కర్నూల్

గజవాహనంపై ఊరేగిన ముక్కంటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, ఫిబ్రవరి 23: శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం గజవాహనంపై మల్లన్న గరళకంఠుడుగా భక్తులకు దర్శనిచారు. 11రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు అర్చక వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం యాగశాలలో చండీశ్వరునికి ప్రత్యేక పూజలు, లోకకల్యాణం కోసం జపాలు నిర్వహించారు. మండపారాధనలు, పంచవర్ణ అర్చనలు, రుద్ర, చండీహోమాలు ఆగమశాస్త్రం ప్రకారం జరిపించి సాయంత్రం ప్రదోషకాల పూజలను, జపానుష్టాలను అర్చక వేద పండితులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లు గజవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకరణ మండపంలో ప్రత్యేకంగా అలంకరింపచేయించి సాయంత్రం 6.30కు అర్చక వేద పండితులు శాస్త్రానుసారంగా స్వామి అమ్మవార్లను అలంకరణ పూజ ల అనంతరం మహామంగళహారతులు ఇచ్చి గ్రామోత్సవానికి తోడ్కొని వచ్చా రు. దేవస్థానం వారు ఏర్పాటు చేసిన కళారూపాలు, కోలాటం, జానపద కళారూపాలు, చెక్క భజనలు, నాదస్వరం, నందికోలసేవ, పుట్టబొమ్మలు, గొరవయ్య నృత్యం, పగటివేషాలు గ్రామోత్సవానికి మరింత శోభనిచ్చాయి. అర్చక వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ ఆలయ పురవీధుల్లో గ్రామోత్సవం ఎంతో వైభవంగా ఆలయ రాజగోపురం వద్ద నుం చి నందిగుడి, బయలువీరభద్రస్వామి గుడి వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, శివస్వాములు స్వా మి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు బ్రహ్మరథం పట్టారు. విద్యుత్ దీపపుకాంతుల నడుమ కన్నుల పండుగగా ఈ ఉత్సవం ముందుకు సాగింది. కార్యక్రమంలో ఇఓ నారాయణ భరత్‌గుప్త, ఎసి మహేశ్వరరెడ్డి, ఎఇఓలు, అర్చకులు, వేద పండితులు అధిక సంఖ్యలో శివస్వాములు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
తాగునీటి సమస్య రానివ్వం..
* ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి
కర్నూలుసిటీ, ఫిబ్రవరి 23:నగర ప్రజలు తాగునీటి సమస్యను ఎదుర్కోకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే ఎస్వీ గురువారం సుంకేసుల రిజర్వాయర్, సమ్మర్ స్టోరేజి ట్యాంక్, జి.శింగవరం గ్రామంలోని దేవమ్మచెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పాడ్డాయని దీంతో తుంగభద్ర నదిలో కూడా నీళ్లు సక్రమంగా లేవన్నారు. తుంగభద్రలో నీళ్లు ఉంటే అక్కడి నుంచి సుంకేసులకు తరలించి పైపులైన్ ద్వారా సమ్మర్ స్టోరేజి ట్యాంక్‌కు చేర్చి అక్కడ ఫిల్టరైజేషన్ చేసి నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు విడుదల చేసేవారన్నారు. గత ఏడాది జి.శింగవరం గ్రామంలోని దేవమ్మచెరువులో కొంత మేరకు నీరు నిల్వ ఉండగా వాటిని పైపులైన్ ద్వారా కెసి కాల్వ నుంచి సమ్మర్ స్టోరేజీ ట్యాంకులోకి చేర్చి అక్కడి నుంచి నగర ప్రజలకు సరఫరా చేస్తామన్నారు. ప్రస్తుతం సుంకేసుల రిజర్వాయర్‌లో ఉన్న నీరు నెల రోజులకు సరిపోతుందన్నారు. జూన్ వరకూ నీటి సమస్య రాకుండా ఉండేందుకు పందికోన రిజర్వాయర్ నుంచి గాజులదినె్న ప్రాజెక్టుకు తరలించి అక్కడి నుంచి సమ్మర్ స్టోరేజీ ట్యాంకుకు పైపులైన్ ద్వారా చేర్చి నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు నీరు విడుదల చేస్తామన్నారు. ఎమ్మెల్యే వెంట నగర పాలక సంస్థ డిఇ రమణమూర్తి ఉన్నారు.