కర్నూల్

ప్రతి రెవెన్యూ డివిజన్‌లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జనవరి 21:జిల్లాలోని ప్రతి రెవెన్యూ డివిజన్‌లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసి బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం కలెక్టరేట్ ఎదుట మూత్రపిండాల వ్యాధి బాధితులు ఆందోళన చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న బాధితులు వంద కిలోమీటర్లకు పైగా దూరం ఉన్న కర్నూలుకు వచ్చి డయాలసిస్ చేయించుకోవాలంటే చాలా ఖర్చు అవుతుందని వాపోయారు. కావున సిఎం చంద్రబాబు, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తక్షణమే స్పందించాలని ఎమ్మిగనూరుకు చెందిన డయాలసిస్ బాధితుడు రాజానందబాబు డిమాండ్ చేశారు. అలాగే మూత్రపిండాల బాధితులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని, నెలకు రూ. 5 వేలు పింఛను ఇవ్వాలని కోరారు. ఆరోగ్యశ్రీ కింద పిస్టులా ఆపరేషన్ ఉచితంగా చేయించే అవకాశం కల్పించాలన్నారు. రోగి అవసరాన్ని బట్టి ప్రతి డయాలసిస్‌కు ఒకసారి బ్లడ్ ఇంజక్షన్ అందివ్వాలని, ఐరన్ ఇంజక్షన్లు ఉచితంగా ఇవ్వాలని, డయాలసిస్ రోజు రోగికి ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద ఆహారం అందించాలని, కర్నూలు పెద్దాసుపత్రిలో కొత్త డయాలసిస్ మిషన్లు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్, వైకాపా అధ్యక్షుడు జగన్ రాష్ట్రంలోని ఉద్దానం, సింగాటం, మార్కాపురం, కనిగిరి, తదితర కిడ్నీ బాధితులతో పాటు రాష్ట్రంలోని డయాలసిస్ బాధితుల కోసం పోరాడాలని విజ్ఞప్తి చేశారు.
అలిపిరిలో మెట్లోత్సవ వేడుకలు
మంత్రాలయం, జనవరి 21: తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధానానికి భక్తులు పాదయాత్ర చేసే అలపిరిలో మెట్లోత్సవం వేడుకలు వైభవంగా నిర్వహించారు. శనివారం మంత్రాలయం మఠం పీఠాధిపతి ఆధ్వర్యంలో తిరుపతిలోని గోవిందరాజుల స్వామి ఆలయం దగ్గర నుండి మూడు వేల మంది భజన మండలి సభ్యులతో ర్యాలీగా బయలు దేరి వేకువ జామున మూడు గంటలకు అలపిరిలోని శ్రీవారి పాదాలను చేరుకున్నారు. అక్కడకు చేరుకున్న మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులకు టిటిడి అర్చకులు ఆలయ మర్యాదులతో స్వాగతం పలికారు. శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం వేడుకలను పురస్కరించుకుని, టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీ వారి పాదాలకు ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చి, పాదయాత్రను ప్రారంభించారు. తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. పీఠాధిపతి స్వామి దర్శననంతరం శ్రీరంగం బయలుదేరినట్లు మఠం అధికారులు తెలిపారు.