కర్నూల్

గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్ పనులకు మోక్షమెప్పుడో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, జనవరి 29 : దేశంలో ఈ ఏడాది తొలిసారిగా రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్డం జరిగింది. ఫిబ్రవరి నెలలో బడ్జెట్ సమావేశాలలోనే సాధారణ బడ్జెట్‌తోపాటు రైల్వే బడ్జెట్‌ను కలిపి ప్రవేశపెట్టనున్నారు. దీంతో బడ్జెట్‌లో కొత్త రైళ్ల ప్రస్తావన ఉండకపోవచ్చని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా రాజధాని అమరావతి నుండి రాయలసీమకు వెళ్లే గుంటూరు-గుంతకల్లు రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు నిధులు కేటాయిస్తారని ఈ ప్రాంత ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. గత బడ్జెట్‌లోనే గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్ పనులకు రైల్వే బోర్డు నుండి అనుమతి లభించిన విషయం విధితమే. నిధుల కేటాయింపు జరుగకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. గుంటూరు సమీపంలోని నల్లపాడు నుండి గుంతకల్లు వరకు 397 కి.మీ.ల మేర సింగిల్ లైన్‌లో రైళ్లు నడుస్తున్నాయి. ఈ మార్గంలో డబ్లింగ్ పనులు పూర్తయితే రాజధాని అమరావతికి వేగంగా చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం నంద్యాల నుండి గుంటూరుకు ఎక్స్‌ప్రెస్ రైళ్లో వెళ్లాలంటే ఆరు గంటల సమయం పడుతుంది. డబ్లింగ్ పనులు పూర్తయితే ఈ మార్గంలో 3 నుంచి 4 గంటలలోపు రాజధానికి చేరుకోవచ్చు. ఈ మార్గంలో 397 కి.మీ.ల మేరా డబ్లింగ్ పనులు పూర్తి చేయాలంటే బడ్జెట్‌లో రూ.4 వేల కోట్లు కేటాయించాల్సి వస్తుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ మార్గంలో డబ్లింగ్ పనులు పూర్తి చేయాలంటే నిధులు భారీగా కేటాయించాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో రైల్వే శాఖ కేంద్ర మంత్రి సురేష్ ప్రభు మన రాష్ట్రం నుండే రాజ్యసభకు ఎంపిక కావడం, కేంద్రంతో ముఖ్యమంత్రి సత్సంబంధాలు కొనసాగిస్తుండడం వల్ల ఈ ఏడాది సాధారణ బడ్జెట్‌లోనే కొత్త రైల్వే లైన్ నిర్మాణ పనులకు నిధులు మన రాష్ట్రానికి కేటాయింపులో మొగ్గుచూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు డివిజన్ డి ఆర్ ఎం మాటల్లో... గుంటూరు - గుంతకల్లు రైల్వే లైన్ నిర్మాణ పనులకు గత ఏడాదే రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఈ ఏడాది బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తే పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయన్నారు. అదేవిధంగా గుంటూరు-గుంతకల్లు వరకు చేపట్టిన విద్యుద్దీకరణ పనులు 80 శాతం పూర్తయ్యాయని, మార్చి నెలాఖరు నాటికి సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తయితే ఏప్రిల్ నుండి ఈ మార్గంలో విద్యుత్ రైళ్లు ప్రయాణించే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. కొత్త రైళ్ల విషయం తనకు తెలియదని, బడ్జెట్‌లో కొత్త రైళ్ల ప్రకటన ఉండకపోవచ్చని ఆయన అన్నారు. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు జిల్లాల నుండి రాజధానికి వెళ్లాలంటే ప్రస్తుతం ఉన్న గుంతకల్లు-గుంటూరు సింగిల్ లైన్ మాత్రమే అందుబాటులో ఉండి. ఈ లైనులో విద్యుద్దీకరణ పూర్తయితే రైళ్లు మరింత వేగంగా ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి. కాగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ మార్గంలో విశాఖపట్నం నుండి ముంబాయి వరకు ఎక్స్‌ప్రెస్ రైలు ప్రవేశపెట్టాలన్న డిమాండ్ నానాటికి పెరిగిపోతుంది. పారిశ్రామికంగా రాష్ట్రంలోనే ముందంజలో ఉన్న విశాఖపట్నం నుండి నంద్యాల లేదా గుంతకల్లు వరకు ఎక్స్‌ప్రెస్ రైలు నడపాలన్న డిమాండ్ కూడా ఉంది. కాగా విశాఖపట్నం-గుంటూరు వరకు తిరిగే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను నంద్యాల వరకు పొడిగించాలని గత ఏడాది ఎంపి ఎస్పీవైరెడ్డి కోరిన విషయం తెలిసిందే. దీంతోపాటు తెలంగాణ రాజధాని హైదరాబాదుకు కూడా ఎక్స్‌ప్రెస్ రైలు నడపాలన్న డిమాండ్ గత కొంతకాలంగా ఉంది. గత ఏడాది మూడు దశాబ్దాల పాటు ఎదురుచూసిన నంద్యాల - యర్రగుంట్ల రైల్వే లైన్ పూర్తికావడం, ఈ మార్గంలో నంద్యాల నుండి కడప వరకు డెమో రైలు రెండు ట్రిప్పులు నడుస్తున్నప్పటికి ఈ రైలు ఎద్దుల బండితో పోటీపడే వేగంతో వెళ్తుండడం వల్ల ప్రయాణీకుల ఆదరణ కోల్పోయింది. ఈ మార్గంలో కూడా ఎక్స్‌ప్రెస్ రైలు నడపాలన్న డిమాండ్ ఈ ప్రాంత ప్రజలకు ఉంది. దీనికి తోడు నంద్యాల-యర్రగుంట్ల రైల్వే లైన్ ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రైల్వే మంత్రి సురేష్ ప్రభు సమక్షంలో త్వరలోనే రాజధాని అమరావతి నుండి తిరుపతి వరకు వయా నంద్యాల - యర్రగుంట్ల మీదుగా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రవేశపెడతామని హామీ ఇచ్చిన సంగతిని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాదు నుండి కర్నూలు, డోన్, నంద్యాల, యర్రగుంట్ల, కడప మీదుగా తిరుపతి వరకు మరో ఎక్స్‌ప్రెస్ రైలు నడపాలన్న డిమాండ్ కూడా ప్రజల నుండి వస్తోంది. మొత్తం మీద బడ్జెట్‌లో రాయలసీమ ప్రాంతానికి ప్రాధాన్యత ఇచ్చి గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్ పనులకు నిధులు మంజూరు చేస్తారని రైల్వే ఉద్యోగులతోపాటు ఇక్కడి ప్రజలు ఆశాభావంతో ఉన్నారు.
రేషన్ డీలర్లలో గుబులు!
* హత్య కేసును సవాల్‌గా తీసుకున్న అధికారులు
* సస్పెండైన వారిపై నిఘా

కర్నూలు, జనవరి 29 : ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన కర్నూలు నగరంలోని అనేక మంది రేషన్ డీలర్లలో ఓ హత్య కేసు గుబులు పుట్టిస్తోంది. నగరంలోని మద్దూరునగర్ ప్రాంతంలో గత మంగళవారం జరిగిన వెంకటేశ్వరగౌడ్ హత్య కేసును సవాల్‌గా తీసుకున్న అధికారులు ఈ సంఘటనకు సంబంధం ఉందని భావిస్తున్న పలువురు డీలర్లపై నిఘా వేశారు. జిల్లాలో రెండు నెలల క్రితం వరకూ సుమారు 160మంది డీలర్లు ఏకంగా హైదరాబాద్‌లోని ఎన్‌ఐసి ప్రధాన కార్యాలయంలో కంప్యూటర్లలో సాఫ్ట్‌వేర్ మార్పులకు పాల్పడి వేలిముద్రలు, ఆధార్‌నెంబర్‌తో సంబంధం లేకుండా చౌక దుకాణాల్లోని బియ్యం, చక్కెర, కిరోసిన్ తదితర నిత్యావసర వస్తువులను బ్లాక్ మార్కెట్‌కు తరలించారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన అధికారులు ఎన్‌ఐసి, పౌర సరఫరాల శాఖకు చెందిన ఉద్యోగులతో పాటు ప్రత్యక్షంగా సంబంధం ఉన్న ఐదుగురు డీలర్లను కూడా అరెస్టు చేశారు. ఆ తరువాత ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉందన్న కారణంగా 160 మందికి పైగా డీలర్లను సస్పెండ్ చేశారు. వీరిలో 100 మంది కర్నూలు నగరానికి చెందిన వారు ఉన్నారు. కాగా మంగళవారం హత్యకు గురైన వెంకటేశ్వరగౌడ్ కూడా రేషన్ డీలరే కాకుండా డీలర్ల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పని చేశారు. జిల్లాలో జరిగిన కుంభకోణం వెలుగులోకి రావడానికి ఆయనే కారణమని కక్ష పెంచుకున్న కొందరు డీలర్లు ఆయనను హత్య చేయడానికి కిరాయి హంతకులను నియమించారని పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగులు వెంకటేశ్వరగౌడ్‌ను పట్టపగలు అందరూ చూస్తుండగానే హత్య చేసి పరారయ్యారు. ఈ కేసు జిల్లాలో సంచలనం సృష్టించగా పోలీసులు, పౌరసరఫరాల అధికారులు సవాల్‌గా తీసుకున్నారు. కేసును ఛేదించేందుకు పెద్దఎత్తున వ్యూహం రచించారు. కుంభకోణంలో పాత్ర ఉన్న వారిని పౌర సరఫరాల శాఖ అధికారులు సస్పెండ్ చేయడమే కాకుండా కేసు నమోదు చేశారు. అయితే డీలర్లు కోర్టుకు వెళ్లి అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం డీలర్ల సస్పెన్షన్‌పై విచారణ నిర్వహిస్తున్న సమయంలో వెంకటేశ్వరగౌడ్ హత్య మొత్తం వ్యవహారాన్ని మలుపుతిప్పింది. పరోక్షంగా సంబంధం ఉన్న డీలర్లపై అధికారులు సైతం మందలింపులతో సరిపెట్టాలని భావించిన తరుణంలో హత్య ఉదంతం ఆగ్రహం తెప్పించిందని కొందరు డీలర్లు పేర్కొంటున్నారు. హత్య కేసులో కొందరు డీలర్లకు ప్రత్యక్ష ప్రమేయం ఉందని, మరి కొందరు ప్రోత్సహించారని పోలీసులు పేర్కొంటున్నారు. హత్యకు గురైన వెంకటేశ్వరగౌడ్ సెల్‌ఫోన్‌కు వచ్చిన కాల్ రికార్డును పోలీసులు పరిశీలించి కొందరు డీలర్లపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులు పోలీసులకు చిక్కితే వీరి వ్యవహారం తేలుతుందని వెల్లడిస్తున్నారు. కాగా హత్య కేసు విషయం జాయింట్ కలెక్టర్ హరికిరణ్ అధ్యక్షతన జరిగిన ఆహార సలహా సంఘం సమావేశంలో చర్చకు రావడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయడంతో పాటు ఇందుకు సంబంధం ఉందని అనుమానిస్తున్న వారిని కూడా అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు సమాచారం. పట్టపగలు హత్య చేసి పోలీసులకు సవాల్ విసిరిన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. అనుమానితులైన కొందరు డీలర్లకు చెందిన సెల్‌ఫోన్ సిగ్నల్స్‌పై పోలీసులు నిఘా వేసి దర్యాప్తును ముమ్మరం చేసినట్లు వెల్లడవుతోంది.
సిఎస్ ఆదేశాలు బేఖాతరు!
* జన్మభూమి అర్జీలకు స్పందన కరువు..
* ఆన్‌లైన్ చేయడంలో జాప్యం..
కర్నూలుటౌన్, జనవరి 29:జిల్లాలో జన్మభూమి-మా ఊరు వినతులకు స్పందన కరువైంది. జిల్లా వ్యాప్తంగా గ్రామాలు మొదలుకుని పట్టణాలు, కర్నూలు నగరం వరకూ జనవరి 2 నుంచి 11వ తేదీ వరకూ జన్మభూమి-మా ఊరు సభలు నిర్వహించారు. ఆయా సభల్లో ప్రజలు అధికంగా రేషన్ కార్డులు, పింఛన్లు, భూ సమస్యలు, సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్లు, తదితర సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీకోసంలో వచ్చిన అర్జీలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసినా జిల్లాలోని 54 మండలాలకుగానూ ఒక్క మండలంలో కూడా అర్జీలను ఆన్‌లైన్‌లో పొందుపరచలేదు. సిఎస్ ఠక్కర్ జిల్లా కలెక్టర్‌కు ఈ నెల 24వ తేదీ లోగా ప్రతి దరఖాస్తును ఆన్‌లైన్ చేసి పూర్తి వివరాలు పంపాలని ఆదేశించినా నేటి వరకూ ఆ వివరాలను పూర్తిగా నమోదుచేయలేదు.
శాఖలవారీగా అందిన దరఖాస్తులు..
రెవెన్యూ శాఖలో 12,117 దరఖాస్తులు అందగా 118 మాత్రమే పరిష్కరించారు. పౌర సరఫరాల శాఖలో 25,454కి గానూ 1629, ఇళ్ల స్థలాల కోసం 25,367 దరఖాస్తులు రాగా 2,259, వెలుగుశాఖలో 14,288కి గానూ 599, ఆర్‌డబ్ల్యుఎస్ శాఖలో 1,316కి గానూ 271, పంచాయతీరాజ్ శాఖలో 626కి గానూ 11, డ్వామాకు సంబంధించి 332కి గానూ 140 అర్జీలను పరిష్కరించారు. ఇక పురపాలక శాఖలో 888, వ్యవసాయ శాఖలో 120, బిసి కార్పొరేషన్‌కు సంబంధించి 233 అర్జీలు అందగా ఒక్కటి కూడా పరిష్కారానికి నోచుకోకపోవడం గమనార్హం. ఇక రూరల్ మండలాల్లో 99,844కి గానూ 85,132 దరఖాస్తులను మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదుచేశారు. 4వ విడత జన్మభూమి కార్యక్రమం ముగిసి 16 రోజులైనా ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా 14,712 దరఖాస్తులు ఆన్‌లైన్ చేయాల్సి వుంది. ఇకనైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టి జన్మభూమి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

స్వచ్ఛ సర్వేచ్చన్‌కు కర్నూలు ఎంపిక
* కేంద్ర సర్వే బృందం నగరంలో పర్యటన
కర్నూలు సిటీ, జనవరి 29:కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ సర్వేచ్చన్ కింద దాదాపు 500 నగరాలను ఎంపిక చేయగా అందులో కర్నూలు నగరం కూడా ఉంది. దీంతో క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సర్వే బృందం ఆదివారం కర్నూలు నగరంలో పర్యటించింది. ఇందులో భాగంగా ఆ బృందం సభ్యులు రామ్‌నారాయణ, అభిరామ్, బసంత్ రైల్వేస్టేషన్, శ్రీరామ్‌నగర్, అరోరానగర్, కింగ్‌మార్కెట్, తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య విధానాల అమలుపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అలాగే వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం, పరిసరాల పరిశుభ్రతను కూడా పరిశీలించారు. ఇంటింటి చెత్తసేకరణ, రహదారుల శుభ్రత, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్వహణ, బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దడం, సేకరించిన చెత్త నిర్వహణ, తదితర అంశాల్లో పనితీరు ప్రామాణికంగా మార్కులు వేయనున్నారు. ఆ బృందం సభ్యులతో పాటు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ కళ్యాణచక్రవర్తి, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు మురళీ, రమణ, మద్దయ్య, నాగరాజ్, ఎం.శ్రీనివాసులు, పరుశురాం, తదితరులు ఉన్నారు.
పోలియో పట్ల అప్రమత్తంగా ఉండాలి
* డిప్యూటీ సిఎం కెఇ
కర్నూలు, జనవరి 29:ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రకటించినప్పటికీ పోలియో వ్యాధి పట్ల అప్రమత్తంగా వుండి చిన్నారుల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, వైద్య సిబ్బందిపై వుందని డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి పేర్కొన్నారు. నగరంలోని కొత్తపేట మున్సిపల్ ఉర్దూ బాలికల పాఠశాలలో ఆదివారం డిప్యూటీ సిఎం కెఇ చిన్నారికి పోలియో చుక్క లు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించా రు. ఈ సందర్భంగా కెఇ మాట్లాడుతూ పల్స్‌పోలియో లాంటి మంచి కార్యక్రమాన్ని నేను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేసి ఆ వ్యాధి నుంచి రక్షించుకోవాలన్నారు. ఈ కార్యక్రమం 3 రోజుల పాటు కొనసాగుతుందని ఇంటింటికీ తిరిగి ప్రతి చిన్నారికి పోలియో చుక్క లు వేయాలన్నారు. పోలియోను నిర్లక్ష్యం చేస్తే ఇతర వ్యాధులు కూడా సంక్రమించే అవకాశం ఉందన్నారు. రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించి అంగవైకల్యం నుంచి కాపాడుకోవాలన్నారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ పోలియో చుక్కలు వేయించకపోతే దాని పర్యవసానం తీవ్రంగా వుంటుందని, మా సొంత తమ్ముడే పోలియో వ్యాధి వల్ల ఇబ్బందులు పడుతున్నాడని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు, ఇన్‌చార్జి డిఎంహెచ్‌ఓ డా. మీనాక్షిమహదేవన్, తదితరులు పాల్గొన్నారు.
బ్రాహ్మణ కార్పొరేషన్‌కు
చట్టబద్ధతకై అసెంబ్లీలో చర్చిస్తా..
* ఎమ్మెల్యే సాయి
ఆదోనిటౌన్, జనవరి 29 : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్రాహ్మణ కార్పొరేషన్‌కు ప్రకటించిన రూ. 500 కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ బ్రాహ్మణ కార్పొరేషన్‌కు చట్టబద్దత కల్పించాలని త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో శాసన సభలో చర్చిస్తానని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆంద్ర ప్రదేశ్ బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం రాష్ట్ర కన్వీనర్ వెల్లాల మధుసూదన్‌శర్మ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డికి బ్రాహ్మణ సంఘం నాయకులు వినతి పత్రం ఇచ్చారు. తమ సమస్యల గురించి అసెంబ్లీలో చర్చించాలని పేర్కొన్నారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం బ్రాహ్మణ కార్పోరేషన్ ఏర్పాటు చేసి రూ. 500 కోట్ల నిధులు కేటాయిస్తామని ప్రకటించి రెండున్నర సంవత్సరాలు కావస్తున్న ఇంత వరకు కేవలం రూ. 55 కోట్లు మాత్రమే ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల్లో బ్రహ్మణులను నమ్మించి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు నేడు వీరికి విస్మరించడం తగదని అన్నార. ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న బ్రాహ్మణులకు కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించి ఉపాధి కల్పిస్తామని చెప్పి నేడు మోసం చేశారని అన్నారు. ఇప్పటికే దివంగత సిఎం వైఎస్ ఏర్పాటు చేసిన నాయిబ్రాహ్మణ కార్పోరేషన్‌ను రద్దు చేశారని ఇదే విధంగా ఇతర కార్పోరేషన్లను రద్దు చేస్తే సహించేది లేదన్నారు. అందువల్ల వెంటనే బ్రాహ్మణ కార్పొరేషన్‌కు చట్టబద్దత కల్పిస్తూ చట్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే జిల్లాలో ప్రాతిపధికన జనాభా ఆధారంగా బ్రాహ్మణులకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని ఆయన కోరారు. ఇప్పటికైనా సిఎం చంద్రబాబునాయుడుబ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను నిలబెట్టకోవాలని డిమాండ్ చేశారు. అలాగే బ్రాహ్మణులకు ఇళ్ళస్థలాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అర్హులైన వారికి ఇంటి స్థలాలు ఇచ్చి పక్క గృహాలునిర్మించాలని అసెంబ్లీలో కోరుతున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి మనోహర్, కోవాధికారి మధుసూదన్‌రావు, పట్టణ ఉపాధ్యక్షులు గిరి, ఆచారు, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
ఆర్డీఎస్ వద్ద కెనాల్‌ను
అడ్డుకోవడం అవివేకం
* మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌జైన్
ఆదోని, జనవరి 29:ఆర్డీఎస్ ప్రాజెక్టు వద్ద రాష్ట్ర ప్రజల అవసరాల కోసం బ్రిజేష్ కుమార్ కమిటీ ఐదు టీఎంసీల నీటిని కేటాయించిందని ఆ నీటిని వినియోగించుకోవటానికి మరో కాలువ తవ్వటానికి సర్వే చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌జైన్ స్పష్టం చేశారు. అయితే శనివారం జరిగిన తుంగభద్ర బోర్డు సమావేశంలో తెలంగాణ అధికారులు కాలువ తవ్వడానికి అభ్యంతరం చెప్పడం వారి అవివేకానికి నిదర్శమని అన్నారు. వాస్తవానికి రాష్ట్రానికి రాజోలి బండ ఆనకట్ట వద్ద కూడి కాలువకు 8 టీఎంసీల నీటిని కేటాయించారని అయితే కుడి కాలువ నిర్మాణం ఇప్పటికి జరగలేదని ఆయన పేర్కొన్నారు. అందువల్లనే బ్రిజేష్ కుమార్ కమిటీ ఐదు టీఎంసీల నీటిని రాష్ట్రానికి కేటాయించిందని స్పష్టం చేశారు. అందువల్ల ఆ నీటిని వినియోగం కోసం కాలువ నిర్మాణం జరగడానికి సర్వే చేస్తున్నారని అన్నారు. వాస్తవానికి కర్నాటకకు రాజోలిబండ ఆనకట్టలో ఒక టీఎంసీ నీరు మాత్రమే కేటాయించారని అయితే కర్నాటక తనకు కేటాయించిన నీటి కన్నా ఎక్కువ నీటిని అక్రమంగా వినియోగించుకోని 60వేల ఎకరాలు సాగు చేస్తుంటే నీటి చౌర్యం చేస్తున్న కర్నాకటను వదిలి పెట్టి ఆంద్ర ప్రాంతం కాలువకు తెలంగాణ అధికారులు అడ్డు చెప్పడం తగదని అన్నారు. అలాగే గుండ్రేవుల వద్ద కూడా ఆనకట్టు నిర్మాణం చేయడానికి అడ్డు చెప్పరాదని పేర్కొన్నారు. కేసి కెనాల్ 10 టీఎంసీల నీటిని కూడా కర్నాటకకు తరలిస్తున్నారని కావున గుండ్రేవుల వద్ద కూడా ఆనకట్ట నిర్మాణానికి రాష్ట్రానికి హక్కు ఉందని అన్నారు. ముఖ్యంగా రాజోలిమండ ఆనకట్ట నుంచి కాలువ తవ్వితే పడమరప్రాంతాలైన ఆదోని డివిజన్‌లోని మంత్రాలయం, ఎమ్మిగనూరు, నందవరం, గోనెగండ్ల, కోసిగి, కోడుమూడు ప్రాంతాలకు నీరు అందించి కరువు నుంచి ప్రజలు విముక్తి అవుతారని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా తెలంగాణ అధికారులు, ప్రభుత్వం కర్నాటకకు కేటాయించిన నీటి కన్నా ఎక్కువగా వినియోగించుకోని పంటలు పండిస్తున్న అక్రమ విధానాలను నీటిచౌర్యాన్ని తెలుగు రాష్ట్రాలు రెండు కలిసి ఎదుర్కొవాలే తప్పా కేవలం ఆంద్ర రాష్ట్రంపై తెలంగాణ ప్రజలలోప్రాంతీయ తత్వం లేవదీసి కర్నాటక జలచౌర్యానికి అడ్డుకట్ట వేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. కావున ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం రాజోలి బండ వద్ద కర్నాటక అక్రమంగా వాడుకుంటున్న తెలంగాణ వాటా నీటిని రాబట్టుకోవడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కావున రాష్ట్రానికి కేటాయించిన ఐదు టీఎంసీల నీటినితో నిర్మించే కాలువకు అడ్డు చెప్పరాదని, అడ్డంకులు కల్పించరాదని తెలంగాణ అధికారులకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఆర్డీఎస్ వద్ద ఆక్రమంగా
ఇసుక తరలిస్తే చర్యలు
కోసిగి, జనవరి 29:ఆర్డీఎస్ మూడు రాష్ట్రాల మధ్య నిర్మించిన ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద అక్రమ ఇసుక రవాణ చేసేందకు కర్నాటక ప్రాంతానికి చెందిన రైతులు ఆర్డీఎస్ ఆనకట్ట పోడవున మట్టి రోడ్డును వేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ రజనీకాంత్‌రెడ్డి, ఎస్‌ఐ ఇంతియాజ్‌బాషాలు ఆర్డీఎస్ ఆనకట్ట వద్దకు వెళ్ళి పరిశీలించారు. అక్రమంగా రోడ్డు వేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం కోసిగి సిఐ దైవప్రసాద్, ఎస్‌ఐ ఇంతియాజ్‌బాషాలు ఎల్లెల్సీ అధికారులు కలిసి జేసిబితో ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద వేసిన మట్టి రోడ్డును తొలగించారు.ఈసందర్భంగా సిఐ దైవ ప్రసాద్ మాట్లాడుతూ ఆర్డీ ఎస్ ఆనకట్ట వద్ద అనుమతి లేకుండా పనులు చేపట్టరాదని ఆదేవిధంగా ఎల్లెల్సీ అధికారులు, రెవెన్యూ అధికారులు ఆర్డీఎస్ ఆనకట్టపై నిర్లక్ష్య చేస్తే వారికి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకోని పోతామని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట పోలీసులు, ఎల్లెల్సీ అధికారులు ఉన్నారు.
శ్రీశైలంలో భక్తుల రద్దీ
శ్రీశైలం, జనవరి 29:ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామివార్లను ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని సేవించుకున్నారు. పవిత్ర పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి వేకువ జాము నుండే భక్తులు క్యూలైన్లలో వేచివున్నారు. సుమారు 40 వేలకు పైగా మంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకున్నారని అంచనా.
ప్రశాంతంగా కానిస్టేబుల్ రాత పరీక్ష
* 13,638 మంది హాజరు
* కేంద్రాలు తనిఖీ చేసిన ఎస్పీ రవికృష్ణ
కర్నూలు, జనవరి 29:నగరంలో ఆదివారం నిర్వహించిన పోలీసు కమ్యునికేషన్ కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. నగరంలోని పలు పరీక్ష కేంద్రాలను ఎస్పీ రవికృష్ణ తనిఖీ చేశారు. అందులో భాగంగా నగరంలోని పెద్దమార్కెట్ దగ్గర ఉన్న వాసవీ మహిళా కళాశాలను తనిఖీ చేసి పరీక్షల నిర్వహణ కోసం కళాశాల యాజమాన్యం చేసిన ఏర్పాట్లు, పరీక్ష జరుగుతున్న తీరు గురించి ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నగరంలోని 23 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా 13,638 మంది హాజరు కాగా, 1128 మంది అభ్యర్థులు గైర్జాజరయ్యారని తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు బందోబస్తు మధ్య ఏర్పాటు చేశామన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ రమణమూర్తి, సిఐ బిఆర్ కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.
చౌడేశ్వరీమాతకు వెండి
ఆభరణాలు వితరణ
బనగానపల్లె, జనవరి 29:మండల పరిధిలోని నందవరం శ్రీ చౌడేశ్వరీమాతకు ఆదివారం కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన కె.క్రిష్ణచౌడప్ప, అతడి భార్య సరస్వతమ్మ 2,214 గ్రాముల వెండి ఆభరణాలను ఇఓ రామానుజన్‌కు అందజేశారు. అందులో 1046 గ్రామాల వెండి పల్లెం, 91 గ్రాముల అద్దం, 667 గ్రాముల వడ్డాణం, 26 గ్రాముల తిలకం, 384 గ్రాముల బంగారు కోటింగ్ వేసిన గార్లండ్‌లను అమ్మవారికి సమర్పించారు.
ప్రభుత్వంపై దుష్ప్రచారం తగదు
డోన్, జనవరి 29:చంద్రబాబు పాలన పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే పిఎసి చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని టిడిపి నాయకులు పేర్కొన్నారు. పట్టణంలోని కెఇ నివాసంలో ఆదివారం మార్కెట్ యార్డ్ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, టిడిపి పట్టణ అధ్యక్షుడు కొట్రికె ఫణిరాజ్, మాజీ జడ్పీటిసి వలసల రామకృష్ణ, టిడిపి మండల అధ్యక్షుడు కొత్తకోట శ్రీనివాసులు విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే బుగ్గన ప్రభుత్వంపై దుప్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. జన్మభూమి కార్యక్రమంలో అర్హులందరికీ రేషన్‌కార్డులు, పింఛన్లు పంపిణీ చేశామని తెలిపారు. బేతంచెర్లలో జరిగిన సభలో పాల్గొన్న బుగ్గన సైతం అందరికీ కార్డులు ఇవ్వడం అభినందనీయమని పేర్కొన్నారని గుర్తుచేశారు. బుగ్గన ప్రజా పంపిణీ వ్యవస్థ అధ్వాన్నంగా వుందని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం విడ్డూరంగా వుందన్నారు. ప్రస్తుతం ఈ పాస్ విధానం వుందని, కార్డుదారులు ఎక్కడైనా రేషన్ పొందవచ్చని, పంపిణీలో ఎలాంటి అక్రమాలకు చోటులేదని వివరించారు. ఇకనైనా బుగ్గన బాబు పాలనపై చౌకబారు విమర్శలు మానుకోవాలని లేకపోతే ప్రజలు క్షమించరన్నారు. సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆంజనేయగౌడ్, కౌన్సిలర్లు రాజు, పెద్దయ్య, కిరణ్‌యాదవ్, సుబ్బయ్యగౌడ్, రంగయ్యగౌడ్, శంకర్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
కెసి కాలువలో ఈతకు వెళ్లి
యువకుడి మృతి
నందికొట్కూరు, జనవరి 29:మండల పరిధిలోని నాగటూరు గ్రామంలో ఆదివారం కెసి కాలువలో ఈతకు వెళ్లి యువకుడు మృతిచెందాడు వివరాలు.. నందికొట్కూరు పట్టణానికి చెందిన పాండు ఇంటిలో శుభకార్యం ఉండగా శనివారం రాత్రి స్నేహితులతో పాటు వౌలాలి కూడా వెళ్లాడు. శుభకార్యం పూర్తయిన తరువాత బంధువులంతా స్వగ్రామానికి తిరిగి వచ్చారు. అయితే వౌలాలి, అతడి స్నేహితులు అక్కడే ఉండి శనివారం ఉదయం కెసి కాలువలో ఈత కొట్టేందుకు వెళ్లారు. అయితే వౌలాలి(23) కాలువలో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యాడు. అక్కడే ఉన్న స్నేహితులు కాపాడాలని కేకలు వేసినప్పటికీ కెసి కాలువలో ప్రవాహం ఉద్ధృతంగా ఉండడంతో వౌలాలి నీటిలో మునిగిపోయాడు. విషయం తెలిసిన వెంటనే అతడి తండ్రి ఆర్‌టిసి డ్రైవర్ కుటుంబ సభ్యులతో కలిసి నాగటూరు గ్రామం చేరుకుని కెసి కాలువలో గాలించి వౌలాలి మృతదేహాన్ని బయటకు తీశారు. కాగా వౌలాలి డిగ్రీ పూర్తి చేసి నెల రోజుల క్రితమే గని గ్రామం వద్ద సోలార్ ప్రాజెక్టులో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. శవాన్ని పోస్టుమార్టం కోసం నందికొట్కూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లక్ష్మినారాయణ తెలిపారు.
నదిని దాటేందుకు వెళ్లి నీటిలో పడి
మాజీ సర్పంచ్ మృతి
నందికొట్కూరు, జనవరి 29:పగిడ్యాల మండల పరిధిలోని ఎన్.ఘనాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మాదన్న(55) ఆదివారం బనవాసి నదిని దాటేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతిచెందాడు. వివరాలు.. మాదన్న నీటి ముంపు పొలాలను చూసి వచ్చేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా పొలాల సమీపంలో ఉన్న బనవాసి నదిని దాటేందుకు ప్రయత్నించగా ప్రవాహం అధికంగా ఉండడంతో నీటిలో పడి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.