కర్నూల్

అధికార పార్టీలో ముదిరిన వర్గపోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఫిబ్రవరి 6 : రాష్టస్థ్రాయిలో మంత్రులు, ఉన్నతాధికారులు ఆలోచించి బదిలీలు చేస్తే స్థానిక నేతల మధ్య కుదరని సయోధ్య కారణంగా సదరు అధికారులు విధుల్లో చేరలేకపోతున్నారు. కర్నూలు జిల్లాలో ఈ వ్యవహారం రోజురోజుకూ ముదురుతూ పరిస్థితి ఎటు వెళ్తుందోనన్న ఆందోళన నెలకొని ఉంది. జిల్లాలో అధికారుల తీరుపై ఆయా శాఖల సిబ్బంది, అధికారులు, ప్రజల్లో అసంతృప్తి ఉన్నా పలువురు అధికారులు కొనసాగుతుండటం వెనుక అధికార పార్టీ నేతల్లో ఉన్న విభేదాలే కారణమన్న చర్చ జరుగుతోంది. ప్రధానంగా కర్నూలు నగరంలో విభేదాల పర్వం బహిర్గతం కాకపోయినా లోలోన రాజుకుంటూ అధికార పార్టీని ఇరుకున పెట్టే స్థాయికి చేరింది. కర్నూలు ఆర్డీఓగా మల్లికార్జునుడు అనే అధికారిని నియమించినా ఆయన విధుల్లో చేరకుండా ఓ నాయకుడు అడ్డుకోగా నగర పాలక సంస్థ ప్రస్తుత కమిషనర్ రవీంద్రబాబును బదిలీ చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులు చేసిన ప్రయత్నాన్ని ఆదిలోనే అడ్డుకున్నారు. ఇందుకు రాజకీయాలే కారణమని చర్చించుకోవడం గమనార్హం. కర్నూలు ఆర్డీఓగా నియమితులైన మల్లికార్జునుడు విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారని రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది పేర్కొంటున్నారు. ఆయన నియామకాన్ని టిడిపిలోని ఒక వర్గం ఆమోదించగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన విధుల్లో చేరాల్సిన సమయంలో మోకాలొడ్డిన మరో వర్గం ఇన్‌చార్జి ఆర్డీఓను నియమించుకోవడంలో సఫలీకృతులయ్యారు. ప్రస్తుతం కర్నూలు రెవెన్యూ డివిజన్ ఇన్‌చార్జి అధికారి పాలనలో నడుస్తోంది. మల్లికార్జునుడి బదిలీ ఉత్తర్వులు కూడా ఇంత వరకూ రద్దు కాలేదని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇక నగర పాలక సంస్థ కమిషనర్‌గా పని చేస్తున్న రవీంద్రబాబుపై టిడిపిలోని ఒక వర్గం అసంతృప్తితో ఉందని వారు చేసిన ప్రయత్నం ఫలితంగా ఆయనను బదిలీ చేయడానికి పురపాలక శాఖ ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్న సమయంలో మరో వర్గం అడ్డుకుని బదిలీని ఆదిలోనే నిలిపివేశారని నగర పాలక సంస్థలో చర్చ సాగుతోంది.
ఇక కలెక్టర్ విజయమోహన్ బదిలీకి జిల్లాలోని పలువురు నేతలు ప్రయత్నించగా ఏకంగా సిఎం చంద్రబాబు జోక్యం చేసుకుని నిరాకరించినట్లు తెలుస్తోంది. ఎస్పీ ఆకే రవికృష్ణ విషయంలో జిల్లా కేంద్రంలోని ఓ ప్రధాన నాయకుడు పూర్తిస్థాయిలో అండగా నిలిచి బదిలీ కాకుండా చూస్తున్నారని అధికారపార్టీ నేతలే పేర్కొంటున్నారు. బదిలీల వ్యవహారంలో నాయకుల జోక్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆ పార్టీ నేతలు పెదవి విరుస్తున్నారు. తమ మాటకు విలువ ఇవ్వలేదని, ఇవ్వరని, నిక్కచ్చిగా ఉంటారని, ఫలానా అధికారి అయితే తమకు తిరుగుండదన్న పలు వ్యక్తిగత కారణాలతో బదిలీల్లో జోక్యం చేసుకుంటున్నారే కానీ ప్రజలకు మేలు జరిగే విషయంపై మాత్రం వౌనం వహిస్తున్నారని టిడిపి నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీని కారణంగా ప్రజల్లో పార్టీపై వ్యతిరేకత పెరిగి ఓటమి చవి చూడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. సిఎం చంద్రబాబు రాజకీయ పరిస్థితులపై చేసినట్లుగా అధికారుల పనితీరుపై కూడా సర్వే చేసి సమర్థులైన వారిని నియమించాలని వారు కోరుతున్నారు. ఒత్తిళ్లకు లొంగితే ఎన్నికల్లో తాము ఒత్తిడికి గురికావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వివాహ వేడుకలో విషాదం..
* మద్యం తాగి ముగ్గురి మృతి
* శోకసంద్రంలో బిల్లలాపురం
నంద్యాల రూరల్, ఫిబ్రవరి 6 : ఓ వివాహ వేడుకల్లో విషాదం నెలకుంది. మిలిటరీ మద్యం తాగి మూడు ప్రాణాలను బలిగొన్న సంఘటన నంద్యాల మండలంలోని బిల్లలాపురం గ్రామంలో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి భూమా కృష్ణారెడ్డి కుమారుడు వివాహంలో గ్రామానికి చెందిన చిలకల కృష్ణమూర్తి (44), దండెబోయిన గురువయ్య (50), కన్న పుల్లయ్య (40)లు ముగ్గురు కలసి పెళ్లి వారు ఇచ్చిన మిలిటరీ మద్యం తాగి మృతి చెందారు. దీంతో గ్రామం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న తాలూకా పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఉప్పరి కుటుంబానికి చెందిన ఇరువురు, దళిత కాలనికి చెందిన ఒకరు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. ముగ్గురి కుటుంబాల్లో వారి బంధువుల రోధనలు పలువురిని కంటతడి పెట్లించాయి. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండ గట్టి పోలీసు బందోబస్తు ఆధ్వర్యంలో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. సిఐ మురళీదర్‌రెడ్డి, ఎస్‌ఐలు ఎన్‌వి రమణ, గోపాల్‌రెడ్డి, ఎఎస్‌ఐలు, సిబ్బంది గ్రామంలోనే పర్యవేక్షిస్తూ అంత్యక్రియలు అయిపోయేంత వరకు అక్కడే ఉన్నారు. మృతులకు సంబంధించిన బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు విచారిస్తున్నట్లు తెలిపారు. ఒక వివాహ వేడుకల్లో మద్యం తాగి ముగ్గురు మృతి చెందడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. గ్రామాల్లో కల్తీ మద్యం విక్రయాలు కూడా ఉన్నట్లు పలువురు అంటున్నారు. ఎక్సైజ్ శాఖ, తాలూకా పోలీసులు బెల్టు షాపులను అరికట్టి, సామాన్య, మధ్య తరగతి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని పలువురు అంటున్నారు. గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేసినట్లు సిఐ, ఎస్‌ఐలు తెలిపారు.
మృతుల కుటుంబాలను పరామర్శించిన ఫరూక్
మండలంలోని బిల్లలాపురం గ్రామంలో అతిగా మద్యం తాగి మృతి చెందిన ముగ్గురు కుటుంబాలను మాజీ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ పరామర్శించారు. వివాహ వేడుకల్లో మద్యం తాగి మృతచెందడం బాధాకరమన్నారు. మృతుల బంధువులను పరామర్శించి ప్రభుత్వం తరపున న్యాయం చేస్తామన్నారు. గ్రామీణ ప్రజలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, అతిగా మద్యం తాగడం,గి గుట్కాలు నమడలం వంటి వాటికి ప్రజలు దూరంగా ఉండాలన్నారు. ఆయన వెంట చింతలపల్లె సుధాకర్, మాజీ కౌన్సిలర్ రవికుమార్, మద్దిలేటి, మూర్తి తదితరులు ఉన్నారు.
మార్చి 20 వరకూ కెసికి నీరు
* కలెక్టర్ విజయమోహన్
నందికొట్కూరు, ఫిబ్రవరి 6:కెసి ఆయకట్టు కింద పంటలు సాగు చేసిన రైతాంగాన్ని ఆదుకుంటామని కలెక్టర్ సిహెచ్ విజయమోహన్ భరోసా ఇచ్చారు. కలెక్టర్ సోమవారం మల్యాల వద్ద ఉన్న హంద్రీనీవా ఎత్తిపోతల పథకం, పగిడ్యాల మండలంలోని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలను సందర్శించారు. కెసికి నీటి విడుదల బంద్ చేసిన నేపథ్యంలో రైతుల ఆందోళనతో మళ్లీ హంద్రీనీవా నుంచి 2 పంపుల ద్వారా, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి 2 పంపుల ద్వారా సోమవారం కెసికి నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో కెసికి నీరు విడుదల చేయడంతో రైతులు పంటలు సాగు చేశారన్నారు. అయితే కొన్ని కారణాలతో నీరు నిలిపివేయడంతో పంటలు ఎండిపోయి రైతులు ఆర్థికంగా దెబ్బతింటారని ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో మార్చి 20వ తేదీ వరకూ విడతల వారీగా కెసికి నీరు విడుదల చేసేందుకు అనుమతి వచ్చిందన్నారు. నేటి నుంచి ఫిబ్రవరి 25వ తేదీ వరకూ, ఆ తర్వాత మార్చి 10 నుంచి 20వ తేదీ వరకూ కెసికి నీరు విడుదల చేస్తామన్నారు. కాగా ఏప్రిల్ చివరి వరకూ నీరు ఇస్తామని ప్రకటించడంతోనే తాము కెసి కాలువ కింద పంటలు సాగు చేశామని, నేడు నీరు విడతల వారీగా విడుదల చేస్తే తమ పంటలు పూర్తిస్థాయిలో పండక తాము నష్టపోతామని కొందరు రైతులు కలెక్టర్ ఎదుట మొరపెట్టుకున్నారు. ఎలాగైనా ఏప్రిల్ చివరి వరకూ నీరు విడుదల చేయాలని రైతులు కలెక్టర్‌ను కోరారు.
షార్ట్ సర్క్యూట్‌తో గుడిసెలు దగ్ధం
* రూ. 30 లక్షల ఆస్తి నష్టం
కల్లూరు, ఫిబ్రవరి 4 : కల్లూరు అర్బన్ ప్రాంతంలోని వీకర్‌సెక్షన్ కాలనీ మారవవీధిలో సోమవారం షార్ట్ సర్క్యూట్ జరిగి 10 గుడిసెలు దగ్ధం కాగా రూ. 30 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. వివరాలు.. మారవవీధికి చెందిన బుడ్డన్న తనకు ఉన్న 2.3 సెంట్ల స్థలంలో 10 కొట్టాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఇందులో ఒక గుడిసెలో తాను జీవనం సాగిస్తూ కుటుంబ పోషణ కోసం మిగతా 9 గుడిసెలను ఇతర ప్రాంతాల నుంచి బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చిన వారికి అద్దెకు ఇచ్చాడు. ఈ గుడిసెల్లో 5 కుటుంబాలు గత కొంత కాలంగా జీవనం సాగిస్తున్నాయి. సోమవారం ఉదయం ఉన్నఫళంగా షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించడంతో గుడిసెల్లో ఉన్న వారు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. అయితే గుడిసెల్లోని విలువైన వస్తువులు, నగదు, బంగారు ఆభరణాలు కాలి బూడిదయ్యాయి. ఈ విషయాన్ని గుడిసెల యజమాని బుడ్డన్నతో పాటు బాధితులు లక్ష్మిజయమ్మ, శోభ, శాంతమ్మ, సౌరమ్మ, లక్ష్మిదేవి, ప్రహ్లాదవెంకటలక్ష్మి రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధుల ఎదుట బోరున విలపించారు. కాలిపోయిన 10 గుడిసెల్లో దాదాపు రూ. 30 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. కాగా విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు కెఇ ప్రభాకర్, ఏరాసు ప్రతాపరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కాలిపోయిన గుడిసెలను పరిశీలించారు. అలాగే బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో పాటు తాత్కాలికంగా ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సంఘటనపై విచారణ చేపట్టాలని, సకాలంలో నష్టపరిహారం అందించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు.
పొలకల్లులో 4 గుడిసెలు దగ్ధం
సి.బెళగల్ : మండల పరిధిలోని పొలకల్లు గ్రామంలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 4 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. గ్రామానికి చెందిన హరిజన దుబ్బన్న, ఎల్లప్ప, అనురాధ, పెద్ద ఎల్లయ్యలకు చెందిన గుడిసెలు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో రూ. 4 లక్షల మేరకు నష్టం వాటిల్లింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
తమిళనాడులో రాఘవేంద్రస్వామి మఠం
* రూ. 6 కోట్ల విరాళాల సేకరణ
మంత్రాలయం, ఫిబ్రవరి 6: శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు ఆదేశాల మేరకు తమిళనాడు చెన్నై సమీపంలోని తాంభరంలో జరుగుతున్న శ్రీరాఘవేంద్ర స్వామి మఠం నిర్మాణ పనులను ఆ రాష్ట్ర మాజీ మంత్రి చిన్నయ్య, మున్సిపల్ చైర్మన్ కరికలన్‌తో కలసి పరిశీలించినట్లు సోమవారం మఠం సహాయ మేనేజర్ ఐపి నరసింహమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు సంకల్పం బలం మేరకు తమిళనాడు తాంభరంలో శ్రీ రాఘవేంద్ర స్వామి నూతన మఠం నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. దాతలు మాజీ మంత్రి చిన్నయ్య, మున్సిపల్ చైర్మన్ కరికలన్ రూ.6కోట్లు విరాళాలతో నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందన్నారు. మఠం నిర్మాణ పనులు పూర్తికాగానే పీఠాధిపతి ఆధ్వర్యంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మృత్తిక బృందావనాన్ని ప్రతిష్ఠించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారన్నారు.
కర్నూలు ఇన్‌చార్జి ఆర్డీఓగా
హుసేన్‌సాహెబ్
* ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్
కర్నూలుటౌన్, ఫిబ్రవరి 6:కర్నూలు ఇన్‌చార్జి ఆర్డీఓగా హుసేన్‌సాహెబ్‌ను నియమిస్తూ సోమవారం కలెక్టర్ విజయమోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ ఆర్డీఓగా పని చేస్తున్న రఘుబాబు కాకినాడకు బదిలీ కావడంతో ఆ స్థానంలో ఇన్‌చార్జిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సత్యనారయణను నియమించిన విషయం విదితమే. అయితే సోమవారం హౌసింగ్ పిడిగా పని చేస్తున్న హుసేన్‌సాహెబ్‌కు అదనంగా ఇన్‌చార్జి ఆర్డీఓ బాధ్యతలు అప్పగించారు. దీంతో హుసేన్‌సాహెబ్ మంగళవారం బాధ్యతలు చేపట్టనున్నారు.
విద్యార్థులకు నులిపురుగు
నివారణ మందులేయండి:జెసి
కర్నూలుటౌన్, ఫిబ్రవరి 6:పల్స్‌పోలియో తరహాలో జిల్లాలో 1-18 సంవత్సరాల లోపు బాల, బాలికల చేత నులిపురుగుల నివారణ మందులు మింగించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ హరికిరణ్ అధికారులను ఆదేశించారు. నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీపై సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లాలో 1-18 ఏళ్ల లోపు బాల బాలికల చేత ఆల్బెండజోల్ మాత్రలు మింగించేందుకు పక్కా ప్రణాళిక తయారు చేయాలని డిఇఓ, డివిఇఓలను ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో కూడా ఈ మందులు పంపిణీ చేయాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి ఎంపిడిఓలు సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఇదిలా ఉండగా సమావేశానికి గైర్హాజరైన అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది షోకాజ్ నోటీసు జారీ చేయాలని జెసి ఇన్‌చార్జి డిఎంహెచ్‌ఓను ఆదేశించారు. సమావేశంలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులు, కమిషనర్ రవీంద్రబాబు, డిఆర్‌డిఎ పిడి రామకృష్ణ, ఇన్‌చార్జి డిఎంహెచ్‌ఓ డా. మీనాక్షిమహదేవన్, ఆర్‌బిఎస్‌కె కో ఆరిడనేటర్ హేమలత, డివిఇఓ వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.
టిడిపిలో కార్యకర్తలకు
మంచి గుర్తింపు
* ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి
ఎమ్మిగనూరు, ఫిబ్రవరి 6: టిడిపిలోనే కార్యకర్తలకు, నాయకులకు మంచి గుర్తింపు వస్తుందని, రాబోవు రోజుల్లో పార్టీ కోసం కష్టపడాలని ఎమ్మెల్యే డాక్టర్ బివి.జయనాగేశ్వర రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఉప్పర కల్యాణ మండపంలో మండ ల, గ్రామ, వార్డు, నియోజకవర్గ స్థాయి ఎన్నిక కమిటీ శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ సెక్రటరీ జకీవుల్లా, స్టేట్ కాపు కార్పొరేషన్ గుడిసే కృష్ణమ్మలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ ఆ నాడు టిడిపిని ఎన్టీఆర్ ఎన్నో ఆశయాలతో ముందకు తీసుకుపోయారని, ఎన్టీఆర్ ఎక్కడ పోయిన ఒక గుర్తింపు నాయకుడిగా ఉండేవారని, ఆయన పేదలకు, మహిళలకు, మైనార్టీలకు ఎన్నో సేవల చేశారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. కష్టపడి పనిచేస్తే టిడిపిలో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేశారని, రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. నా తండ్రి మాజీ మంత్రి బివి.మోహన్‌రెడ్డి తుది శ్వాశ ఉన్నత వరకు పసుపుపచ్చ కండువ వేసుకుని శ్వాస వదిలారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. 2014 ఎన్నికలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటే ఎవ్వరు బలమైన నాయకులు లేకపోయిన బివి. మోహన్‌రెడ్డి చేసిన సేవలు గుండెల్లో పెట్టుకుని నాకు 17 వేల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. గ్రామాల్లో ఎన్నికల పక్రీయ గురించి ఎమ్మెల్యే కార్యకర్తలకు వివరించారు. రాబోవు ఎన్నికలో ఒక యుద్ధంలా పోరాడాలని పిలుపునిచ్చారు. ముందుకుగా మాజీ సిఎం ఎన్టీఆర్, మాజీ మంత్రి బివి చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షడు అజ్మతుల్లా, నాయకులు సుందర్‌రాజు, నరసింహా దామా, రాందాస్ గౌడ్, ఎంపిపి శంకరయ్య, మండల కన్వీనర్ అగ్రహారం పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలంలో శివరాత్రి ఉత్సవాలకు
పటిష్ట భద్రత
* ఎస్పీ ఆకే రవికృష్ణ
కర్నూలు, ఫిబ్రవరి 6:శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రక్షణే ధ్యేయంగా పోలీసులు పని చేయాలని ఎస్పీ ఆకే రవికృష్ణ ఆదేశించారు. శివరాత్రి ఏర్పాట్లపై సోమవారం ఎస్పీ నగరంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి శ్రీశైలం వచ్చే భక్తుల పట్ల పోలీసులు మర్యాద పూర్వకంగా ప్రవర్తించాలన్నారు. ఎక్కువ మంది జనసమూహం ఉన్న షాపులు, హోటళ్ల దగ్గర ప్రజాభద్రత చట్టం ప్రకారం సిసి కెమెరాలు ఏర్పాటు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసుకోవాలని, యాత్రికుల వాహనాల పార్కింగ్ స్థలాలు, క్యూలైన్లు, బారికేడ్ల ప్రవేశం, నిష్క్రమణ దగ్గర ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కాలి నడకన వెళ్లే భక్తులకు వలంటీర్ల సహకారంతో సేవలు అందించాలన్నారు. లాడ్జిలు, సత్రాల్లో ఉండే వారు ఆధార్‌కార్డు వంటి గుర్తింపుకార్డు కలిగి ఉండాలన్నారు. ఎక్కడైనా అనుమానితులు తారసపడితే డయల్ 100కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఏఎస్పీలు శివరామ్‌ప్రసాద్, వెంకటేష్, ఓఎస్‌డి రవిప్రకాష్, కమాండెంట్ చంద్రవౌలి, డీఎస్పీలు బాబుప్రసాద్, ఏజి కృష్ణమూర్తి, వినోద్‌కుమార్, రామచంద్ర, ఏఓ అబ్దుల్‌సలాం, సిఐలు పార్థసారధి, కృష్ణయ్య, ఆర్‌ఐలు రంగముని, జార్జ్, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా వీరభద్రస్వామి రథోత్సవం
పత్తికొండ, ఫిబ్రవరి 6: మండల పరిధిలోని హోసూరు గ్రామంలో వెలసిన శ్రీవీరభద్రస్వామి జాతర సందర్భంగా స్వామివారి రథోత్సవం సోమవారం పట్టణ పురవీధుల గుండా ఘనంగా నిర్వహించారు. వేలాది మంది భక్తుల మధ్య ఆలయ కమిటీ చైర్మన్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి, వైకాపా, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ, బిజెపి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
శివలింగం ప్రతిష్ఠ
హొళగుంద, ఫిబ్రవరి 6: మార్లమడికి గ్రామంలో ఈశ్వరస్వామి దేవాలయంలో సోమవారం శివలింగాన్ని ప్రతిష్ఠించారు. గంగాధర స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి గణపతి, నవగ్రహ విగ్రహాలతో శివలింగం కూడా ప్రతిష్ఠించారు. గణపతిహోమం, నవగ్రహ హోమం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు.

21 నుంచి దేవతమూర్తుల విగ్రహాల ప్రతిష్ఠ
ఆదోని, ఫిబ్రవరి 6: బైచిగేరిగ్రామంలో నూతనంగా నిర్మించిన దేవాలంయలో దేవతమూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠ కార్యక్రమం మూడు రోజులపాటు నిర్వహిస్తున్నట్లు దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈనెల 21 మంగళవారం ఉదయం 8 గంటలకు గంగపూజ, గోపూజ, యాగశాల ప్రవేశం, గణపతి పూజ, రుత్వీక్ వరుణపూజ, పంచగవ్వప్రశాన, రక్షాబందనం, కలశస్థాపన జపాలు, అభిషేకాలు, అగ్ని ప్రతిష్ఠ, మహామంగళహారతి, తీర్థప్రసాదాలు, సాయంత్రం 5 గంటలకు మృత్సం గ్రహణం, అంకుర్పాణం, జలాధివాస హోమాలు, మహామంగళహారతి, 22వ తేదీ బుధవారం అభిషేకాలు, జపాలు, నవగ్రహా హోమాలు, చండీహోమం, మహాస్నపనం, హోమాలు, 23 గురువారం అభిషేకం, గర్తపూజ, యంత్ర ప్రతిష్ఠ, విగ్రహప్రతిష్ఠ, ప్రాణప్రతిష్ఠ, కక్షజ్వాల, గోదర్శనం, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామప్రజలు, పెద్దలు హాజరు కావాలని కోరారు.
ఆర్డీఎస్ కుడి కాలువ రైతులకు వరం
* ఎమ్మెల్యే జయనాగేశ్వర్‌రెడ్డి
నందవరం, ఫిబ్రవరి 6: నియోజకవర్గంలోని రైతులకు ఆర్డీఎస్ కుడి కాలువ రైతులకు వరం లాంటిందని ఎమ్మెల్యే జయనాగేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం నందవరం పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రూ.3.9.కోట్లతో పనులతో ఆర్డీఎస్ కుడి కాలువ సర్వే పనులను ప్రారంభించామన్నారు. ఈకాలువ నిర్మాణం పనులు పూర్తి అయితే నియోజకవర్గంలోని వేలాది ఎకరాల భూములు సాగులోకి వస్తాయని తెలిపారు. ఆర్డీఎస్ కుడికాలువ పనులకు సిఎం చేతుల మీదుగా పనులను ప్రారంభిస్తామన్నారు. అలాగే మంత్రాలయం, కర్నూలు రైల్వే సర్వే పనులు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర మంత్రిని కోరగా వాటికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. మండలంలోని 504 మందికి కొత్తగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. అలాగే మండలంలోని ప్రతి గ్రామానికి సాగునీరు అందిచేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తుంగభద్ర నది నుండి పంపిణీ చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పుష్పావతి, ఎంపిపి నరసింహారెడ్డి, తెలుగుదేశం నాయకులు మాదవరావ్ దేశాయ్, గడ్డం నారాయణరెడ్డి, కాశీంవలీ, మండల కన్వీనర్ చిన్నరాముడు, పెద్దరాముడు, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి రావెల కిశోర్‌ను
భర్తరఫ్ చేయాలి
* మాజీ మంత్రి మారెప్ప
ఆలూరు, ఫిబ్రవరి 6: దళితుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న మంత్రిరావెల కిశోర్‌ను మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేయాలని మాజీ మంత్రి మూలింటి మారెప్ప డిమాండ్ చేశారు. సోమవారం ఆలూరు ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ మంత్రిరావెల కిశోర్ దళితల అభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదన్నారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టి మాదిగలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రిని కలిసి విన్నవించడం జరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలు దళితలకు చేరకుండా అధికారులు నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
పూజలందుకుంటున్న అహోబిలేసుడు
ఆళ్లగడ్డ, ఫిబ్రవరి 6: పారువేట ఉత్సవాల్లో భాగంగా ఆళ్లగడ్డకు చేరుకున్న అహోబిలేసుని పారువేట ఉత్సవ పల్లకి నిత్యం ప్రజల నుండి ప్రత్యేక పూజలు అందుకుంటోంది. అందులో భాగంగా సోమవారం పట్టణంలోని అమ్మవారిశాల వీధి, తదితర ప్రాంతాలలో పల్లకి పర్యటించింది. తెలుపుల వద్ద ప్రజల నుండి పూజలందుకుంది. పల్లకిలో కొలువు దీరిన శ్రీ జ్వాలా నరసింహస్వామి, శ్రీ ప్రహ్లాద వరదస్వామిలను దర్శించుకొని పూజలు చేశారు. పట్టణంలోని పాతబస్టాండ్ నుండి అమ్మవారిశాల బజారు వరకు తిరుణాల వాతావరణం నెలకొంది.
చౌడేశ్వరీమాత ఆలయానికి రూ. 18.78 లక్షల ఆదాయం
బనగానపల్లె, ఫిబ్రవరి 6:మండల పరిధిలోని నందవరం శ్రీ చౌడేశ్వరీమాత ఆలయానికి వివిధ వేలాల ద్వారా రూ. 18.78 లక్షల ఆదాయం వచ్చినట్లు ఇఓ రామానుజన్ తెలిపారు. ఆలయం వద్ద సోమవారం టెంకాయల అంగడి, కూల్‌డ్రింక్స్, హోటల్ తదితర వాటిని నిర్వహించుకునేందుకు దేవాదాయశాఖ అధికారి రఘురామ్ సమక్షంలో ఉదయం 11 గంటలకు ఇఓ వేలం నిర్వహించారు. ఇందులో టెంకాయల అంగడికి రూ. 13,61,000, కూల్‌డ్రింక్స్ షాపునకు రూ. 3,16,000, హోటల్ నిర్వహణకు రూ. 2,01,000లకు ఔత్సాహికులు వేలం పాడినట్లు తెలిపారు. వేలంలో మొత్తం 16 మంది పాల్గొనగా ఎక్కువ వేలం నమోదు చేసిన వారికి ఆయా షాపులు దక్కినట్లు ఇఓ తెలిపారు. వేలం జరుగుతున్న సమయంలో ఎలాంటి సంఘటనలు, ఘర్షణలు చోటుచేకోకుండా నందివర్గం ఎస్‌ఐ జి.బ్రహ్మానందరెడ్డి పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.
ఘనంగా శ్రీసిద్ధేశ్వరస్వామి రథోత్సవం
కౌతాళం, ఫిబ్రవరి 6: మండల పరిధిలోని హాల్వి గ్రామంలో వెలసిన శ్రీ సిద్ధేశ్వరస్వామి రథోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ రథోత్సవాన్ని తిలకించడానికి ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. తెల్లవారు జామున స్వామివారికి సుప్రభాత సేవ, ద్వీపారాధన, మహామంగహారతి వంటి ప్రత్యేక పూజలు చేశారు. హాల్వి, శరణగిరి మఠం పీఠాధిపతులు శ్రీమహాంతస్వామి ఆధ్వర్యంలో స్వామివారికి పూజలు చేశారు. ఈ ఉత్సవాల్లో టిడిపి మంత్రాలయ నియోజకవర్గ ఇన్‌చార్జి తిక్కారెడ్డి, మండల కన్వీనర్ ఉలిగయ్య, జిల్లా తెలుగు యువత నాయకులు సురేష్‌నాయుడు, గ్రామ సర్పంచ్ చిన్న ఈరన్న పాల్గొన్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆదోని తాలూకా సిఐ దైవ ప్రసాద్, కౌతాళం ఎస్‌ఐ సుబ్రమాణ్యంరెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
హొళగుందలో...
హొళగుంద: హొళగుందలో వెలసిన శ్రీ సిద్ధేశ్వరస్వామి రథోత్సవం, భక్తుల జన సందోహం మధ్య రంగ, రంగ వైభవంగా కన్నుల పండువగా జరిగింది. ఆలయ ధర్మకర్త రాజాపంపన్నగౌడ్ ప్రత్యేక పూజలు చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఉదయం నుంచి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. చాలా మంది భక్తులు పూలదండలను ఊరేగింపుగా తీసుకొచ్చి రథానికి అలంకరించి తమ మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం జరిగిన రథోత్సవంలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రథోత్సవంలో సందర్భంగా హొళగుందలో మారెమ్మదేవాలయం, మడివాల మాచప్పదేవాలయం, చిన్నసాహెబ్ దర్గాల్లో కూడా భక్తులు పూజలు చేశారు. రంగు రంగుల దీపాలతో అన్ని దేవాలయాలను అలంకకరణ చేశారు. సాయంత్రం పెద్ద ఎత్తున రథోత్సవం నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు. సిఐ అబ్దుల్ గౌస్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ఈకార్యక్రమంలో తెలుగుదేశం ఆలూరు ఇన్‌చార్జి వీరభద్రగౌడ్, నాయకులు శివన్నగౌడ్, సిద్దార్థ, హరిష్, తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌జెడిగా ప్రతాప్‌రెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
కడప, ఫిబ్రవరి 6: కడప జిల్లా విద్యాశాఖాధికారి బి.ప్రతాప్‌రెడ్డికి ఆర్‌జెడిగా పదోన్నతి లభించింది. రాయలసీమ జిల్లాల పాఠశాల విద్యాశాఖ కడప ఆర్‌జెడిగా బి.ప్రతాప్‌రెడ్డికి పదోన్నతి లభించడంతో సీమ జిల్లాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
డీలర్లు సమయపాలన పాటించాలి
నంద్యాల, ఫిబ్రవరి 6: నంద్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని చౌక దుకాణాల డీలర్లు అందరు ప్రభుత్వం నిర్ణయించిన సమయపాలన పాటిస్తు ఉదయం 7 -11 గంటల వరకు, సాయంత్రం 4-8 గంటల వరకు చౌక దుకాణాలను ప్రజల కోసం తెరచి ఉంచాలన్నారు. ఈ నెల 3వ తేదీన గోస్పాడు మండలంలోని జూలేపల్లె, ఎం చింతకుంట్ల గ్రామాల్లో తాను తనిఖీ చేయగా వారు దుకాణాలు తెరువలేదని, అందుకు వారికి నోటీసులు పంపడం జరిగిందన్నారు. ఇకమీదట సమయపాలన పాటించని దుకాణాల డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ప్రజాదర్బార్‌లో సోమవారం 21 వినతిపత్రాలు అందాయన్నారు. వీటిలో ఎక్కువ భాగం భూ వివాదం, భూముల కొలతలు, పెన్షన్లు ఇప్పించాలని, భూములు ఆన్‌లైన్ చే యించాలని, జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇప్పించాలని వినతిపత్రాలు అందాయన్నారు. కోర్టులలో వివాదాలు ఉన్న వాటిలో తాము జోక్య చేసుకోమని, మిగిలిన వాటికి సంబంధిత తహశీల్దార్‌లతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్థక శాఖ ఎడి రమణ, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ మోదకొండ, సిడిపిఓ ఆగ్నేస్ ఎం జెల్, ముక్తియార్ అహ్మద్, హౌసింగ్ ఇఇ సుధాకర్‌రెడ్డి, ఇతర శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
నేడు విష్ణుసహస్రనామ పారాయణం
ఆళ్లగడ్డ, ఫిబ్రవరి 6: పట్టణంలోని అమ్మవారిశాలలో నడే మంగళవారం భీష్మ ఏకాదశి సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీ విష్ణుసహస్ర నామ పారాయణ, సహస్తగ్రళ అర్చన సత్సంగ కార్యక్రమం జరుగుతుందని ధర్మజాగారణ సమితి సభ్యులు ఆంజనేయులు, శ్రీనివాసరెడ్డి, జనార్ధన్‌లు తెలిపారు. ఈ కార్యక్రమం శ్రీ నిత్యమూక్తదాస్ ఇస్కాన్, తిరుపతి వారిచే జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
ఆటో బోల్తా.. ఒకని మృతి
* ముగ్గరికి గాయాలు
కోగిసి, ఫిబ్రవరి 6: ఆటోబోల్తా పడి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలోచోటు చేసుకుంది. సోమవారం కోసిగిలోని పెట్రోల్ బంక్ సమీపంలో ఆటో ఆదుపు తప్పి బెళగల్ గ్రామానికి చెందిన కృష్ణయ్య, తాయమ్మ దంపతుల కుమారుడు విద్యార్థి రాజు(18) మృతి చెందాడు. గ్రామం నుంచి ఉయదం కోసిగిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఆటో బయలుదేరి పెట్రోల్ బంకు సమీపంలో ఆటో కుక్కను తప్పించబోయి బోల్తా పడి రాజుకు తలకు బలమైన గాయం కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. అలాగే రామాంజినేయులు, రంగారెడ్డి, మహాలక్ష్మీకి తీవ్రగాయాలు కావడంతో 108 వాహనంలో ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈవిషయం తెలుసుకున్న పోలీసులు మోహన్‌కృష్ణ, దస్తగిరి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమాస్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థిని ఆత్మహత్య
నందికొట్కూరు, ఫిబ్రవరి 6: పట్టణంలోని కోట హైస్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని రేణుకాదేవి(16) సోమవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బంధువులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని బైరెడ్డినగర్ కాలనీలో నివాసం ఉంటున్న సుబ్బయ్య, జయమ్మ దంపతుల కూతురు రేణుకాదేవి చాలా రోజులుగా కడుపునొప్పితో బాధ పడుతుండేది. ఈక్రమంలో సోమవారం కడుపునొప్పి తీవ్రం కావడంతో ఆ బాధ భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఆలయంలో చోరీ
కొలిమిగుండ్ల, ఫిబ్రవరి 6: మండలంలోని తిమ్మనాయినిపేట గ్రామంలో వెలసిన వెర్రి గోవిందరాజు స్వామి ఆలయంలో సోమవారం తెల్లవారుజామున దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి గుడిలోకి ప్రవేశించి పెద్ద హుండిని పగులగొట్టేందుకు ప్రయత్నించి విఫలమై, చిన్న హుండీని చోరీ చేసి గ్రామ సమీపంలోని కొండల్లో వదిలి వెళ్లారు. హుండీలో సొమ్ము రూ.10 వేలకు పైగా ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. గత కార్తీకమాసంలో హుండీలను లెక్కించగా లక్షల్లో ఆదాయం వచ్చిందని, దాన్ని ఆసరాగా చేసుకొని చోరీకి పాల్పడి ఉంటారని స్థానికులు తెలిపారు.దేవాలయ అధికారులు కొలిమిగుండ్ల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య అక్కడికి చేరుకొని పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
ద్విచక్ర వాహనాలు ఢీ.. ముగ్గురికి గాయాలు
బేతంచెర్ల, ఫిబ్రవరి 7: మండల పరిధిలోని ఆర్.కొత్తపల్లె సమీపంలో సోమవారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వివరాలు.. కొత్తపల్లెకు చెందిన భాస్కర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి ద్విచక్ర వాహనంపై డోన్ వైపు వెళ్తుండగా డోన్ నుంచి బేతంచ్లె వైపు బైక్‌పై వస్తున్న శేఖర్ ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ సంఘటనలో వారు ముగ్గురు గాయపడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో లైఫ్ అంబులైన్స్ సంఘటనా స్థలానికి చేరుకుని వారిని బేతంచెర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అత్యాచారం కేసులో ఏడేళ్ల జైలు
ఆదోనిటౌన్, ఫిబ్రవరి 6: ఆలూరు మండలంలోని పెద్దహోత్తూరు గ్రామంలో వివాహితపై అత్యాచారం చేసిన కేసులో అదే గ్రామానికి చెందిన ముల్లా నిజాముద్దీన్‌పై కేసు రుజువు కావడంతో 7 సంవత్సరాలు కఠిన కారాగార జైలు శిక్ష, రూ.2వేలు జరిమానాన విధిస్తూ జిల్లా రెండవ అదనపుకోర్టు జడ్జి శ్రీనివాసరావు సోమవారం తీర్పు చెప్పారు. 2009 నవంబర్ 17న అనారోగ్యం బారిన పడిన వివాహిత మహిళ అంత్రాల కోసం ముద్దాయి వద్దకు వెళ్లగా నమ్మించి అత్యాచారం చేశారని, ఆమెతోపాటు ఆమె తల్లిదండ్రులు ఆలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2013, మే 1వతేదీ అసిస్టెంట్ కోర్టులో విచారణ పూర్తికాగ నిందితుడికి అసిస్టెంట్ సెషన్స్‌కోర్టు జడ్జి 7 సంవత్సరాల జైలు శిక్ష, రూ.2వేల జరిమాన విధిస్తూ తీర్పు చెప్పారన్నారు. అయితే ఈతీర్పును సవాల్ చేస్తూ జిల్లాకోర్టును నిందితుడు ఆశ్రయించాడు. ఈకేసును విచారించిన జిల్లా రెండవ అదనపుకోర్టు జడ్జికింది కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తూ తీర్పు చెప్పినట్లు అదనపు ప్రభుత్వ న్యాయవాది రఫత్ వివరించారు. బాధితురాలు తరపున న్యాయవాది రఫత్ వాదించారు. ముద్దాయిని పోలీసులు అదుపులోకి తీసుకుని సబ్‌జైల్‌కు తరలించారు.
గొలుసు దొంగ అరెస్టు
ఆదోనిటౌన్, ఫిబ్రవరి 6: పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ దొంగ షేక్‌మలంగ్‌ను అరెస్టు చేసి అతని వద్ద నుంచి 40గ్రాముల బంగారు ఆభరాణాలు స్వాదీనం చేసుకున్నట్లు డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం డిఎస్‌పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దొంగతనం జరిగిన వివరాలను వివరించారు. గుంతకల్లుకు చెందిన ఈరాణి గ్యాంగ్ ప్రధాన నిందితుడు షేక్‌మలంగన్‌ను త్రిటౌన్ పోలీసులు గోవా సబ్‌జైల్‌లో ఉన్న నిందితున్ని పిటి వారెంట్‌పై అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. ఈసమావేశంలో సిఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ విజయ్, సునిల్‌లు పాల్గొన్నారు.
ఐదు గుడిసెలు దగ్ధం
పాణ్యం, ఫిబ్రవరి 6: పాణ్యం ఇందిరా నగర్ చెంచుకాలనికి చెందిన ఐదు గిరిజనుల ఇళ్లు షాట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమయ్యాయి. అలాగే రెండు గడ్డివాములు కూడా దగ్ధమయ్యాయి. దీంతో సుమారు రూ.5 లక్షల ఆ