కర్నూల్

మల్లన్నకు పట్టువస్త్రాల సమర్పణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, ఫిబ్రవరి 21 : శ్రీశైలం మహాక్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మహాశివరాత్రి రోజున స్వామి అమ్మవార్లకు కల్యాణోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోం ది. ఈ కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు దంపతులు స్వామి అమ్మవార్లకు మంగళవారం సాయంత్రం పట్టువస్త్రాలను సమర్పించారు. పూర్వ కాలంలో రాజులు, రాజ కుటుంబీకులు దేవాలయాలలో కల్యా ణం జరిగినప్పుడు స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. ఈ ఆనవాయితీని ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు అందిస్తున్నారు. ఈవిశేష కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి దంపతులు, ఆలయ ఇఓ నారాయణ భరత్ గుప్త, అధికారులు పాల్గొన్నారు. ముందుగా ఆలయ రాజగోపురం వద్ద దేవస్థానం అర్చక వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం పట్టువస్త్రాలను మంత్రి ఆలయ ఇఓకు అందజేశారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఆలయ అర్చక వేద పండితులు మంత్రిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఇఓ మంత్రికి స్వామి అమ్మవార్ల జ్ఞాపికను అందించారు.
రావణ వాహనంపై గ్రామోత్సవం..
ఉదయం స్వామి అమ్మవార్లకు అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల యాగశాలలో ప్రత్యేక యాగాలు, హోమాలు, జపానుష్టానాలు, పారాయణాలు, విశేష పూజలను ఆలయ అర్చక వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల వాహన సేవల్లో భాగంగా మంగళవారం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లు రావణ వాహనంపై ఆశీనులై భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం ప్రదోషకాల పూజలనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకరణ మండపంలో ప్రత్యేకంగా అలంకరింప చేయించి రావణ వాహనంపై వేయింపచేశారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ, వేద మంత్రోచ్చారణలతో ఆలయ అర్చక పండితులు అలంకరణ పూజలను అక్కమహాదేవి అలంకరణ మండపంలో ఆగమశాస్త్రానుసారంగా పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను మేళతాళాల నడుమ ఆలయ రాజగోపురం నుంచి శ్రీశైలం క్షేత్రం పురవీధుల్లోకి తోడ్కొని వచ్చారు. ఈవిశేష కార్యక్రమంలో స్వామి అమ్మవార్లను రావణ వాహనంపై ఆశీనులను చేసి ఆలయ అర్చక వేద పండితులు మంత్రోచ్చారణ చేస్తుండగా మేళతాళాల నడుమ విద్యుత్ కాంతుల నడుమ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయ పురవీధుల్లో ఎంతో వైభవంగా ఊరేగిస్తూ గ్రామోత్సవం ముందుకు సాగింది. ఈగ్రామోత్సవంలో ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన కోలాటాలు, గొరవయ్యల నృత్యాలు, డప్పు వాయిద్యాలు, తోలుబొమ్మలాటలు, పగటి వేషాలు నడుమ కళాకారులు పలు విన్యాసాలతో క్షేత్ర పురవీధులు అత్యంత ఆధ్యాత్మిక భావనలతో చోటుచేసుకుంది. పురవీధుల్లో స్వామి అమ్మవార్ల గ్రామోత్సవానికి భక్తులు, శివస్వాములు అడుగడుగునా నారీకేళములు సమర్పించి కర్పూర హారతులతో నీరాజనాలు పలికారు. ఈ కార్యక్రమంలో ఇఓ నారయణ భరత్‌గుప్త దంపతులు, ఎసి మహేశ్వరరెడ్డి, ఆలయ అర్చక వేద పండితులు, అధికారులు, అధిక సంఖ్యలో భక్తులు, శివస్వాములు పాల్గొని స్వామి అమ్మవార్ల గ్రామోత్సవాన్ని చూసి తరించారు.
శ్రీశైలంలో నేటి కార్యక్రమాలు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు పలు ఏర్పాట్లను చేయడం జరిగింది.
* నేడు స్వామి అమ్మవార్లకు పుష్పపల్లకీ సేవ.
* నేటితో నిలిచిపోయిన స్పర్శ దర్శనం.
* ఆలయ వేళల్లో మార్పులు. భ్రామరీ కళామందిరం, శివదీక్ష శిబిరాల వద్ద భక్తులను అలరించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు.
* క్యూ లైన్లలో భక్తుల సౌకర్యార్థం, కాలినడకన వచ్చే భక్తులకు ఆయా ప్రాంతాల్లో నీటి ప్యాకెట్లు, మజ్జిగ, అల్పాహారం పంపిణీ.
* పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు మెరుగైన సౌకర్యాలు, పోలీస్ బందోబస్తు.
* సిసి కెమెరాలతో పోలీసుల ప్రత్యేక పర్యవేక్షణ.
ఇక స్థానిక సంస్థల వంతు..
* 17న పోలింగ్.. 19న కౌంటింగ్
కర్నూలు సిటీ, ఫిబ్రవరి 21:రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పట్ట్భద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే. మంగళవారం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసింది. ఆ ప్రక్రియలో భాగంగా ఈ నెల 21 నుం చి 28వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, ఆ తర్వాత మార్చి 1న నామినేషన్ల పరిశీలన, 3న నామినేషన్ల తిరస్కరణ ఉంటుందన్నారు. 17వ తేదీ పోలింగ్ 19వ తేదీ కౌంటింగ్ ఉంటుం ది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపిలు, ఎమ్మెల్యేలు, జడ్పీటిసిలు, ఎంపిటిసిలతో పాటు పురపాలక సంఘాల కౌన్సిలర్లు ఓటర్లుగా ఉండి స్థానిక సంస్థల తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎన్నుకుంటారు. గత ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేసిన శిల్పా చక్రపాణి రెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన డి.వెంకటేశ్వరెడ్డిపై దాదాపు 160 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అప్పుడు జిల్లాలో 1087 మంది ఓటర్లు ఉండగా 1080 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుతం జరగనున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1084 మంది ఓటు హక్కు కలిగి ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. వారిలో కర్నూలు డివిజన్‌లో 386 మంది ఓటర్లు ఉండగా నంద్యాల డివిజన్‌లో 307 మంది, ఆదోని డివిజన్‌లో 391 మంది ఓటర్లు ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు జిల్లా వ్యాప్తంగా 53 మంది జడ్పీటిసిలకు గానూ వైకాపా 30, టిడిపి 20, కాం గ్రెస్ 2, ఆర్పీఎస్‌లకు 1 ఓటు ఉండేవి. ఇక నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, మున్సిపాలిటీలతో పాటు గూడూరు, నందికొట్కూరు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ నగర పంచాయతీల్లో దాదాపు 218 మంది వార్డు కౌన్సిలర్లు ఉన్నారు. ప్రస్తుతం అన్నింటిలో అధికార పార్టీకి చెందిన వారే పాలక వర్గంగా ఉన్నారు. ఇక జిల్లాలో 14 నియోజక వర్గాలకు గానూ 8మంది ఎమ్మెల్యేలు, నంద్యాల ఎంపి మాత్రమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. కర్నూలు ఎంపి, ఎమ్మెల్యే ఎక్స్‌అఫిషియో సభ్యులు అయినప్పటికీ పాలకవర్గం లేకపోవడంతో ఓటు వేసే అర్హత లేకుండాపోయింది. మారుతున్న రాజకీయ సమీకరణల దృష్ట్యా ఎవరికి వారు తమదే విజయం అన్న ధీమాతో ఉన్నారు.
22 నామినేషన్ల తిరస్కృతి
* పట్ట్భద్రులు-16, ఉపాధ్యాయులు-6
కల్లూరు, ఫిబ్రవరి 21:పట్ట్భద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాఖలు చేసిన నామినేషన్లలో పట్ట్భద్రులకు సంబంధించి 65 నామినేషన్లలో 49 నామినేషన్లను అంగీకరించి 16 నామినేషన్లను తిరస్కరించారు. అలాగే ఉపాధ్యాయ విభాగంలో 28 నామినేషన్లు రాగా అందులో 6 నామినేషన్లను తిరస్కరించి ఒక నామినేషన్‌ను పెండింగ్‌లో ఉంచినట్లు అనంతపురం ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలియజేసినట్లు సమాచార పౌర సంబంధాల అధికారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మండుతున్న ఎండలు!
* జనం గగ్గోలు..
కర్నూలు సిటీ, ఫిబ్రవరి 21:సాధారణంగా శివరాత్రి సమయంలో చలి ముదిరిపోయి పండగ తర్వాత మార్చి మాసారంభంలో ఎండలు నెమ్మదిగా ఎక్కువై గరిష్టస్థాయికి చేరుకుంటాయి. కానీ అందుకు విరుద్దంగా శివరాత్రి ఇంకా 4 రోజులు ఉండగానే జిల్లా వ్యాప్తంగా మండుతున్న ఎండలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. గత రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు ఒకేసారి 39 డిగ్రీలకు చేరడంతో చిన్న పిల్లలు, వృద్ధులు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. నగరంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 4గంటల వరకూ తీవ్రమైన ఎండ కాస్తుండటంతో ప్రజలు ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే జంకుతున్నారు. అత్యవసర పని ఉంటే తప్ప బయటికి రావటం లేదంటే అతిశయోక్తి కాదు. శివరాత్రి రాకముందే ఇంత తీవ్రమైన ఎండ ఉందంటే ఇక మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో ఎండ తీవ్రత ఏస్థాయిలో ఉంటుందోనని నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక వివిధ పనులపై నగరానికి వచ్చిన గ్రామీణ ప్రాంత ప్రజలు ఎండ వేడికి తట్టుకోలేక నీడ ఉండే ప్రాంతాన్ని వెతుక్కుంటున్నారు. దీనికి తోడు వాతావరణ శాఖ అధికారులు సైతం ఇంకా ఎండలు తీవ్రతరం అవుతాయని ప్రకటిస్తున్నారు. కావున ప్రజలు కూడా వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద
144 సెక్షన్ ఆంక్షలు
* కలెక్టర్ విజయమోహన్
కర్నూలుటౌన్, ఫిబ్రవరి 21:ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసి కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఆంక్షలు అమలుచేయాలని కలెక్టర్ విజయమోహన్ అధికారులను ఆదేశించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై మంగళవారం తన ఛాంబర్‌లో కలెక్టర్ ఎస్పీ రవికృష్ణతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్ష కేంద్రానికి ఒక కిలోమీటర్ లోపు జిరాక్స్ కేంద్రాలు మూసివుంచేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు గంట ముందుగానే కేంద్రానికి వచ్చేలా చూడాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ప్రథమ చికిత్స కిట్లు ఏర్పాటుచేయాలని డిఎంహెచ్‌ఓను ఆదేశించారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ విద్యుత్ సరఫరా చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రాల్లో ఫర్నిచర్ కొరత వుంటే వివరాలు ఇవ్వాలన్నారు. జిల్లాలో మార్చి 1 నుంచి 18వ తేదీ వరకూ జరిగే పరీక్షలకు ప్రథమ సంవత్సరం నుంచి 38,895 మంది, ద్వితీయ సంవత్సరం నుంచి 32,664మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. ఆర్‌ఐఓ పరమేశ్వరరెడ్డి మాట్లాడుతూ పరీక్షల నిర్వహణకు 4 ఫ్లయింగ్ స్క్వాడ్, 7 సిట్టింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎస్పీ రవికృష్ణ మాట్లాడుతూ మాల్ ప్రాక్టీస్ జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. పరీక్ష అనంతరం సమాధాన పత్రాలను సకాలంలో పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించాలన్నారు. సమావేశంలో ఇంటర్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
అబద్ధాలతో మభ్యపెడుతున్న
సిఎం చంద్రబాబు
* ఆర్పీఎస్ అధ్యక్షుడు బైరెడ్డి
కర్నూలు సిటీ, ఫిబ్రవరి 21:సిఎం చంద్రబాబు సీమ వాసి అయినప్పటికీ అబద్ధాలతో ఆకలిగొన్న రాయలసీమ వాసుల కడుపు నింపాలనే ప్రయత్నం చేస్తున్నారని రాయలసీమ పరిరక్షణ సమితి(ఆర్పీఎస్) అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి విమర్శించారు. నగరంలోని ఓ హోటల్‌లో మంగళవారం బైరెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. సిఎం చంద్రబాబు కోస్తా నాయకులకు భయపడి తన అబద్ధాలతోనే సీమ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గత 65 సంవత్సరాలుగా సీమ ప్రజలు దగా పడుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని, హైకోర్టు వంటి వాటిని ఒకే చోట కేంద్రీకరించి మరొకసారి మోసం చేయటానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కోస్తా ప్రాంతంలోనే ఎక్కువగా ఎమ్మెల్యే, ఎంపిల సీట్లు ఉన్నందున అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా కోస్తా నాయకుల భయం తో సీమ వెనుకబాటుతనంపై నోరు విప్పటం లేదని విమర్శించారు. పార్లమెంటు, కౌన్సిల్, శాసనసభలో సీమవాదాన్ని వినిపించే నాయకుడే కరువైపోయాడని వాపోయారు. వేసవి ప్రారం భం కాకముందే తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సిఎం చంద్రబాబు అమరావతి జపం తప్ప మరొకటి చేయటం లేదన్నారు. అలాగే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా జీవో నెం. 69 గురించి మాట్లాడటం లేదని, ఆ జీఓను రద్దు చేస్తే తప్ప సీమ ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పవని వెల్లడించారు. ఇక సీమలోని ఖనిజ సంసపద, ఎర్ర చందనాన్ని కొల్లగొడుతున్నారే తప్ప ఈ ప్రాంతం అభివృద్ధి గురించి పట్టించుకోవటం లేదన్నారు. కాగా ఈ నెల 20వ తేదీ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ సందర్భంగా అధికార పార్టీ నాయకులు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని, వారిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.
తిప్పిరెడ్డి నాగార్జునరెడ్డికి మద్దతు
పశ్చిమ రాయలసీమ పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనంతపురం జిల్లాలోని తాడిపత్రికి చెందిన రాయలసీమ యునైటెడ్ ఫోరం నాయకుడు తిప్పిరెడ్డి నాగార్జునరెడ్డికి తమ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. సీమ వెనుకబాటుతనంపై కౌన్సిల్ సభలో తన గళాన్ని వినిపించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్న వ్యక్తి నాగార్జునరెడ్డి అని వెల్లడించారు. కావున సీమలో ఉన్న నిరుద్యోగులందరూ సీమ వాదాన్ని ఎలుగెత్తి చాటే అభ్యర్థికే తమ ఓటు వేసి సీమ వాదాన్ని గెలిపించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి తిప్పిరెడ్డి నాగార్జునరెడ్డి, వాడాల త్యాగరాజ్, రవికుమార్, వివి.నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
ఆన్‌లైన్ మోసం!
* మొబైల్ బుక్ చేస్తే పూసలు, గాజలు ప్రత్యక్షం
అవుకు, ఫిబ్రవరి 21:ఓ యువకుడు ఆన్‌లైన్ షాపింగ్‌తో మోసపోయిన సంఘటన మంగళవారం అవుకు పట్టణంలో వెలుగులోకి వచ్చింది. వివరాలు.. పట్టణానికి చెందిన వెంకటరమణకు ఈ నెల 13వ తేదీ ఓ మహిళ ఫోన్ చేసి తిరుపతిలో కొత్తగా సెల్ పాయింట్ షోరూం ప్రారంభమవుతోందని, ఈ సందర్భంగా మీ సెల్‌ఫోన్ నెంబర్ ఎంపికైందని మీకు రూ. 20 వేల విలువ గల సెల్‌ఫోన్ బహుమతిగా లభించిందని తెలిపారు. అయితే ఈ బహుమతి పంపాలంటే మీరు రూ. 3500 చెల్లించాల్సి ఉందని పేర్కొనగా సరే అన్నాడు. ఆ మేరకు మంగళవారం పోస్ట్ఫాసుకు పార్శిల్ రావడంతో రూ. 3,500 చెల్లించి తీసుకున్నాడు. తీరా దానిని తెరిచి చూడగా అందులో పూసలతో చేయబడిన 2 గాజులు, 2 దండలు దర్శనం ఇవ్వడంతో వెంకటరమణ ఖంగుతిన్నాడు.
పక్కాగా ‘ఆరోగ్యరక్ష’ అమలు
* పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు..
* సిఎస్ సత్యప్రకాష్ ఠక్కర్
కర్నూలుటౌన్, ఫిబ్రవరి 21:రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ‘ఆరోగ్యరక్ష’ పథకాన్ని పక్కాగా అమలుచేసేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాష్ ఠక్కర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. విజయవాడలోని ఏపిసిఎస్ సమావేశ మందిరం నుంచి మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా పరీక్ష కేంద్రాల్లో వౌలిక వసతులు, తాగునీటి సౌకర్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మాల్ ప్రాక్టీసు జరగకుండా జాగత్రలు తీసుకోవాలన్నారు. దినపత్రికల్లో వచ్చే వార్తలపై వేగంగా స్పందించాలన్నారు. ఆర్‌ఐఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేయాలని, ఈ మెయిల్ ఐడిని రూపొందించి అందరికీ కమ్యునికేట్ అయ్యేలా చూడాలన్నారు. ఇక ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆరోగ్యరక్ష పథకాన్ని ప్రారంభించనున్న సందర్భంగా అన్ని మండలాల్లో వంద శాతం అవగాహన కల్పించాలన్నారు. నెలకు రూ. 100 చొప్పున రూ. 1200 బీమా ప్రీమి యం చెల్లించాల్సి వుంటుందని, ఈ పథకం కింద ఇన్సూరెన్స్ వర్తిసుందన్నారు. ఈ పథకాన్ని మీసేవ కేంద్రాల్లో నమోదు చేసుకోవచ్చన్నారు. ఇక ప్రజా సాధికార సర్వేలో నమోదు కాని వారు కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రజా సాధికార సర్వేలో నమోదుకాని కుటుంబ సభ్యులు ఎవరైనా వుంటే వారి వివరాలు సేకరించి నమోదు చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ విజయమోహన్, ఎస్పీ ఆకే రవికృష్ణ, జెసిలు హరికిరణ్, రామస్వామి, డిఎంహెచ్‌ఓ మీనాక్షిమహదేవన్, ఆర్‌ఐఓ పరమేశ్వరరెడ్డి, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
కప్పట్రాళ్ల సర్పంచ్ దివాకర్‌నాయుడు తొలగింపు
దేవనకొండ, ఫిబ్రవరి 21: మండల పరిధిలోని కప్పట్రాళ్ళ గ్రామ సర్పంచ్‌గా ఉన్న దివాకర్‌నాయుడును పదవి నుంచి తొలగించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. గతంలో కప్పట్రాళ్ళ గ్రామానికి చెందిన వెంకటప్పనాయుడు హత్య కేసులో నిందితుడుగా ఉన్న దివాకర్‌నాయుడుకు 2015 జనవరి 12న న్యాయస్తానం యావజీవ కారగార శిక్ష విధించడంతో పిఆర్ యాక్టు 1994 ప్రకారం ఆయనను పదవి నుంచి తొలగించినట్లు తెలిపారు. ఎన్నికలు నిర్వహించేంత వరకు ఉప సర్పంచ్ రాముడు సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తారని వారు తెలిపారు. అలాగే మండల పరిధిలోని ఐరన్‌బండ, బిసెంటర్, చెల్లెల చెలిమిల గ్రామల సర్పంచ్‌ను కూడా వివిధ కారాణాల మృతి చెందారు. ప్రస్తుతం ఆయా గ్రామాల సర్పంచుల స్థానాలు కూడా ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు.
శివభక్తుల సేవలో
బేడబుడగ జంగం సంఘం
* 9 ఏళ్లుగా శ్రీశైలంలో అన్నదానం
నందికొట్కూరు, ఫిబ్రవరి 21:మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శైవక్షేత్రమైన శ్రీశైలానికి వచ్చే భక్తులకు తమవంతు సాయంగా నందికొట్కూరు బేడ బుడగ జంగం సంఘం సభ్యులు ప్రతి ఏటా అన్నదానం చేస్తారు. ఇందులో భాగంగా మంగళవారం ఆ సంఘం సభ్యులు నందికొట్కూరు నుంచి లారీలో భోజన సామగ్రితో బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా సంఘం తాలూకా అధ్యక్షుడు సిరిగిరి గోవిందు, ఉపాధ్యక్షుడు ఎలమర్తి మధు మాట్లాడుతూ 2008 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీశైలంలో అన్నదానం చేస్తున్నామన్నారు. అన్నదాన కార్యక్రమానికి బేడ బుడగ జంగం కులస్థులంతా ఆర్థికంగా సహకరించడమేగాక, కుటుంబ సమేతంగా వచ్చి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో అన్నదాన కమిటీ సభ్యులు శిరువాటి లక్ష్మయ్య, మురళి, వెంకటేశ్వర్లు, శేఖర్, పుల్లయ్య, గోపాల్, అలేఖం, వెంకటరమణ, లక్ష్మన్న, స్వామన్న పాల్గొన్నారు.
మహానందిలో నేటి నుంచి
శివరాత్రి బ్రహ్మోత్సవాలు
మహానంది, ఫిబ్రవరి 21: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో బుధవారం నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల ప్రారంభ సూచికలో భాగంగా పూజలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం గణపతి పూజలతో ప్రారంభమై సాయంత్రం ధ్వజారోహనతో ఉత్సవాలను ప్రారంభిస్తారు. ఈసందర్బంగా శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి వార్లు మయూర వాహనంపై విహరించనున్నారు. ప్రతి రోజు ఒక ఉత్సవంతో ఐదు రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం పలు ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంత్రం సమయంలో అంకురారోపణలు, అగ్ని ప్రతిస్థాపనలు, భేరి పూజలు నిర్వహిస్తారు. 23 గురువారం స్వామి వార్లు ఉదయం సూర్యప్రభ వాహనంపై రాత్రి వ్యాఘ్ర వాహనంపై, 24 శుక్రవారం ఉదయం గజవాహన సేవ, రాత్రి వృషభ వాహన సేవతో జాగారణ పూజలు నిర్వహిస్తారు. అర్థరాత్రి సమయంలో లింగోద్భవ కాల మహారుద్రాభిషేకం, తెల్లవారితే శనివారం అనగా 2 గంటల సమయంలో శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి వార్ల శాంతి కళ్యాణ మహోత్సవం, 25 ఉదయం మయూర వాహన సేవ, రాత్రి సింహ వాహన సేవ నిర్వహిస్తారు. 26 ఆదివారం ఉదయం అశ్వవాహన సేవ, అనంతరం రథాంగ పూజలు, సాయంత్రం 3 గంటల సమయంలో స్వామి వార్ల రథోత్సవ కార్యక్రమం, రాత్రి పుష్ప శయనోత్సవం నిర్వహిస్తారు. 27 సోమవారం బ్రహ్మోత్సవ త్రిశూల స్నానం, వసంతోత్సవం, ఉత్సవాలకు మహాపూర్ణాహుతితో ఉత్సవాలను ముగిస్తారు. అదేరోజు రాత్రి స్వామి వార్లకు విహార యాత్రగా తెప్పోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు భక్తులు వేలాదిగా తరలి రావాలని ఇఓ డా. శంకర వర ప్రసాద్, చైర్మన్ పాణ్యం ప్రసాదరావులు తెలిపారు.
ఎమ్మెల్యేల హక్కులు కాలరాస్తున్న సిఎం
* ఎమ్మెల్యే సాయి
ఆదోని, ఫిబ్రవరి 21: విపక్ష ఎమ్మెల్యేల హక్కులను సిఎం చంద్రబాబు కాలరాస్తున్నారని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైకాపా ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మద్దతుగా స్థానిక బాబాగార్డన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన పట్ట్భద్రుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ఎన్నుకున్న విపక్ష ఎమ్మెల్యేలకు ఉన్న హక్కులను ముఖ్యమంత్రి పక్కన పెట్టి జన్మభూమి కమిటీల ద్వారా ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నారన్నారు. స్వయంగా తాను సిఎంని కలిసి ఆదోనిలో ఉన్న సమస్యలను వివరించానన్నారు. ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, డాక్టర్లను నియమించాలని, ఆదో ని మున్సిపాలిటీలో ఉన్న ఖాళీలను భర్తీ చేసి ఇంజినీర్లను నియమించాలని కోరగా తాము తమ పార్టీ నాయకుల ద్వారానే అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారన్నారు. ఈ విధంగా సిఎం చంద్రబాబు రాష్ట్రం లో అప్రజాస్వామ్య పాలన చేస్తున్నారని చెప్పారు. ప్రత్యేక హోదా కావాలంటే ఖచ్చితం గా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అప్పుడే చంద్రబాబుకు బుద్ధి చెప్పినట్లు అవుతుందన్నారు. నోటుకు ఓటు కేసులో ఇరుకున్న చంద్రబాబునాయుడు ఎలాగైన ఆ కేసు నుండి బయట పడటానికి ప్రధాన మంత్రి మోదీకి తలవంచి పని చేస్తున్నారని, ఆయన చేతిలో చంద్రబాబు కీలుబొమ్మగా మారిపోయారన్నారు. వైకాపా నాయకులు, కార్యకర్తలు ఎన్నికల్లో తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించడానికి అందరు కృషి చేయాలని కోరారు. చంద్రబాబునాయుడు కేవలం అబద్దాలతో పాలన చేస్తున్నారని రోజుకో మాట మార్చు తూ ప్రజలను మోసం చేస్తున్నారని స్పష్టం చేశారు.
ఉపాధ్యాయుల సమస్యల
పరిష్కారమే లక్ష్యం
* ఎమ్మెల్సీ శ్రీనివాసులనాయుడు
ఆదోనిటౌన్, ఫిబ్రవరి 21: ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పిఆర్‌టియు తరపున పోరాటం చేస్తున్నామని ఇప్పటికే అనేక సమస్యలను పరిష్కరించామని పిఆర్‌టియు ఫ్రంట్‌ప్లోర్ లీడర్, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ శ్రీనివాసుల నాయుడు అన్నారు. మంగళవారం నేషనల్ ఇంగ్లీష్‌మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి బచ్చల పుల్లయ్యలను గెలిపించాలని కోరుతూ ఎమ్మిగనూరు, ఆదోని నియోజకవర్గాల్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలోను, ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలలు, నవోదయ పాఠశాలలో ప్రచారం చేసినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని సిపిఎస్ విధానం రద్దుకు పోరాడుతామన్నారు. అధికారంలో ఉన్న టిడిపి, బిజెపిలతో మంచి సంబంధాలు కొనసాగించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఆర్‌టియు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అప్పరావు, జిల్లా అధ్యక్షులు కరుణానిధి, ప్రధాన కార్యదర్శి భార్గవ రామయ్య, రాఘవాచారి, నాయకులు నాగరాజురెడ్డి, బుగ్గన్న, నాగేంద్రకుమార్, ఉమాశంకర్, రవిప్రకాష్‌రెడ్డి, ఇస్మాయిల్,చెన్నప్ప, చంద్రశేఖర్, కేశవయ్య, వెంకటేష్, కమల, తదితరులు పాల్గొన్నారు.
జగన్‌కు జైలు ఖాయం
పెద్దకడబూరు, ఫిబ్రవరి 21: అక్రమ ఆస్తుల కేసులో ప్రతి పక్ష నేత వై ఎస్ జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి నరవ రమాకాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం పెద్దకడబూరులో మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మండల పరిధిలోని కంబళదినె్న, జాలవాడి, కంబదహాల్, హెచ్.మురవణి, హనుమాపురం, చిన్నతుంబళం, తదితర గ్రామాలకు టిడిపి అధ్యక్షులను ఎన్నుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రతిపక్ష నేత వేల కోట్ల అక్రమ ఆస్తులను సిబిఐ గుర్తించిందని, ఇందులో మొదటి నిందితుడైన జగన్‌కు జైలు శిక్ష పడుతుందన్నారు. మంత్రాలయం నియోజకవర్గంలో టిడిపి జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గ్రామ కమిటీలు పార్టీ పూర్వవైభవాన్ని తీసుకురావడానికి సైనికుల్లా పని చేయాలని పిలుపు నిచ్చారు. ఈకార్యక్రమంలో టిడిపి నాయకులు బసలదొడ్డి ఈరన్న, మల్లికార్జున, మధుసూదన్‌రెడ్డి, ఏసేపు, విజయక్‌కుమార్, సంజీవయ్య, నర్సన్న, హనుమన్న, రాజు, మహబూబ్‌బాషా, కార్యకర్తలు పాల్గొన్నారు.
విప్లవవీరుడు ఉయ్యాలవాడ
నరసింహారెడ్డి: నేడు వర్ధంతి
ఉయ్యాలవాడ, ఫిబ్రవరి 21: భారతదేశంలో తెల్లదొరల నిరంకుశత్వ పాలనపై మొట్టమొదటి సారిగా తిరుగుబాటు బావుటా ఎగరవేసి వారి గుండెల్లో సింహస్వప్నమై, వారికి కంటి మీద కునుకు లేకుండా చేశాడు మన రేనాటిగడ్డ సూర్యుడు, విప్లవవీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. హైదరాబాద్ నవాబులు రాయలసీమ జిల్లాలైన కర్నూలు, కడప, అనంతపురం, బళ్లారిని దత్త మండలాలుగా ప్రకటించి బ్రిటీష్ వారికి ధారాదత్తం చేశారు. నొస్సం ప్రధాన కేంద్రంగా బ్రిటీష్ పాలనలో ఈ ప్రాంతం కొనసాగింది. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన సీతమ్మ, పెద్ద మల్లారెడ్డి దంపతుల కుమారుడు నరసింహారెడ్డి. నరసింహారెడ్డి తాత జయరామిరెడ్డికి పన్నులు, భూమి శిస్తు వసూళ్లు చేసే అధికారం బ్రిటీష్ వారు అప్పగించారు. ఆయన మరణాంతరం వారసత్వంగా ఈ బాధ్యత నరసింహారెడ్డికి వచ్చింది. బ్రిటీష్ వారి నిరంకుశత్వ పాలనను కళ్లారా చూసిన నరసింహారెడ్డి మొదటిసారిగా 1842వ సంవత్సరంలో తెల్లదొరలపై తిరుగుబాటు చేశారు. ఆయన దెబ్బకు గజగజ వణికిపోయిన ప్రభుత్వం నరసింహారెడ్డిని పట్టి ఇచ్చిన వారికి 10 వేల దీనారాలు బహుమతిగా ప్రకటించారు. ఎట్టకేలకు 1847వ సంవత్సరంలో సంజామల మండలం జగన్నాథగుట్టపై నరసింహారెడ్డిని ప్రాణాలతో పట్టుకుని బందిపోటు దొంగగా ముద్ర వేశారు. అదే సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీ కోవెలకుంట్ల సమీపంలోని జుర్రేరు ఒడ్డున బ్రిటీష్ ప్రభుత్వం ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఉరి తీసింది. నాటి నుండి భారతీయులు నరసింహారెడ్డిని రేనాటి సూర్యుడిగా పిలుచుకుంటూ వస్తున్నారు. ఇప్పటికీ సీమలోని రైల్వేస్టేషన్లు, ఆర్‌టిసి బస్టాండ్‌లలో ఆయన పేర సైరా నరసింహారెడ్డి నీపేరే బంగారు కడ్డీ అంటూ జాయపద గేయాలు వినిపిస్తుంటాయి.
సీమలో ప్రదర్శించే నాటికల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నాటిక తప్పక ప్రదర్శిస్తుంటారు. బ్రిటీష్ పాలకులపై తిరుగుబాటు చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో మొక్కుబడిగా నరసింహారెడ్డి జయంతి, వర్ధంతులు నిర్వహించడం మినహా మరెలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. నరసింహారెడ్డి వినియోగించిన ఫిరంగి ఓ పక్కగా పడి ఉంది. ఆయన స్థావరంగా నిలిచిన నొస్సం కోట శిథిలావస్థకు చేరుకుంటోంది. ఫిరంగి, నొస్సం కోటను చారిత్రక ఆస్తులుగా ప్రకటించి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అదే విధంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరోచిత గాథలను పాఠ్యాంశాల్లో చేర్చి ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
శ్రీశైలంలో కంట్రోలు రూం,
సిసి కెమెరాల ఏర్పాటు
శ్రీశైలం, ఫిబ్రవరి 21: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సెంట్రల్ కంట్రోలు రూంను దేవస్థానం ఇఓ నారాయణ భరత్‌గుప్త మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఈ కంట్రోలు రూంలో దేవస్థానం పరిధిలో ఉన్న అన్ని సిసి కెమెరాలు కంట్రోలు రూంకు అనుసంధానించబడి సిసి కెమెరాల ప్రాంతాలలో భక్తులకు కలుగుతున్న ఇబ్బందులను, వసతులను, భక్తులు రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు ఈ కంట్రోలు రూం నుంచి అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తారు. అదే విధంగా ఏవైనా అవాంఛనీయ సంఘటనలు గాని, లడ్డూప్రసాదాల కొరత గాని సిసి కెమెరాల ద్వారా గమనించి అధికారులతో సమాచారం ఇచ్చి అధికారుల సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని ఇఓ తెలిపారు.
శ్రీశైలంలో అలరిస్తున్న నృత్యాలు: శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వారు భ్రామరీ కళామందిరంలో, శివదీక్ష శిబిరాల వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా సాయంత్రం 6.30 నుంచి శ్రీభ్రామరీ కళామందిరంలో అనంతపురంకు చెందిన సాయి నృత్యాలయం వారిచే కూచిపూడి నృత్యం, 7.30 నుంచి హైదరాబాద్‌కు చెందిన శ్రీమల్లికార్జున గోపిక పూర్ణిమ వారిచే భక్తి సంగీతం, శివదీక్ష శిబిరాలలో సాయంత్రం 4గంటల నుంచి వెలుగోడుకు చెందిన యల్లాసుబ్బయ్యచే భజన, 6గంటల నుంచి విజయవాడకు చెందిన బుర్రపద్మనాభంచే హరికథ, 7గంటల నుంచి వనపర్తికి చెందిన సత్యంచే భక్తిరంజని, 8గంటల నుంచి రంగసముద్రంకు చెందిన నరసింహారావుచే తోలుబొమ్మలాట, ఆర్.వేణుగోపాల్ బృందంచే పాతాళభైరవి సురభి నాటకం భక్తులను ఎంతగానో అలరించాయి.

మహానందికి చేరుకున్న స్వామివారు
మహానంది, ఫిబ్రవరి 21: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకై నంద్యాల పట్టణంలోని పార్వతి సమేత బ్రహ్మనందీశ్వర స్వామి వార్లు మహానంది క్షేత్రం చేరుకున్నారు. మహానంది పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం రోజున నిర్వహించే ఉత్సవాలకు, కల్యాణ మహోత్సవానికి పెళ్లి పెద్దగా వ్యవహరించే బ్రహ్మనందీశ్వర స్వామి వార్లను పిలుచుకొని స్వామి వార్లు మహానందికి చేరుకున్నారు. క్షేత్రంలోని అశ్వర్థ నారాయణ చెట్టు వద్ద ఇఓ డా.శంకర వర ప్రసాద్, వేదపండితులు స్వామి వార్లకు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా స్వామి వార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి నందికోల ఉత్సవాన్ని నిర్వహించి ఆలయానికి చేర్చారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు తరలివచ్చారు.
నిరంతరం విద్యుత్ సరఫరా
మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విద్యుత్‌ను నిరంతరం సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఎఇ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మహానంది క్షేత్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 160 కెవి ట్రాన్స్‌ఫార్మర్‌ను ఇఓ డా.శంకర వర ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎఇ మాట్లాడుతూ ఎక్కడా విద్యుత్‌కు అంతరాయం కలుగకుండ అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, ప్రత్యేకించి మహానంది క్షేత్రంలో ఈరోజు ఏర్పాటు చేసిన 160 కెవి ట్రాన్స్‌ఫార్మర్‌ను శాశ్వతంగా ఇక్కడే ఉంచుతున్నట్లు తెలిపారు. దీంతోపాటు అదనంగా మరో 160 కెవి ట్రాన్స్‌ఫార్మర్, 100 కెవి ట్రాన్స్‌ఫార్మర్స్ 2, 16 కెవి ట్రాన్స్‌పార్మర్స్ 4 బిగించి అందుబాటులో మరో ట్రాన్స్‌పార్మర్ ఉంచుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షకులు ఈశ్వర్‌రెడ్డి, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో శ్రీనివాస కల్యాణం
ఆదోని, ఫిబ్రవరి 21: ఆదోనిలోని హథీరామ్‌జీ మఠంలో మంగళవారం సాయంత్రం శ్రీనివాసకల్యాణం ఎంతో భక్తిశ్రద్ధలతో కన్నుల పండుగగా నిర్వహించారు. అంతకు ముందు మఠంలో ఉన్న మూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చి వేదికపై ఉంచి శ్రీనివాసస్వామి, పద్మావతిదేవి ఉత్సవ మూర్తులకు భక్తుల జనసందోహం మధ్య కల్యాణోత్సవం నిర్వహించారు. హాథీరామ్‌జీ భక్త మండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎంపి బుట్టారేణుక, ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రాచోటి రామయ్య, మీనాక్షినాయుడు, మాజీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ విట్టాకిష్టప్ప, తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.
రైతులకు రూ.110 కోట్లు
రుణాల పంపిణీ
హొళగుంద, ఫిబ్రవరి 21: ఆలూరు కెడిసిసి బ్యాంకు, ఆరు సింగ్ విండోల ద్వారా 2016-17 సంవత్సరానికి రైతులకు రూ.110కోట్ల రుణాలను పంపిణీ చేశామని కెడిసిసి బ్యాంకు మేనేజర్ రమేష్ మంగళవారం తెలిపారు. జిల్లా కెడిసిసి చైర్మ