్డి, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
లబ్ధిదారులు మార్చిలోపు ఇళ్లు నిర్మించుకోవాలి
మహానంది, జనవరి 20: మండలంలో ఇటీవల మంజూరైన గృహాలు మార్చిలోపు పూర్తి చేసుకోవాలని గృహ నిర్మాణ శాఖ పిడి హుసేన్ సాహెబ్ తెలిపారు. శుక్రవారం ఆయన మండలంలో మంజూరైన గృహాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్నంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌టిఆర్ గృహకల్ప కింద తిమ్మాపురం కు 26, అబ్బీపురంకు 17, అల్లీనగరంకు 34 గృహాలు మంజూరయ్యాయని తెలిపారు. లబ్ధిదారులను చైతన్య పరచేందుకు వచ్చామన్నారు. ఈయన వెంట ఇఇ సుధాకర్‌రెడ్డి, డిఇ మాధవరావు, ఎఇ షఫివుల్లా, ఎంపిటిసి దస్తగిరి పాల్గొన్నారు.
పాఠశాల పునఃప్రారంభం
కొలిమిగుండ్ల, జనవరి 20: మండలంలోని కొండమీదపల్లె గ్రామంలో ఆరు సంవత్సరాల తరువత ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభానికి నోచుకుంది. ఈ గ్రామంలో గతంలో ప్రాథమిక పాఠశాల నడిచేది. గతంలో ఈ పాఠశాలను మూసివేశారు. ఇటీవల జన్మభూమి కార్యక్రమంలో మండల నోడల్ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారులు రవీంద్రనాదరెడ్డి బనగానపల్లె ఎమ్మెల్యే బిసి జనార్థన్‌రెడ్డిలతో కలసి కొండమీదపల్లె గ్రామంలో జన్మభూమి గ్రామసభను ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా గ్రామస్థులు తమ గ్రామంలో పాఠశాల పరిస్థితిపై వివరించగా డిఇఓ రవీంద్రనాథ్‌రెడ్డి వెంటనే చర్యలు తీసుకొని పాఠశాల పునఃప్రారంభానికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాఠశాల ప్రారంభానికి నోచుకుంది. ప్రారంభ కార్యక్రమంలో సుంకన్న, క్లస్టర్ కో- ఆర్డినేటర్ శ్రీనివాసులు, సిఆర్‌పి మద్దిలేటి, బెలుం శింగవరం గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు మహబూబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు ఎన్నికలు
చాగలమర్రి, జనవరి 20: ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు ఆయువుపట్టుగా నంద్యాల రెవెన్యూ డివిజన్ అధికారి సుధాకర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక శ్రీ వాసవి డిగ్రీ కళాశాలలో ఓటు హక్కుపై ప్రిన్సిపల్ దామోదరుడు అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆర్డీఓ మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన రాజకీయ పార్టీల ప్రభుత్వాలు ఏర్పడతాయన్నారు. ఎన్నికల్లో సరైన, మంచి అభ్యర్థులకు ఓట్లు వేస్తే మంచి పాలన లభిస్తుందన్నారు. భారత పౌరుడై ఉండి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తమ ఓటును నమోదు చేసుకోవాలన్నారు. ఓటు నమోదు చేసుకోకపోతే ఎన్నికల్లో ఓటు వేయడానికి అవకాశం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌లు మాలకొండయ్య, శ్రీనివాసులు, ఎంపిడిఓ శ్రీలత, ఎంఇఓ అనురాధ, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి సుబ్రమణ్యం అధ్యాపకులు పాల్గొన్నారు.