కర్నూల్

అక్రమ వాణిజ్య సిలిండర్లు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల రూరల్, జనవరి 20: ప్రొద్దుటూరు నుండి నంద్యాలకు తరలిస్తున్న వాణిజ్య సిలిండర్లను రెవెన్యూ అధికారులు పట్టుకొని సీజ్ చేశారు. వీటిని హరిహర గ్యాస్ ఏజెన్సీకి అప్పగిస్తున్నట్లు తహశీల్దార్ శివరామిరెడ్డి శుక్రవారం తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని చాంద్‌తారా, భీమాస్, శివశంకర్ హోటళ్ల వద్ద అనుమతి లేకుండ నిల్వ ఉంచిన 50 గ్యాస్ సిలిండర్లను పట్టుకున్నట్లు తెలిపారు. అక్రమంగా రవాణా చేస్తూ అధిక సంఖ్యలో వాణిజ్య సిలిండర్లు అమ్ముతున్నారని కొందరు ఇచ్చిన సమాచారం మేరకు హుటాహుటిన వెళ్లి దాడులు చేసినట్లు తెలిపారు. పట్టుకున్న వారిలో ఆర్‌ఐ శివ ప్రసాద్‌రెడ్డి, ఎఫ్‌ఐ విజయశేఖర్, సిఎస్‌డిటి జనార్థన్‌శెట్టి, విఆర్‌ఓలు సుబ్బారావు, శివయ్య, బాలన్న, మాధవరావు తదితరులు ఉన్నారు.
కార్మికుల నిధులు మళ్లించరాదు
నంద్యాల టౌన్, జనవరి 20: కార్మిక నిధులు మళ్లించరాదని భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని లేబర్ కార్యాలయం వద్ద ఎఐటియుసి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టినట్లు జిల్లా కార్యదర్శి ప్రసాద్ తెలిపారు. ఈ దీక్షల్లో భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శి చౌడప్ప, అధ్యక్షులు అజీస్, ఉపాద్యక్షులు కరీం తదితరులు కూర్చున్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ చట్టం కావాలని అనేక ఉద్యమాల ఫలితంగా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ చట్టం ఏర్పడిందని, అయితే ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులను చంద్రన్న భీమా పథకానికి మళ్లించడం దారుణమన్నారు. సంక్షేమ చట్టం ద్వారా కార్మికులకు వచ్చే నిధులను వారికే కేటాయించాలని వారు పేర్కొన్నారు.
బైపాస్ భూ సేకరణ పరిశీలన
నంద్యాల రూరల్, జనవరి 20: మండలంలోని పెద్దకొట్టాల గ్రామంలో రూ.1.37 కోట్లతో నిర్మిస్తున్న బైపాస్ రహదారి నిర్మాణానికి భూ సేకరణను పంచాయతీ రాజ్ అధికారులు ఇఇ సుబ్బారెడ్డి, డిఇ నాగరాజులతోపాటు ఎఇలు రాజశేఖర్‌రెడ్డి, భాస్కర్, ప్రభాకర్‌లు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దకొట్టాల గ్రామ రహదారిలో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బైపాస్ రహదారి నిర్మాణానికి రూ.1.37 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. అయ్యలూరు, పొన్నాపురం, పెద్దకొట్టాల గ్రామాల ప్రజలకు ఈ రహదారి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ గ్రామాల మీదుగా మహానంది పుణ్యస్థానానికి వెళ్లేందుకు కూడా ఎంతో వీలుగా ఉంటుందనే ఉద్దేశ్యంతో బైపాస్ నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. వీరి వెంట సర్పంచులు భాస్కర్‌రావు, రామలక్షమ్మ, పాపిరెడ్డిలతోపాటు విఆర్‌ఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.