కర్నూల్

మల్లన్నకు నందివాహన సేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, ఫిబ్రవరి 24 : మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని శ్రీశైలంలో శుక్రవారం స్వామి అమ్మవార్లు నందివాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అక్కమహాదేవి అలంకరణ మండపంలో అలంకరణ పూజలను అర్చక వేద పండితులు సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. అనంతరం మహామంగళ హారతులు ఇచ్చి స్వామి అమ్మవార్లను నందివాహనంపై ఆశీనులు చేసి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవంలో దేవస్థానం వారు ఏర్పాటు చేసిన పగటివేషాలు, డప్పు చప్పుళ్లు, మేళతాళాలతో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రదక్షిణ గావించారు. శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివదీక్ష శిబిరాల వద్ద, భ్రామరీ కళామందిరం దేవస్థానం వారు సాంస్కృతి క కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భ్రామరీ కళామందిరంలో సాయంత్రం 6.గంటల నుంచి కర్నూలుకు చెందిన పార్వతీచే భజన సం గీతం, 7గంటల నుంచి తెనాలి వారిచే భక్తిరంజని, 8.30ల నుంచి హైదరాబాద్‌కు చెందిన రాధికా సంగీ త నృత్య అకాడమిచే కూచిపూడి నృత్యం, శివదీక్ష శిబిరాలలో 6.30 నుంచి తెనాలికి చెందిన వరలక్ష్మీ కల్యాణి భక్తిరంజని, 7.30 నుంచి హైదరాబాద్‌కు చెందిన షైనీ నృత్యాలయం వారిచే కూచిపూడి నృత్యం, 8.30ల నుంచి కర్నూలుకు చెందిన లక్ష్మీమహేశ్ వారిచే హరికథ, 9.30ల నుంచి కర్నూలుకు చెందిన కళావాహిని సాంస్కృతిక సాహితీ సమితి కినె్నర ఆర్ట్స్‌వారిచే కాళహస్తీశ్వర మహాత్యం, శివభక్తి శిరియాలు కార్యక్రమాలు అలరించాయి.
మహానందిలో వైభవంగా
మహాశివరాత్రి వేడుకలు
* గజవాహనంపై విహరించిన పార్వతీపరమేశ్వరులు
మహానంది, ఫిబ్రవరి 24: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో మహాశివరాత్రి వేడుకలు వైభంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శ్రీకామేశ్వరీ సమేత మహానందీశ్వర స్వామివార్లు గజవాహనంపై విహరించారు. శుక్రవారం ఆలయంలో స్వామి వార్ల ఉత్సవమూర్తులను వాహనంపై కొలువుదీర్చి ప్రత్యేక పుష్పాలంకరణలు చేసి ఇఓ డాక్టర్ శంకర్‌వరప్రసాద్ దంపతులచే, చైర్మన్ పాణ్యం ప్రసాద్ దంపతులచే వేద పండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వరశర్మలతో పాటు వేద పండితులు వేద మంత్రాలతో పూజలు నిర్వహించారు. అనంతరం నారీకేళ బలి ఇచ్చి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. ఓంకార నామస్మరణల మధ్య గ్రామోత్సవం జరిగింది.
స్వామి వార్ల కల్యాణానికి పట్టువస్త్రాలు
మహానంది పుణ్యక్షేత్రంలో నేటి తెల్లవారు జామున జరిగే శ్రీకామేశ్వరీ సమేత మహానందీశ్వరుల స్వామి వార్ల కల్యాణానికి పట్టువస్త్రాలను అధికారులు తీసుకుని వచ్చారు. శుక్రవారం ఇఓ డాక్టర్ శంకర్‌వరప్రసాద్, పార్వతీ దంపతులు స్వామి వార్ల తరపున పట్టువస్త్రాలు తీసుకుని రాగా, నంద్యాల డిఎస్పీ హరినాథరెడ్డి దంపతులు అమ్మవారి తరపున పట్టువస్త్రాలు తీసుకుని వచ్చారు. ఇరువురికి ఆలయ మర్యాదలతో చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, వేద పండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వరశర్మ, శాంతారాంభట్, జ్వాలా చక్రవర్తిలు స్వాగతం పలికారు. అనంతరం మూలవిరాట్‌ల వద్ద పూజాదికాలు నిర్వహించి పండితులకు అందజేశారు. వీరి వెంట ఆలయ పర్యవేక్షకులు ఈశ్వర్‌రెడ్డి, సిఐలు శ్రీనివాసరెడ్డి, గుణశేఖర్‌బాబు, ఎస్‌ఐలు పెద్దయ్యనాయుడు, రమణ, మోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఆలయంలో పూజలు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం మూలవరులైన శ్రీకామేశ్వరీ సహిత శ్రీమహానందీశ్వరుల స్వామి వార్లకు విశేష ద్రవ్య అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం స్వామి వార్ల ఉత్సవమూర్తులకు తిరుమంజనసేవ నిర్వహించారు.
నందివాహనంపై విహరించిన స్వామి అమ్మవార్లు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నందివాహనంపై స్వామి అమ్మవార్లు విహరించారు. శుక్రవారం సాయంత్రం స్వామి వారు నందివాహనంపై కొలువుదీరారు. పల్లకీకి పుష్పాలంకరణ చేసి వేద పండితులు రవిశంకర్ అవధానితో పాటు ప్రత్యేక పండితులు ఇఓ డా.శంకర్ వరప్రసాద్, చైర్మన్ పాణ్యం ప్రసాదరావులచే పూజాదికాలు నిర్వహించి అష్టావిధ మహామంగళహారతులు ఇచ్చి నారీకేళ కూష్మాంబలి ఇచ్చి ప్రారంభించారు. విద్యుత్ వెలుగుల మధ్య అశేష జనాల మధ్య స్వామివారి పల్లకీ ఆలయం పురవీధుల్లో విహరించింది.
మహాద్భుతం లింగోద్భవ దర్శనం
మహానంది పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీమహానందీశ్వర స్వామి వార్ల లింగోద్భవ దర్శనం మహాద్భుతంగా జరిగింది. శుక్రవారం రాత్రి 10గంటలకు ప్రారంభమైన పూజలు 1.30ల వరకు కొనసాగాయి. ఇఓ, చైర్మన్‌తోపాటు డిఎస్పీ హరినాథరెడ్డి, జడ్జిలచే సంకల్ప పూజలు నిర్వహించిన అనంతరం మూలవిరాట్‌లకు వేద పండితుల వేద మంత్రాలతో గణపతిపూజ, పుణ్యాహవచనం, విశేష ద్రవ్యాలతో మహాన్యాస ఏకవార రుద్రాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివార్ల దర్శనం కల్పించారు. తెల్లవారుజామున 2గంటల సమయంలో స్వామివార్ల కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
తాగునీరు సురక్షితమేనా!
* క్లోరినేషన్ చేయకుండానే గ్రామాలకు సరఫరా
కర్నూలు సిటీ, ఫిబ్రవరి 24:జిల్లా అధికారులు గ్రామీణ ప్రాంతాలకు సరఫరా చేస్తున్న నీరు ఏ మేరకు సురక్షితమనే సందేహాలు తలెత్తుతున్నాయి. క్లోరినేషన్ చేయకుండానే గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో నీటిలో లవనీయత శాతం పెరిగే అవకాశం ఉంది. గ్రామీణ ప్రజలు గత్యంతరం లేక ట్యాంకర్ల ద్వారా తరలిస్తున్న నీటినే తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. జిల్లాలో 889 గ్రామ పంచాయతీలు, 1500కు పైగా గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు 56 సమగ్ర రక్షిత నీటి పథకాలతో పాటు దాదాపు 15వేలకు పైగా చేతి పంపులు ఉన్నాయి. కానీ అందులో సగానికి పైగా పని చేయటం లేదని అధికారులకు తెలిపినా పట్టించుకోవటం లేదు. చాలా గ్రామాల్లో రోజు విడిచి రోజు నీరు విడుదల చేస్తున్నారు. వాటిని కూడా వేళ పాలా లేకుండా ఏ అర్ధరాత్రో విడుదల చేస్తున్నారు. దీంతో నీటి కోసం రాత్రంగా జాగరణ చేసినా కనీసం గంట సేపు కూడా నీరు సరఫరా చేయటం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేక చోట్ల రక్షిత నీటి పథకాల్లో ఫిల్టర్ బెడ్లు సక్రమంగా పని చేయకపోవడం వల్ల నీళ్లు దుర్వాసన వస్తున్నాయని ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు శుద్ధ జలాలు అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆర్‌ఓ ప్లాంట్లు సైతం ఎక్కడా పని చేయడం లేదు. అయితే అధికారులు మాత్రం ఆర్‌ఓ ప్లాంట్లు పనిచేస్తున్నాయని గొప్పలు చెబుతున్నారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. అనేక గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. గత కొనే్నళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనటంతో భూగర్భ జలాలు ఈడుగంటిపోవడంతో లవనీయత శాతం పెరుగుతుందని అధికారులే చెబుతున్నారు తప్ప నీటి పరీక్షలు చేయటంలో అలసత్వాన్ని మాత్రం వీడటం లేదు. సాధారణంగా నీరు అడుగంటే కొద్దీ జలంలో నైట్రేట్, సీసం, ఆర్సెనిక్, కాస్మోడియం ఏర్పడే అవకాశం ఉంది. కావున ట్యాంకర్ల నీటిని సేకరించి నీటి పరీక్షలు చేయాలి. ఆ తర్వాత పరీక్షల్లో వచ్చిన నీటి లవనీయతను బట్టి ఆ నీరు ప్రజలు తాగటానికి పనికి వస్తుందా లేదా ఇతర అవసరాలకు
వినియోగించుకోవాలన్న విషయాన్ని అధికారులు చెప్పాలి. అయితే గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యం అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవటం లేదన్న అరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
నీటి సమస్య తలెత్తనీయం..:ఇఇ వెంకటరమణ
జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం రూ. 10 కోట్లు మంజూరు చేసింది. గ్రామీణ ప్రాంత ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం. జిల్లాలోని అన్ని రక్షిత నీటి పథకాలు సక్రమంగా పని చేసేలా చర్యలు చేపడుతాం. కొన్ని ప్రాంతాల్లో సమస్యలు ఉన్నా వెంటనే సరి చేస్తాం. ఒక్క కర్నూలు డివిజన్‌లోనే దాదాపు 104 ఆర్‌ఓ ప్లాంట్లు ఉండగా అందులో 4 ప్లాంట్లు మాత్రమే పని చేయటం లేదు. అలాగే ఫిల్టర్‌బెడ్లు మార్చి నీరు దర్వాసన రాకుండా చర్యలు చేపడుతాం. చేతిపంపుల నిర్వహణపై సర్వే చేపట్టి నివేదిక ఆధారంగా పని చేయని చేతి పంపులకు మరమ్మతులు చేయిస్తాం.
ఉనికి కోసమే ముద్రగడ పోరాటం
* కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రామచంద్రరావు
నంద్యాల, ఫిబ్రవరి 24: కాపు ఉద్యమాన్ని బలోపేతం చేస్తానని తన ఉనికిని కాపాడుకోవడానికి, మనుగడ కోసం ముద్రగడ పద్మనాభం పోరాడుతున్నారే తప్ప వారిని ఉద్దరించేందుకు కాదని కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వెదుర్ల రామచంద్రరావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని తన స్వగృహంలో స్థానిక బలిజ సంఘం నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం 2014 సార్వత్రిక ఎన్నికల్లో మ్యానిఫెస్టోలో కాపు, బలిజలకు బిసి రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే మంజునాథ కమిషన్‌ను ఏర్పాటు చేయడంతోపాటు కాపు, బలిజలను ఆర్థికంగా ఎదిగేందుకు కాపు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించిన విషయాన్ని కాపు, బలిజలు మరువరాదన్నారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన అనంతరం ఒక్క కర్నూలు జిల్లా నుండే 12 మంది విదేశీ విద్యకు ఒక్కొక్కరు రూ.10 లక్షలు లబ్దిపొంది వెళ్లారని, మరో 20 మంది సివిల్స్ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్నారని, అదేవిధంగా ఆర్థికంగా ఎదిగేందుకు కాపు కార్పొరేషన్ ద్వారా మహిళలకు, పురుషులకు రుణాలు అందజేస్తున్నారని, దీనికి తోడు పరిశ్రమలు ఏర్పాటు చేసే యువతకు ఆర్థిక సహాయం చేస్తున్న విషయాన్ని మరువరాదన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 2014 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం మాట్లాడుతూ కాపు, బలిజల సహకారంతోనే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందని చెప్పడాన్ని మనందరం గుర్తుంచుకోవాలన్నారు. అధికారం చేపట్టిన అనంతరం కాపు, బలిజలను మంత్రివర్గంలోకి తీసుకోవడంతోపాటు టిటిడి పాలక మండలి ఏర్పాటులో కాపులకు ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని విస్మరించరాదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కాపు, బలిజలను బిసిలుగా రిజర్వేషన్ కల్పించేందుకు మంజునాధ కమిషన్‌ను ఏర్పాటు చేశారని, ఈ కమిషన్ ఇప్పటికే పది జిల్లాలో పర్యటించిందని అన్నారు. మరో మూడు జిల్లాల్లో మంజునాధ కమిషన్ పర్యటించి విచారణ నిర్వహించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుందని తెలిపారు. ఈనివేదికను ఆధారంగా చేసుకొని ఇటు శాసన సభలో, అటు పార్లమెంటులో కాపు, బలిజలకు బిసిల్లో చేర్చేందుకు చట్టబద్దత కల్పించాల్సిన బాద్యత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఉందన్నారు. ఇలాంటి సమయంలో కాపు, బలిజ వర్గీయులందరు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బాసటగా నిలిచి తమ డిమాండ్లను సాధించుకొనేందుకు కృషి చేయాలే తప్ప ఉద్యమ బాట చేపట్టాల్సిన అవసరం లేదన్నారు. ఒక వైపు ప్రభుత్వం కాపు, బలిజలకు రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు మంజునాధ కమిషన్‌ను ఏర్పాటు చేయడం, ఆర్థికంగా ఆదుకొనేందుకు కాపు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినప్పటికి ఒక రాజకీయ పార్టీ ప్రోద్బలంతో ముద్రగడ పద్మనాభం ఈ మద్య తరచుగా ఉద్యమబాట పట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారన్నారు. ముద్రగడ పద్మనాభం సీనియర్ రాజకీయ నాయకుడని, 1978లో జనతా పార్టీ ఎమ్మెల్యేగా శాసన సభకు ఎన్నికైన ముద్రగడ 83 ఎన్నికల్లో టిడిపి ఎమ్మెల్యేగా ఎంపికకై 85లో రాజీనామా చేసి మళ్లీ 1989లో కాంగ్రెస్ పార్టీలో చేరి, కాపు, బలిజలను బిసిల్లో చేర్చాలని ఉద్యమ బాట పట్టినా ఫలితం లేకపోయిందన్నారు. 1994 ఎన్నికల్లో ఓటమిపాలైన ముద్రగడ, 1999లో టిడిపి ఎంపిగా గెలిచి 2004 నుంచి 2014 వరకు తన ఉనికిని పోగొట్టుకున్నారన్నారు. రాష్టవ్య్రాప్త గుర్తింపు, మనుగడ కోసమే ఉద్యమబాట పడుతున్నారే తప్ప ఆయనకు చిత్తశుద్ది లేదన్నారు. కాపు, బలిజలను బిసిల్లో చేర్చేందుకు హామీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన హామీని నెరవేర్చకపోతే ఉద్యమబాట పట్టడంలో అర్థం ఉందని, ఇచ్చిన హామీ నెరవేరే సమయంలో ఉద్యమబాట పట్టడం కాపు, బలిజ వర్గాలకు తీవ్ర నష్టదాయకమన్నారు. ఈసమావేశంలో బలిజ సంఘం నాయకులు ఎవి ఆర్ ప్రసాద్, మార్కెట్‌యార్డు చైర్మన్ సిద్దం శివరాం, శిరివెళ్ల నాయకులు యామా గుర్రప్ప, స్థానిక బలిజ సంఘం సీనియర్ నాయకులు రాజారాం, చింతల సుబ్బరాయుడు, పరమేశ్వర, రాజశేఖర్‌లతోపాటు పెద్ద సంఖ్యలో బలిజ సంఘం నాయకులు పాల్గొన్నారు.
1 నుంచి ఎక్సైజ్ శాఖలో
కొత్త చట్టాలు అమలు
మహానంది, ఫిబ్రవరి 24: ఆంధ్రప్రదేశ్‌లో 2017 ఏప్రిల్ 1 నుంచి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖలో కొత్త చట్టాలను అమల్లోకి తెచ్చినట్లు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన మహానంది పుణ్యక్షేత్రంలో కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. క్షేత్రానికి వచ్చిన వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు మేరకు కొత్త పాలసీ వస్తుందని, కొత్త షాపులు వస్తే వాటిలో కొత్త చట్టాలు అమలు అవుతాయన్నారు. ప్రతి షాపులో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తారన్నారు. చట్ట సవరణ ప్రక్రియను పరిశీలిస్తున్నామన్నారు. హలోగ్రాఫిక్స్ పాత్ ఫైండల్ సిస్టం అమలు అవుతుందన్నారు. ఈ విధానం ద్వారా షాపుల్లో అధిక ధరలకు విక్రయించిన వారిపై కేసులు లేకుండ నేరుగా శిక్షలు అమలు చేస్తారన్నారు. మహానంది సమీపంలోని షాపును ఏప్రిల్ నెల నుంచి రద్దు చేస్తామన్నారు. వీరి వెంట సిఐ జయరాంనాయుడు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. వీరిని ధర్మకర్త బండి శ్రీనివాసులు సత్కరించగా వేదపండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు.
యాగంటికి భక్తుల తాకిడి
బనగానపల్లె, ఫిబ్రవరి 24:మండల పరిధిలోని ప్రముఖ శైవక్షేత్రమైన యాగంటి శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని తెల్లవారుజామున యాగంటి శ్రీ ఉమామహేశ్వరులకు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, కుంకుమార్చనలు, సహస్ర నామావళి, తదితర పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు తెల్లవారుజాము నుంచే యాగంటికి చేరుకోవడం కనిపించింది. భక్తులు ముందుగా పెద్దకోనేటిలో పవిత్ర స్నానమాచరించి ఆపై స్వామివారి సన్నిధికి చేరుకుని ప్రత్యేక పూజలు జరిపారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఆయన సతీమణి ఉమామహేశ్వరమ్మ, ఎక్సైజ్ డిఐజి వెంకటేశ్వరరావు దంపతులు, తదితర ప్రముఖులు యాగంటీశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఇఓ కె.ఆదిశేషనాయుడు ఆలయం వద్ద భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు, తాగునీరు, ప్రసాదాల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయించారు. సాయంకాలం శ్రీ ఉమాహేశ్వర నిత్యాన్నదాన సంస్థ నిర్వాహకులు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి రాతిదూలం లాగుడు పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలను చూసేందుకు, స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తజనంతో యాగంటి క్షేత్రం కిక్కిరిసిపోయింది. బనగానపల్లె సిఐ శ్రీనివాసులు, ఎస్‌ఐలు సిఎం రాకేశ్, విజయలక్ష్మి, వారి సిబ్బంది ఎండను సైతం లెక్కచేయకుండా బందోబస్తు నిర్వహించారు. ఈసారి వినూత్నంగా డ్రోన్‌లతో గట్టి పోలీసు నిఘా ఏర్పాటు చేశారు. వైద్యసిబ్బంది ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసుకుని భక్తులకు వైద్య సేవలు అందజేశారు. ఇక పెద్దకోనేరు వద్ద నుంచి స్వామివారి సన్నిధి వరకూ క్యూలైన్లను తడికలతో ఏర్పాటు చేశారు. ఎండను దృష్టిలో వుంచుకుని షామియానాలు ఏర్పాటు చేశారు. భక్తులు గుహాలయాలను సందర్శించి పులకించిపోయారు.
భక్తులకు అన్నదానం
యాగంటి క్షేత్రంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ ఉమామహేశ్వర నిత్యాన్నదాన సంస్థలో వేలాది మంది భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని అన్నదాన సంస్థ నిర్వాహకులు వై.రామారెడ్డి, దొనపాటి యాగంటిరెడ్డి, దస్తగిరిరెడ్డితో కలిసి కాటసాని ప్రారంభించారు. భక్తుల రద్దీ ఎక్కువగా వుండడంతో పలుచోట్ల ఆహార పదార్థాలు వుంచి భోజనం అందజేశారు. యాగంటిలో మరో 4 రోజులపాటు స్వామివార్లకు ఉత్సవాలు జరగనున్నాయి.
భక్తులతో కళకళలాడిన మహానంది
మహానంది, ఫిబ్రవరి 24: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం మహానంది భక్తుల ఓంకార ప్రణవనాదంతో మార్మోగింది. శుక్రవారం మహాశివరాత్రి జాగరణ సందర్భంగా భక్తులు శ్రీకామేశ్వరీ సమేత మహానందీశ్వరు స్వామివార్లను దర్శించుకున్నారు. ఉదయం నుంచే భక్తుల రద్దీ కొనసాగుతూ మధ్యాహ్న సమయానికి క్షేత్రం నిండుకుంది. భక్తులు ఆలయంలోని పుష్కరిణిలలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి వార్ల దర్శనానికై క్యూ లైన్లలో బారులుతీరారు. స్వామివార్ల దర్శనానికై వచ్చిన చిన్నపిల్లలను తమ తల్లిదండ్రులు వెంటనే గుర్తించడానికి చేతికి రిబ్బన్ కట్టి దానిపై వారి తల్లిదండ్రుల సెల్‌నెంబర్లను వేశారు. నంద్యాలకు చెందిన ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు ఈభృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా పలువురు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు. జిందాల్ ఫ్యాక్టరీకి చెందిన ఉచిత వైద్య శిబిరాన్ని మహానంది ఇఓ డాక్టర్ శంకర్ వరప్రసాద్, చైర్మన్ పాణ్యం ప్రసాద్‌రావులు ప్రారంభించారు. వీరు 3రోజుల పాటు ఉచిత వైద్య శిబిరంతో పాటు ఉచిత తాగునీటి సౌకర్యాన్ని కల్పించారు. అలాగే ఆర్‌ఎంపి వైద్యులతో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గరుడనందీశ్వర స్వామి ఆలయం వద్ద వైద్య శిబిరం నిర్వహించారు. తిమ్మాపురం పిహెచ్‌సి ఆధ్వర్యంలో ఆలయంలోని పుష్కరిణిల వద్ద వైద్య శిబిరం నిర్వహించారు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు మొబైల్ ఎటిఎంను రీజనల్ మేనేజర్ శివశంకర్ రెడ్డి, ఇఓ డాక్టర్ శంకర్‌వరప్రసాద్, చైర్మన్‌లు ప్రారంభించారు. మహానందికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినట్లు ఆర్‌ఎం తెలిపారు. ఆధార్‌నెంబర్ ఉంటే అనుసంధానంగా నగదు అందజేస్తామన్నారు. స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం బయటకు వచ్చే భక్తులకు ప్రసాదాల కౌంటర్ల వద్ద ఎపిజిబి వారు, వినాయకనంది ఎదురుగా ఆంధ్రాబ్యాంకు వారు, బయటకు వెళ్లే మార్గంలో ఎంపి ఎస్పీవైరెడ్డి ఆధ్వర్యంలో శర్మ మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు.
నీటికుంటలో విషప్రయోగం..
చేపలు మృతి
కోడుమూరు, ఫిబ్రవరి 24:వర్షం నీటితో మరుగున పడిన నీటి కుంటలో చేప పిల్లలు వదిలి వాటిని 3 నెలల తరువాత మార్కెట్‌లో అమ్ముకుని జీవనం సాగిస్తున్న చేప రైతుల బతుకులు రోడ్డున పడ్డాయి. గుర్తుతెలియని వ్యక్తులు చేతికి వచ్చిన చేపలపై విషప్రయోగం చేయడంతో చేపలన్నీ మృతిచెందడంతో చేప రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వివరాలు.. పట్టణంలోని బోయ అజయ్, బుడగజంగాల మద్దిలేటి కలిసి గత ఐదేళ్ల నుంచి పట్టణ శివారులో ఉన్న నీటి కుంటలో చేపల పెంపకం చేపడుతూ వాటి ద్వారా వ్యాపారాలు సాగిస్తున్నారు. ఈ ఏడాది వారు కొత్తగా రొయ్యల వ్యాపారం కూడా చేయాలనే ఆలోచనతో 3 నెలల క్రితం తెనాలిలోని మత్స్య కేంద్రం నుంచి రూ. లక్ష వెచ్చించి చిన్నపాటి రొయ్యలు, మరో రూ. 2లక్షలు విలువ చేసే చేప పిల్లలను తెచ్చి నీటి కుంటలో వదిలారు. ఈ చేపలకు ఆ ఇద్దరు రైతులు కాపలా ఉండేవారు. ఇక చేపలు చేతికి వచ్చాయని వారు సంబరపడుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఈ నెల 23వ తేదీ రాత్రి నీటి కుంటలో విషప్రయోగానికి పాల్పడ్డారు. ఎప్పటిలాగే ఆ రైతులు శుక్రవారం ఉదయం నీటి కుంట వద్దకు వెళ్లి చూడగా చేపలన్నీ చనిపోయి నీటిపైన తేలియాడుతుండడం చూసి నిశే్చష్టులయ్యారు. ఇలాంటి దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గుండ్ల బ్రహ్మేశ్వరం ఆలయంలో
కన్నుల పండువగా స్వామివారి కల్యాణోత్సవం
నంద్యాల, ఫిబ్రవరి 24: మహాశివరాత్రి పర్వదినాన గుండ్ల బ్రహ్మేశ్వరంలో వెలసిన స్వామి వారికి రాజరాజేశ్వరి అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించిన అనంతరం శుక్రవారం అర్థరాత్రి వైభవంగా లింగోద్భవ అనంతరం స్వామి, అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో అర్చకులు వెంకటశేషయ్య పాల్గొన్నారు. ముందుగా ఉత్సవ మూర్తులు గుండ్ల బ్రహ్మేశ్వరం చేరుకున్న అనంతరం అటవి భవనాల వద్ద ఉన్న రావిచెట్టు వద్ద పూజలు నిర్వహించి నందివాహనంపై ఊరేగించారు. ఆలయం వద్దకు చేరుకున్న అనంతరం పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు లింగోద్భవ కార్యక్రమం అనంతరం కల్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు వెంకటశేషయ్య మాట్లాడుతూ కళ్యాణం కార్యక్రమంలో పాల్గొన్న దంపతులకు సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి అన్నారు. మహాశివరాత్రి పురస్కరించుకొని ఆలయ కమిటీ వారు ఉచిత భోజన వసతి కల్పించడంతోపాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అయితే ఈ ఏడాది అటవీ శాఖ అధికారులు గుండ్ల బ్రహ్మేశ్వరం ఆలయానికి మహాశివరాత్రిని పురస్కరించుకొని వెళ్లే వారందరు తప్పని సరిగా వ్రాత పూర్వక అనుమతి పత్రాలు పొందాలని నిబంధన పెట్టినందు వల్ల పెద్ద సంఖ్యలో భక్తులు రాలేకపోయారు. ముఖ్యంగా నల్లమల అరణ్యంలోని 26 వేల అడుగుల ఎత్తున వెలసిన గుండ్ల బ్రహ్మేశ్వరం ఆలయానికి చేరుకోవాలంటే చాలా వ్యయ ప్రయసాలకు గురి కావాల్సి వస్తుంది. గతంలో వెలుగోడు నుండి, చలమ రైల్వే స్టేషన్ నుండి, ప్రకాశం జిల్లాలోని దిగువమెట్ట, పాపినేనిపల్లె నుండి మెటల్ రోడ్డు ద్వారా వాహనాలు వెళ్లేవి. అయితే అటవి శాఖ వారు అన్ని దారులను మూసి వేశారు. కేవలం ప్రకాశం జిల్లాలోని దిగువ మెట్ట నుండి 40 కి.మీ.ల దూరం నాలుగు గంటల పాటు జీపులో ప్రయాణిస్తే గుండ్ల బ్రహ్మేశ్వరం ఆలయానికి చేరుకోవచ్చు. నల్లమల అరణ్యంలోని దట్టమైన అటవి ప్రాంతంలో ఉన్న గుండ్ల బ్రహ్మశ్వర ఆలయం చెట్లు, చేమలతో పూర్తిస్థాయిలో కప్పబడి, భక్తులకు కనిపించేది కాదని అయితే 1915లో బ్రిటీష్ వారు టేకు చెట్లను నాటేందుకు ఇక్కడ ఒక అతిథి గృహంతోపాటు అటవి శాఖ వారు నివాస గృహాలను కూడా నిర్మించారు. ఆ సమయంలోనే చెట్లు చేమలతో కప్పబడి పోయిన ఈ ఆలయాన్ని 1946లో అప్పటి అటవి అధికారి బోనీరు నంజప్ప గుర్తించి చిన్న దేవలాపురం గ్రామస్తులతో శుభ్రం చేయించి పూజలు ప్రారంభించారు. అదేవిధంగా ఆవుల పాటి పుల్లయ్య, లింగన్నల ఆధ్వర్యంలో నాటి నుండి నేటి వరకు మహాశివరాత్రి ఉత్సవములు వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని పాపినేనిపల్లెకు చెందిన కోటేశ్వరరావు నందివాహనాన్ని, సింహ వాహనాన్ని, లింగన్న విగ్రహాలను చేయించగా, శివరాత్రి పర్వదినాన స్వామి వారికి మహాశివరాత్రి నాడు వైభవంగా రుద్రాభిషేకం, రుద్రహోమం, బిల్వార్చనలు, రాజరాజేశ్వరి అమ్మవారికి కుంకుమార్చనలు, నిర్వహిస్తున్నారు. కాగా 2006లో గుండ్ల బ్రహ్మేశ్వరం ఆలయాన్ని అప్పటి నంద్యాల డి ఎఫ్ ఓ సూర్యనారాయణరావు శ్రద్ద వహించి కొంత ధనం వెచ్చించి అక్కడి కోనేరును శుభ్రం చేయించి శిధిలమై పోతున్న కట్టడాలను బలోపేతం చేయడంతోపాటు గుండ్లకమ్మ నది పుట్టిన గడ్డన వెలసిన గుండ్ల బ్రహ్మేశ్వరం ఆలయంలో ప్రతి రోజు దీపారాధన, పూజలు చేసే విధంగా చర్యలు తీసుకోవడంతో నేటి వరకు అటవీ శాఖ వారే స్వామి వారికి అన్ని రకాల దీప, ధూప నైవేద్యాలు సమర్పిస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినాన పెద్ద దేవలాపురం గ్రామానికి చెందిన అర్చకుల కుటుంబీకులు శశిశేఖర్, మహేశ్వరరావులు కలసి ప్రత్యేక పూజలు నిర్వహించి వైభవంగా కళ్యాణం కార్యక్రమాన్ని చేశారు.

మహానంది క్షేత్రంలో
మీడియా సెంటర్ ప్రారంభం...
మహానంది, ఫిబ్రవరి 24: మహానంది క్షేత్రంలో ఏర్పాటు చేసిన మీడియా కేంద్రాన్ని ఇఓ డాక్టర్ శంకర్‌వరప్రసాద్ ప్రారంభించారు. శుక్రవారం డిఎల్‌పిఓ శివకుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా కేంద్రాన్ని ఇఓ ప్రారంభించి క్షేత్రంలో జరిగే సమాచారాన్ని పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు చేర్చేందుకు మీడియా ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
మహానంది పుణ్యక్షేత్రంలో జాగరణ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. జాగరణలో భాగంగా నాటకాలు, చెక్క భజనలు, చిన్నారుల కోలాటాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకర్షించాయి.
ప్రముఖుల పూజలు...
ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో పలువురు ప్రముఖులు పూజలు నిర్వహించారు. శుక్రవారం నంద్యాలకు చెందిన ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి మంగాకుమారి, జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ రామ్మోహన్, నంద్యాల డిఎస్పీ హరినాథరెడ్డి, పిపి నాగిరెడ్డి, నంద్యాల మాజీ ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి, డిసిసి ఎఫ్‌ఓ మూర్తి, డిఎఫ్‌ఓ శివప్రసాద్ పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. శ్రీకామేశ్వరీ సమేత మహానందీశ్వర స్వామివార్లకు పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.
కబడ్డీ పోటీలు...
నవనందులలో ఒక క్షేత్రమైన సూర్యనంది క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలు జరిగాయి. ఈపోటీలను శిల్పా భువనేశ్వరరెడ్డి, నాగేశ్వరరెడ్డిలు ప్రారంభించారు. రాష్టస్థ్రాయిలో జరుగుతున్న ఈ కబడ్డీ పోటీలలో దాదాపుగా 40జట్లు పాల్గొన్నాయి. ఈపోటీలు పోటాపోటీగా జరుగుతున్నాయి.
గోవిందనామస్మరణ
మధ్య నృసింహమాల దీక్ష విరమణ
ఆళ్లగడ్డ, ఫిబ్రవరి 24: ప్రముఖ పుణ్య క్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దీక్షను స్వీకరించిన మాలధారులు శుక్రవారం దీక్ష విరమణ చేసేందుకు వేలాది మంది మాలధారులు తరలివచ్చారు. గురువారం నుండే సుదూర ప్రాంతాల నుండి 41 రోజుల పాటు దీక్షను నిర్విఘ్నంగా కొనసాగించి కాలినడకన అహోబిల క్షేత్రం చేరుకున్న నృసింహ మాలధారులు ఉయదానే్న శుచిగా స్నానమాచరించి అహోబిలేసుని సన్నిధిలో ఇరుముడులు ధరించి దిగువ అహోబిలం నుండి ఎగువ అహోబిలంకు కాలినడకన చేరుకొని అక్కడి నుంచి కొండపైన వెలసిన నవనారసింహులలలో ఒకరైన శ్రీ మాలోలా నరసింహస్వామి సన్నిధానానికి చేరుకున్నారు. ఎగువ నుండి కొండపైకి మెట్లు ఎక్కుతూ అహోబిలేశా... నరసింహా పాహిమాం, పాహిమాం అంటూ గోవిందనామాలు స్మరిస్తూ ముందుకు సాగుతూ మాలోల సన్నిధికి చేరుకొని అక్కడ అర్చక స్వాముల సమక్షంలో నిర్వహించిన సుదర్శనహోమంలో పాల్గొని అనంతరం దీక్షను విరమించారు. నృసింహా దీక్షను విరమింపజేసేందుకు తమ బంధుమిత్రాదులతో కలిసి వచ్చిన నృసింహమాలధారుల కోసం ఇఓ మల్లికార్జున ప్రసాద్ అన్నదానం ఏర్పాటు చేశారు. వేలాది మంది భక్తులు అన్నదానంలో పాల్గొన్నారు.
మహిమాన్వితుడు శ్రీసిద్ధరూడస్వామి
పెద్దకడబూరు, ఫిబ్రవరి 24: పెద్దకడబూరులో వెలసిన శ్రీ సిద్దరూడస్వామి మహిమాన్వితుడుగా వెలుగొందుతున్నాడు. స్వామివారి రథోత్సవం మహాశివరాత్రి పురష్కరించుకుని ఈనెల 26న అత్యంత వైభవంగా జరగనుంది. మహాశివరాత్రి సందర్భంగా స్వాముల వారి రథాన్ని ఊరేగిస్తారు. ఈసంరద్భంగా స్వామికి ఆదివారం ఉదయం గంగాభిషేకం, పంచామృతాభిషేకంతోపాటు విశేష పూజలను నిర్వహిస్తారు. సాయంత్రం పుష్పరథంపై స్వామివారిని ఉం చారు. మాజీ విఆర్‌ఓ రామలింగారెడ్డి ఇంటి నుంచి స్వాము ల వారికి కుంబాలతో ఊరేగి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వాముల వారి రథాన్ని పెద్దబావి వద్ద ఉన్న బసవన్న విగ్రహం వరకు లాగి తిరిగి ఆలయంకు చేర్చుతారు. రథోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు హనుమంతరెడ్డి, సత్యనారాయణరెడ్డి తెలిపారు.
మఠంలో ఘనంగా మహాశివరాత్రి
మంత్రాలయం, ఫిబ్రవరి 24: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు జరిగాయి. మఠంలో కొలువు తీరిన జంగమ దేవర శ్రీ శివయ్యకు మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం శివరాత్రి వేడుకలను పురస్కరించుకుని శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనం ఎదురుగా ఉన్న శివలింగానికి పీఠాధిపతి తులసి అర్చన, పంచామృతాభిషేకం, బిల్వార్చన, రుద్రాభిషేకం తదితర ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. అనంతరం శ్రీ రాఘవరాయల మూల బృందావనానికి ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. అంతక ముందు మూల రామదేవతా మూర్తులకు ప్రత్యేకపూజలు చేసి మహామంగళమారతి ఇచ్చి భక్తులకు ధర్శనం కలిగించారు. సాయంత్రం మంత్రాలయం పాత ఊరులో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామికి భక్తులు ఉపవాదీక్షలు చేపట్టి స్వామి వారికి విశేష పూజలుచేసి మొక్కులు తీర్చుకున్నారు. మండలపరిధిలోని గ్రామాల శివాలయాల్లో మహాశివరాత్రి వేడుకలను భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. అలాగే స్వామివారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. రాత్రి శివాలయాల్లో భక్తులు భజనలుతో జాగరన చేశారు.
వివాహిత ఆత్మహత్య
కర్నూలు, ఫిబ్రవరి 24:ఓర్వకల్లు మండలం ఉసేనాపురం గ్రామానికి చెందిన సుగుణమ్మ(35) శుక్రవారం ఉదయం క్రిమిసంహారక మాత్రలు మింగింది. గమనించిన భర్త వెంకటేశ్వర్లు వెంటనే ఆమెను కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వివాహమై 11 సంవత్సరాలైనా పిల్లలు పుట్టని కారణంగా మనస్థాపానికి గురైన సుగుణమ్మ ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సొసైటీ అధ్యక్షులు ప్రసాద్‌రెడ్డి ఆకస్మిక మృతి
కొలిమిగుండ్ల, ఫిబ్రవరి 24: కొలిమిగుండ్ల సహకార సంఘం అధ్యక్షులు అంబటి శివ ప్రసాద్‌రెడ్డి (52) శుక్రవారం ఆకస్మికంగా మృతి చెందాడు. ప్రసాదరెడ్డి ఉదయమే శివాలయానికి వెళ్లి పూజలు నిర్వహిస్తుండగా అనారోగ్యానికి గురికాగా చికిత్స కోసం బంధువులు అనంతపురం జిల్లా తాడిపత్రికి తరలించగా, అటునుంచి అనంతపురంకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ప్రసాదరెడ్డి గత రెండు పర్యాయాలు సహకార సంఘానికి ఏకగ్రీవంగా ఎన్నికై కొనసాగుతున్నారు. వైకాపా జిల్లా అధికార ప్రతినిధిగా ఇటీవలనే నియమితులయ్యారు. ఆయన మృతి పట్ల బనగానపల్లె వైకాపా నాయకులు యర్రబోతుల వెంకటరెడ్డి, మాజీ జడ్పీటీసీ ఉదయభాస్కర్‌రెడ్డి, లాయర్ మహేశ్వర్‌రెడ్డి, హనుమంతుగుండం సహకార సంఘం ఉపాధ్యక్షులు రామసుబ్బయ్యయాదవ్, వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు సంతాపం ప్రకటించారు.

భార్యను హత్యచేసిన భర్త
కౌతాళం, ఫిబ్రవరి 24: అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను కత్తితో అతిదారుణంగా పొడించి చంపాడు భర్త. ఈ విషాదకరమైన సంఘటన మండల పరిధిలోని హాల్వి గ్రామంలో చోటు చేసుకుంది. మండల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హాల్వి గ్రామానికి చెందిన శ్యామ్‌సన్‌కు ఆదోనికి పట్టణానికి చెందిన సువర్ణతో(28) 10 సంవత్సరాల క్రితమే వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. అయితే గత రెండు నెలల నుంచి భార్యను నిత్యం వేదిస్తుండేవాడని, ఇది భరించలేక ఆమె తన పుట్టింటికి వెళ్లిందని అయితే కుటుంబ పెద్దలు ఆమెకు సర్ది చెప్పి మళ్ళి కాపురానికి తీసుకొచ్చారు. గత రెండు రోజుల నుండి ఇద్దరు గొడవ పడ్డారన్నారు. శుక్రవారం తెల్లవారు జామున ఆమె నిద్రపోతున్న సమయంలో కత్తితో మెడపై పొడిచి చంపాడన్నారు. సంఘటన స్థలాన్ని ఆదోని తాలూకా సిఐ దైవస్రసాద్ పరిశీలించారు. మృతురాలి తండ్రి నర్సప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని