కర్నూల్

చౌక బియ్యం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనగానపల్లె, జనవరి 20:మండల పరిధి పసుపుల గ్రామ సమీపంలో శుక్రవారం అక్రమంగా తరలిస్తున్న 200 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తహశీల్దార్ అనూరాధ తెలిపారు. బనగానపల్లెకు చెందిన బసవరాజు, మరోవ్యక్తి రేషన్ బియ్యాన్ని సేకరించి అక్రమంగా కర్నాటకకు తరలిస్తున్నట్లు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో వారు దాడులు చేసి రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, అనంతరం బనగానపల్లె సివిల్ సప్లయ్ గోడౌన్‌లో అప్పగించినట్లు తెలిపారు. ఈ సమాచారాన్ని కలెక్టర్‌కు నివేదించామని, విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తహశీల్దార్ తెలిపారు.
మిడుతూరులో..
మిడుతూరు : మండల పరిధిలోని నాగలూటి గ్రామ సమీపంలో శుక్రవారం మినీ లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. నందికొట్కూరు నుంచి మినిలారీలో 200 ప్యాకెట్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు దాడి చేసి డ్రైవర్ రఫిని అదుపులోకి తీసుకుని, స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించామన్నారు. మండల పరిధిలో ఎక్కడైనా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే తమకు సమచారం అందజేస్తే వారి పేర్లు గోప్యంగా వుంచి అక్రమార్కులకు అడ్డుకట్ట వేస్తామని ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.
యువతకు ఉపాధి కల్పించేందుకే
ఉద్యోగమేళా
* ఎమ్మెల్యే బిసి జనార్ధనరెడ్డి
బనగానపల్లె, జనవరి 20:చదువుకున్న యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకే తాము ఉద్యోగ మేళా ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే బిసి జనార్ధనరెడ్డి తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం వివిధ పెద్ద కంపెనీల ఆధ్వర్యంలో మెగా ఉద్యోగమేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు రావడం లేదన్నారు. దీంతో తాము ఈ ప్రాంతంలో కరవు పరిస్థితుల గురించి సిఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ఆయన సహకారంతో ఈ ఉద్యోగ మేళా ఏర్పాటు చేశామన్నారు. చదువుతో పాటు నైపుణ్యం సాధించడం ద్వారానే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. నిరుద్యోగులు వివిధ కంపెనీల వద్దకు వెళ్లకుండా వారినే ఈ ప్రాంతానికి రప్పించి మేళా నిర్వహించామన్నారు. ఈ మేళాకు పదవ తరగతి ఫెయిల్ అయిన వారి నుంచి ఉన్నత చదువులు చదివిన వారు 1500 మందికి పైగా హాజరయ్యారన్నారు. దీంతో ఆయా కంపెనీల ప్రతినిధులు యువతీ, యువకుల సర్ట్ఫికెట్లను పరిశీలించి అర్హులైన, అవసరమైన వారిని తీసుకుంటారన్నారు. ఇలాంటి మేళాలు భవిష్యత్తులో కూడా మరిన్ని నిర్వహించి యువతకు అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. అలాగే వివిధ వృత్తుల్లో నైపుణ్యం సాధించాలా శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏపిఎస్‌ఎస్‌డిసి ప్రాజెక్టు మేనేజర్ వినె్సంట్, కళాశాల ప్రిన్సిపాల్ స్వర్ణలత, అధ్యాపకులు, పట్టణ ప్రముఖులు, నిరుద్యోగ యువతీ, యువకులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.