కర్నూల్

మండలి ఎన్నికల్లో ఓటు హక్కు లేని ఆ ముగ్గురు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, ఫిబ్రవరి 23:కెఇ కృష్ణమూర్తి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కానీ శాసనమండలి ఎన్నికల్లో ఓటు వేసే హక్కు మాత్రం లేదు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఎన్నికల్లో ఎంపిలు, ఎమ్మెల్యేలు, జడ్పీటిసిలు, ఎంపిటిసిలు, పురపాలక సంఘాల కౌన్సిలర్లు ఓటర్లుగా ఉండి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎన్నుకుంటారు. ఇందులో కార్పొరేషన్, మున్సిపల్, నగర పంచాయతీల వార్డు కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్యేలు, జడ్పీటిసిలు, ఎంపిటిసిలు ఓటు హక్కు వినియోగించుకుంటారు. జిల్లాలో నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్ మున్సిపాలిటీలు కాగా గూడూరు, నందికొట్కూరు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ నగర పంచాయతీలుగా ఉన్నాయి. ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఉంటారు. దీంతో వారికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది. ఈ విధంగా 8 మంది ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వేసే అర్హత పొందారు. అయితే పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం, బనగానపల్లె, పాణ్యం, కర్నూలు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు ఓటు వేసే అవకాశం లేదు. కెఇ కృష్ణమూర్తి డిప్యూటీ సిఎం హోదాలో ఉన్నా శాసన మండలి ఎన్నికల్లో ఓటు వేసే అర్హత లేకుండా పోయింది. కారణం పత్తికొండ గ్రామ పంచాయతీగా ఉండటమే. కెఇ కృష్ణమూర్తితో పాటు కర్నూలు ఎంపి బుట్టా రేణుకకు కూడా ఓటు వేసే అవకాశం లేదు. ఈమె పార్లమెంట్ పరిధిలో ఉన్నా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్, ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరులో ఎక్కడినుంచైనా ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఉండవచ్చు. కానీ ఈమె కర్నూలు కార్పొరేషన్‌లో ఎక్స్‌అఫిషియో సభ్యులుగా నమోదు చేసుకుంది. అయితే కర్నూలు కార్పొరేషన్‌కు పాలకవర్గం లేనందు వల్ల ఓటు వేసే అవకాశం కోల్పోయింది. ఇక కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి పరిస్థితి కూడా ఎంపి రేణక పరిస్థితే.