కర్నూల్

మల్లన్నకు కాణిపాకం దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, ఫిబ్రవరి 23: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నేడు స్వామి అమ్మవార్లకు కల్యాణోత్సవం నిర్వహిస్తున్నారు. అందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం తరపున, తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. గురువారం శ్రీకాణిపాక వరసిద్ది వినాయక దేవస్థానం తరపు నుంచి కూడా స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవానికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈవస్త్రాల సమర్పణ కార్యక్రమంలో కాణిపాకం ఇఓ పూర్ణచంద్రరావు స్వామి అమ్మవార్లను పట్టువస్త్రాలను అందించారు. వీరికి సాంప్రదాయబద్ధంగా శ్రీశైలం దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. తరువాత దేవస్థానం వైదిక సిబ్బంది మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి పట్టువస్త్రాల సమర్పించారు. ఈకార్యక్రమంలో కాణిపాకం దేవస్థానం ఇఓ పూర్ణచంద్రరావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కాణిపాకం ఇఓను దేవస్థానం ఇ ఓ సత్కరించి స్వామి అమ్మవార్ల జ్ఞాపికను అందించారు.
మహానందీశ్వరునికి..
మహానంది : మహానంది పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకామేశ్వరీ సమేత మహానందీశ్వరు స్వామి వార్ల కల్యాణోత్సవానికి కాణిపాకం దేవస్థానం నుంచి కల్యాణ పట్టువస్త్రాలను కాణిపాకం దేవస్థానం ఇఓ పూర్ణచంద్రరావు సమర్పించారు. గురువారం కాణిపాకం ఇఓ పట్టువస్త్రాలను తీసుకుని మహానంది క్షేత్రం చేరుకోగా ఆయనకు ఆలయ మర్యాదలతో మహానంది ఆలయ ఇఓ డాక్టర్ శంకరవరప్రసాద్, చైర్మన్ పాణ్యం ప్రసాదలతో పాటు వేద పండితులు రవిశంకర్ అవధాని స్వాగతం పలికారు. అనంతరం వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా ఇఓ పట్టువస్త్రాలు అందించారు.
మల్లన్న సేవలో జగద్గురువు
శ్రీశైలం, ఫిబ్రవరి 23: శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలం జగద్గురువు, పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చెన్నసిద్ధరామ శివాచార్య మహాస్వామి గురువారం స్వామి అమ్మవార్లను దర్శించుకుని సేవించుకున్నారు. వీరికి ఆలయ రాజగోపురం వద్ద ఆలయ అధికారులు, అర్చక వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. పీఠాధిపతి గౌరవార్థం అమ్మవారి ఆశీర్వచన మండపంలో అర్చక వేద పండితులు వేద గోష్టి నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ప్రసాదాలు, పట్టువస్త్రాలను ఇచ్చి పీఠాధిపతిని అధికారులు సత్కరించారు.
మహా శివరాత్రికి మహా దర్శనం
* లింగోద్భవ పూజకు సిద్ధమైన సప్తనది సంగమేశ్వరం
పాములపాడు, ఫిబ్రవరి 23:మహాశివరాత్రి లింగోద్భవ పూజలు పతాక స్థాయికి చేరుకోనున్న క్రమంలో 199 రోజుల పాటు కృష్ణమ్మ నదీమ గర్భంలో ఉన్న సప్తనది సంగమేశ్వర క్షేత్రం బయటపడి భక్తులకు మహాదర్శన భాగ్యం కల్పించనుంది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వలు అడుగంటడంతో ఈ ఆలయం మహా శివరాత్రికి ముస్తాబైంది. నిర్వాహకులు భక్తులకు అవసరమైన అన్ని వసతులు పూర్తి చేశారు. గత 13 ఏళ్లలో శివరాత్రికి సంగమేశ్వరుడు జలాల నుంచి బయట పడటం ఇప్పటికి 7వ సారి కావటం విశేషం. దేశంలో 7 నదులు ఒకే చోట సంగమించే అరుదైన ఏకైక స్థలం సప్తనది సంగమేశ్వర క్షేత్రం. కృష్ణానదీ తీరం కర్నూలు జిల్లా ఆత్మకూరు నల్లమల పాదాల చెంత ప్రవహించే తీర్థంలో ఉన్న ఆలయంలో ద్వాపర యుగంలో ధర్మరాజు ప్రతిష్ఠించిన వేపధారు శివ లింగం కలిగిన గర్భాలయం ప్రత్యేకత. 8 మాసాలు కృష్ణా నదీ గర్భంలో ఉండి 4 మాసాలు మాత్రమే భక్తుల పూజలకు నోచుకునే భాగ్యాన్ని శ్రీశైల స్కంధ పురాణంలో స్పష్టంగా చెప్పబడింది. ఈ ఇతిహస నేపథ్యంలోనే 2016 కృష్ణా పుష్కరాలకు ముందు వరదలకు సంగమేశ్వర ఆలయం మునిగి 199 రోజులు(6 నెలల) తర్వాత మహా శివరాత్రికి బయటపడి పూజలకు సిద్ధమైంది. పుష్కరాల సమయంలో ఆలయ దర్శనం చేసుకోలేకపోయిన వేలాది మంది భక్తులు ఈ మహా శివరాత్రికి గర్భాలయం అందుబాటులోకి రావడంతో నిర్వాహకులు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లింగోద్భవ కాలానికి స్వామి వారి దర్శనం తదుపరి ఉదయం ఆది దంపతులకు కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.