కర్నూల్

ప్రజా సంక్షేమమే బిజెపి లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, జనవరి 21: ప్రజా సంక్షేమం ద్యేయంగా బిజెపి ప్రభుత్వం పని చేస్తుందని ఆ పార్టీ పట్టణ అధ్యక్షులు కునిగిరి నాగరాజు స్పష్టం చేశారు. బిజెపి చేపట్టిన పథకాలను విస్తృతంగా ప్రజల్లో ప్రచారం సాగిస్తామన్నారు. బేటి బడావో, బేటి బచావో కార్యక్రమం ద్వారా బాలికలకు, మహిళలకు సముచిత స్థానం కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పోలవరకు నిధులు, ప్రాజెక్టుల నిర్మాణం కోసం, రోడ్లు నిర్మాణంకై కోట్ల రూపాయాలను రాష్ట్రానికి కేటాయించిందన్నారు. ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ నిధులను రాష్ట్రానికి ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే నోట్ల రద్దు చేసి నల్లధనాన్ని వెలికి తీసిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందన్నారు. కేంద్రం చేసిన, చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించడానికి ఆదోనిలో విస్త్రృత ప్రచారం చేస్తున్నారున్నారు. శనివారం క్రాంతినగర్‌లో బిజెపి సంక్షేమ పథకాలపైన భారీ ఊరేగింపు జరిపి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈకార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి విజయ్‌కృష్ణ, మహిళ మోర్చ నాయకురాళ్లు నాగలక్ష్మీ, వినీతగుప్త, సాకరే రాఘవేంద్ర, జిందేసాయి, జిందేనాగేష్, ఉరుకుందు, నర్సప్ప, బాలాజీ, నాయకురాళ్ళు అనిత, ఇందు, దత్త, తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ ఓటుహక్కు
వినియోగించుకోవాలి:జెసి
చిప్పగిరి, జనవరి 21: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ తిప్పేనాయక్ అన్నారు. శనివారం స్థానిక జూనియర్ కళాశాల సమావేశ భవన్‌లో ప్రిన్సిపాల్ దేవకిదేవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓటు హక్కు అవగాహన సదస్సులో ఓటు నమోదు, హక్కు విషయాలపై కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. సదస్సులో తహశీల్దార్ బాల గణేశయ్య, సిబ్బంది, మండల విద్యాధికారి నారాయణ స్వామి, జిల్లా పరిషత్ హైస్కూలు ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ, కళాశాల అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే మండలంలోని నేమకల్లు జిల్లాపరిషత్ హైస్కూలులో ప్రధానోపాధ్యాయులు వెంకటస్వామి ఆధ్వర్యంలో ఓటరునమోదు అవగాహన సదస్సు జరిగింది. ఆదోని డిప్యూటీ డిఇఓ శివరామప్ప విద్యార్థులకు ఓటు నమోదుపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎంఇఓ నారాయణ స్వామి, తదితరులు పాల్గొన్నారు.