కర్నూల్

సూర్యప్రభ, వాఘ్ర వాహనాలపై విహరించిన మహానందీశ్వరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానంది, ఫిబ్రవరి 23: మహానం ది పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రెండోరోజున గురువారం శ్రీకామేశ్వరీ సమేత మహానందీశ్వర స్వామి వార్లు సూర్యప్రభ వాహనంపై మహానంది పురవీధుల్లో విహరించారు. ప్రత్యేకించి శివరాత్రి పూజల్లో భాగంగా ఉదయం మూలవిరాట్‌లైన శ్రీకామేశ్వరీ సమేత మహానందీశ్వరు స్వామివార్లకు ప్రత్యేక అభిషేకార్చన పూజలు నిర్వహించారు. అనంతరం యాగశాలలో ఇఓ డాక్టర్ శంకర్‌వరప్రసాద్, చైర్మన్ పాణ్యం ప్రసాదరావులచే వేద పండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వరశర్మ, శాంతారాంభట్, జ్వాలా చక్రవర్తిలతో పాటు ప్రత్యేక పండితులు కలిసి కలశ పూజలను, హోమాలను వేద మంత్రాలతో నిర్వహించారు. అనంతరం సూర్యప్రభ వాహనంపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి ప్రత్యేక పూష్పాంలకృతులను చేసి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం అశేష జనవాహని మధ్య మహానంది పురవీధుల్లో ఆలయ ప్రదక్షిణగా గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓ చిన్నారి నందికోలతో నృత్యం చేస్తూ పలువురిని ఆకట్టుకుంది. మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు శ్రీకామేశ్వరీ సమేత మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకున్నారు. అలాగే శివస్వాములు మహానందికి చేరుకుని ఆలయంలోని పుష్కరిణిలలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
శ్రీమహానందీశ్వరుడికి వ్యాఘ్ర వాహన సేవ
బ్రహ్మోత్సవాలలో భాగంగా సాయంత్రం శ్రీకామేశ్వరీ సమేత మహానందీశ్వర స్వామి వార్లు వ్యాఘ్ర వాహనంపై మహానంది పురవీధుల్లో విహరించారు. గురువారం సాయంత్రం స్వామి వార్ల ఉత్సవమూర్తులను వ్యాఘ్ర వాహనంలో కొలువుదీర్చి ప్రత్యేక పుష్పాలంకరణ చేసి ఇఓ డాక్టర్ శంకర వరప్రసాద్, పార్వతీ దంపతులు, చైర్మన్ పాణ్యం ప్రసాదరావులచే వేద పండితుల వేద మంత్రాలతో ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. పల్లకీ వద్ద అష్టమహా మంగళహారతులు ఇచ్చి కుష్మాండ, నారీకేళ బలిచ్చి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. స్వామి వార్ల పల్లకీ ఆలయ పురవీధుల్లో వేలాది మంది భక్తుల మధ్య ఓంకార ప్రణవనాదంతో గ్రామోత్సవం కొనసాగింది. ఈకార్యక్రమంలో పర్యవేక్షకులు పరుశురాం శాస్ర్తీ, కేశవరెడ్డి, ధర్మకర్తలు, అధికారులు పాల్గొన్నారు.