కర్నూల్

హోరాహోరీగా స్థానిక సంస్థల మండలి పోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఫిబ్రవరి 26:స్థానిక సంస్థల కోటాలో జిల్లా నుంచి శాసన మండలి సభ్యత్వం కోసం జరగనున్న ఎన్నికల్లో హోరాహోరీ పోరు తప్పదని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. రెండున్నరేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో టిడిపి సులభంగా సుమారు 150 ఓట్లకు పైగా మెజారిటీతో విజయం దక్కించుకుంది. అయితే ఈ సారి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయని వారు భావిస్తున్నారు. జిల్లాలో స్థానిక సంస్థల సభ్యుల ఓట్లు 1084 ఉన్నాయి. వీటిలో అధికారికంగా వైకాపాకు 650 మంది ఉండగా గత ఎన్నికల సమయంలో అనేక మంది పార్టీ ఫిరాయించి టిడిపి అభ్యర్థికి అనుకూలంగా ఓటేశారు. దీంతో ఆ పార్టీ తరఫున శిల్పా చక్రపాణిరెడ్డి విజయం సాధించారు. అయితే ఈ సారి పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోందని విశే్లషకులు భావిస్తున్నారు. గతంలో పార్టీ మారిన వైకాపా సభ్యులకు అధికార టిడిపి నుంచి సరైన సహకారం లభించకపోవడమే కారణమని వారు వెల్లడిస్తున్నారు. దీంతో గతంలో పార్టీ మారిన వారిలో సుమారు 70శాతం మంది ఈ సారి అధికార పక్షానికి వ్యతిరేకంగా ఓటేసే అవకాశం ఉందని విశే్లషకుల అభిప్రాయం. వైకాపాకు చెందిన జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు 528 మంది, పురపాలక సంఘం సభ్యులు 118 మంది ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. వీరిలో సుమారు 200 నుంచి 220 మంది వరకూ గత ఎన్నికల్లో టిడిపికి మద్దతు పలికారు. వైకాపానే కాకుండా కాంగ్రెస్, ఆర్పీఎస్ సభ్యులు సైతం శిల్పాకు ఓటేయడంతో ఆయన సునాయసంగా విజయాన్ని అందుకోగలిగారు. ఈ సారి పార్టీ మారినా సుమారు 220 మంది వైకాపా సభ్యుల్లో సుమారు 200 మంది సభ్యులు తిరిగి సొంత గూటికి చేరుకుంటారని, అందుకు ఆయా నియోజకవర్గ నేతలు కూడా సహకరిస్తారని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు పార్టీ ఫిరాయించిన వారికి సరైన ప్రాధాన్యత దక్కలేదని, పింఛన్లు, రేషన్ కార్డులు, తదితర వ్యక్తిగత సంక్షేమ పథకాల్లో తమ వారికి తగినంత సహకారం లభించకపోవడంతో వారు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక గతంలో పార్టీ ఫిరాయించిన నాయకులు సైతం ప్రస్తుతం అసంతృప్తితో ఉండటంతో వైకాపా పని సులభతరమవుతుందని తెలుస్తోంది. మరొక ఇద్దరు నేతలు టిడిపిలో కొనసాగుతున్నా పరోక్షంగా వైకాపాకు సహకరిస్తారని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. ఇక కాంగ్రెస్, ఆర్పీఎస్‌లకు చెందిన సుమారు 13 ఓట్లు ఈ సారి వైకాపాకు వేయాలని ఆయా పార్టీ నేతలు సూచించినట్లు స్పష్టమవుతోంది. వైకాపా ఎత్తులను తిప్పికొట్టడానికి అధికార టిడిపి నేతలు వ్యూహం రచిస్తున్నారు. తమ పార్టీకి గతంలో మద్దతు తెలిపిన ప్రతిసభ్యుడు తమను వీడకుండా ఉండటానికి ఇప్పటి నుంచే పథకం సిద్ధం చేస్తున్నారు. గతంలో వచ్చిన మెజారిటీకి ఏ మాత్రం తక్కువ కాకుండా విజయం దక్కించుకోవాలని వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ సారి ఎన్నికలు హోరాహోరీగా సాగడం ఖాయమని సర్వత్రా భావిస్తున్నారు.
ప్రశాంతంగా గ్రూప్-2 పరీక్ష
* 14,632 మంది గైర్హాజరు
కర్నూలుటౌన్, ఫిబ్రవరి 26:ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మొత్తం 152 కేంద్రాల్లో 56,200 మందికి గానూ 41,568 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా, 14,632 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కోసం కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేశారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకూ పరీక్ష నిర్వహించారు. పరీక్ష నిర్వహణలో 11 మంది సమన్వయ అధికారులుగా, 46 మంది తహశీల్దార్లు లైజన్ అధికారులుగా విధులు నిర్వర్తించారు. పరీక్ష ముగిసిన అనంతరం సమాధాన పత్రాలను 152 కేంద్రాల నుంచి భారీ బందోబస్తు నడుమ కలెక్టరేట్‌లోని డిఆర్‌ఓ కార్యాలయంలో ఏపిపిఎస్‌సి సహాయ కార్యదర్శికి అప్పగించారు. అనంతరం వాటిని హైదరాబాద్ ప్రధాన ఏపిపిఎస్‌సి కార్యాలయానికి భారీ బందోబస్తు నడుమ తరలించారు. పరీక్ష ప్రారంభం నుంచి ముగిసేంత వరకూ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి జెసి హరికిరణ్ పర్యవేక్షించారు. జిల్లాలో దాదాపు 28శాతం మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. ఇదిలా ఉండగా గ్రూప్-2 పరీక్షకు ఈ ఏడాది 14,632 మంది గైర్హాజరయ్యారు. 2013లో నిర్వహించిన పరీక్షకు 20శాతం మంది మాత్రమే గైర్హాజరు కాగా ఈ ఏడాది 28శాతం గైర్హాజరయ్యారు.
కాపు ఉద్యమం ఉద్ధృతం
* సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముద్రగడ
కర్నూలు టౌన్, ఫిబ్రవరి 26:కాపుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముద్రగడ పద్మనాభం హెచ్చరించారు. నగరంలోని ఒక ఫంక్షన్ హాలులో ఆదివారం బలిజ సంఘం నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపుల సమస్యలను పరిష్కరించడానికి అహర్నిషలు కృషి చేస్తానన్నారు. అయితే సిఎం చంద్రబాబు ఉద్యమాలను అడ్డుకోవడానికి చూస్తున్నారని, కావున కాపులంతా ఒక తాటిపైకి వచ్చి ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా బలిజ సంఘం నాయకులు పాల్గొన్నారు.
కన్నులపండువగా
మహానందీశ్వరుని రథోత్సవం
* అశ్వవాహనంపై దర్శనమిచ్చిన స్వామివార్లు
మహానంది, ఫిబ్రవరి 26 : మహానంది పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన స్వామి వార్ల రథోత్సవ కార్యక్రమం అశేష జనవాహిని మధ్య కన్నుల పండువగా, అత్యంత వైభవోపేతంగా భక్తుల ఓంకార నామ స్మరణల మధ్య సాగింది. ఆదివారం స్వామి వార్ల రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేదపండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వర శర్మ, శాంతారామ్‌భట్‌లతో పాటు ప్రత్యేక వేదపండితులు రథశాల వద్ద ఈఓ డా.శంకర వరప్రసాద్, చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, ధర్మకర్తలచే గణపతి పూజ, పుణ్యాహవాచనం, నవ కలశ స్నపనం, రథాంగ హోమం, పూర్ణాహుతి, రథాంగ బలి, పీటార్చన, పీఠానికి అభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామి వార్లను ప్రత్యేకంగా అలంకరించి మేళ తాళాలతో ఆలయం నుంచి రథశాలకు చేర్చారు. అనంతరం తమడపల్లెకు చెందిన పుల్లయ్య ఆచారి కుంబాన్ని తీసుకువచ్చి రథానికి కుంభబలి ఇచ్చారు. అనంతరం 3వ అదనపు జిల్లా జడ్జి ఇంతియాజ్ అహ్మద్, ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ రామ్మోహన్‌రావు, నంద్యాల డిఎస్పీ హరినాథ్‌రెడ్డి, ఆలయ చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, డిఎల్‌పిఓ పార్వతి, ఈఓ డా.శంకర వరప్రసాద్‌లు, కొబ్బరికాయలు కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం స్వామి వార్ల రథోత్సవం ఆలయ ప్రదర్శనగా వేలాది మంది భక్తుల మద్య దాదాపు 2 గంటల పాటు సాగింది. భక్తులు రథోత్సవంలో పాల్గొని భక్తిశ్రద్దలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ కామేశ్వరిసమేత మహానందీశ్వర స్వామి వార్లు అశ్వవాహనంపై విహరించారు. ఆదివారం ఉదయం స్వామివార్లను అశ్వవాహనంపై కొలువుదీర్చి ప్రత్యేక పుష్పాలంకృతులను చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భాజభజంత్రీలతో, తప్పెట వాయిద్యాలతో అశ్వవాహన సేవను నిర్వహించారు.మహానంది పుణ్యక్షేత్రం అశేష జన వాహినితిలో కళకళలాడింది. ఆదివారం రథోత్సవాన్ని తిలకించేందుకు దాదాపు లక్ష మంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తులతో క్షేత్రంలోని పురవీదులన్ని కిక్కిరిసి పోయాయి. మహానంది క్షేత్రంలో ఆదివారం నిర్వహించిన రథోత్సవం ముందు కర్నాటకకు చెందిన కొందరు యువకులు చేసిన బొమ్మల విన్యాసం భక్తులను ఆకట్టుకుంది. కర్నాటకలోని చిలకాముఖి జిల్లాకు చెందిన ఈ విన్యాసకులు నంది, రాజు, రాణి, ఎలుగుబంటి వేషాలు వేసుకుని రథోత్సవం ముందు ప్రత్యేక నృత్య కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఎంసి ఫారంకు చెందిన డప్పు బృందం ప్రత్యేకంగా డప్పు వాయిస్తూ ప్రత్యేకంగా ఆకర్షించారు. మహానంది పుణ్యక్షేత్రంలో రథోత్సవం జరుగుతుండగా ఆర్యవైశ్య నిత్యన్నదాన సత్రం వద్దకు రాగానే చిన్న వాగ్వివాదం చోటు చేసుకుంది. రథోత్సవం కింద కొందరు తెడ్డు వేస్తూ రథాన్ని నడిపే వారు ఇరుక్కోవడంతో రథాన్ని నిలిపారు. ఆర్యవైశ్యులు అక్కడ కేకలు వేయడంతో అర్చకులు, పండితులు, ఆర్యవైశ్యుల మద్య చిన్నపాటి వాదులాట చోటు చేసుకుంది. ఎస్‌ఐ పెద్దయ్య నాయుడు అక్కడికి చేరుకుని వాగ్వివాదాన్ని సద్దుమణిగించారు. ఈ కార్యక్రమాల్లో పర్యవేక్షకులు పరశురామ శాస్ర్తీ, ఈశ్వర్‌రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. మహానంది పుణ్యక్షేత్రంలో జరిగే రథోత్సవ కార్యక్రమానికి డి ఎస్పీ హరినాధరెడ్డి ఆద్వర్యంలో భారీగా బందోబస్తు నిర్వహించారు. నలుగురు సి ఐలతోపాటు ఎస్‌ఐలు, తోటి సిబ్బందితో రథోత్సవం చుట్టు బందోబస్తు నిర్వహిస్తూ ఎలాంటి సంఘటనలు జరుగకుండ బందోబస్తు నిర్వహించారు.
విద్యార్థులు శాస్తస్రాంకేతిక
రంగాలకు ప్రాధాన్యతివ్వాలి
* డిఇఓ తాహెరా సుల్తానా
నంద్యాల, ఫిబ్రవరి 26:నేటి విద్యార్థులు రేపటితరం శాస్తవ్రేత్తలుగా ఎదగాలంటే శాస్త్ర సాంకేతిక రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారి తాహెరా సుల్తానా అన్నారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని గురురాజ కానె్సప్ట్ స్కూలులో ఏర్పాటు చేసిన జాతీయ సైన్స్ డే కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గురురాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్ దస్తగిరిరెడ్డి, బ్యాంకు కోచింగ్ కేంద్రం డైరెక్టర్ వౌలాలిరెడ్డి, బనగానపల్లె కృషి విజ్ఞాన కేంద్రం సాయిల్ సైన్స్ శాస్తవ్రేత్త డా.కెవి. రమణయ్య, రాయలసీమ యూనివర్శిటి అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎస్ రమణయ్య, డా.సెంథిల్‌కుమార్, ఉస్మానియా కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డా. ఎస్.మహ్మద్ గౌస్‌లు పాల్గొన్న ఈ కార్యక్రమంలో దేశానికి తొలి సారిగా నోబెల్ బహుమతి సాధించిన భారతదేశ శాస్తవ్రేత్త సర్ సివి రామన్ చిత్రపటానికి ముఖ్య అతిథులందరు నివాళులు అర్పించి విద్యార్థులతో శాస్తవ్రేత్తలు ముఖాముఖి చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటి డిఇఓ తాహెరా సుల్తానా మాట్లాడుతూ నేటి విద్యార్థులు ఎక్కువ శాతం ఇంజనీరింగ్ విద్యపై మొగ్గుచూపుతున్నారని, అయితే ఈ పరిస్థితి మారాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసినప్పటికి నైపుణ్యాలు లేకపోవడంతో అనుకున్న ఉద్యోగాలు సాధించలేకపోతున్నారన్నారు. ఈ దశలో యువత శాస్త్ర సాంకేతిక రంగాల వైపు దృష్టిసారించి పరిశోధనలపై పట్టు సాధించి దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలుపాలన్నారు. ఇటీవలనే శ్రీహరి కోట నుండి భారతదేశం ప్రయోగించిన రాకెట్ ద్వారా 104 ఉప గ్రహాలను విజయవంతంగా కక్షలోనికి ప్రవేశపెట్టి ప్రపంచంలోనే నెంబర్-1గా ఇతర దేశాలు భారతదేశాన్ని కొనియాడాయన్నారు. విద్యార్థులు పరిశోధనల వైపు దృష్టిసారించాలంటే సైన్స్‌పై శ్రధ్ద పెట్టి చదవాలన్నారు. భారతదేశం పూర్వం నుంచి శాస్త్ర సాంకేతిక రంగాలలో మంచి పట్టు సాధించిందని, క్రీస్తుకు పూర్వం నుండి భారతీయ శాస్తవ్రేత్తలు ఖగోళ శాస్త్రంలోను, ఆర్థిక శాస్త్రంలోను, ఆయుర్వేద శాస్త్రంలోను అపురూపమైన ఆవీష్కరణలతో ప్రపంచ దేశాలను ఆకర్షించిందన్నారు. శాస్తవ్రేత్తలు నూతన ఆవిష్కరణలకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అట్టడుగు స్థాయి నుండి అత్యున్నత స్థాయికి ఎదిగిన శాస్తవ్రేత్త భారతరత్న ఎపిజె అబ్దుల్‌కలాంను స్ఫూర్తిగా తీసుకుని ఆయన సూచించిన విధంగా కలలు కని ఆ కళలను సాకారం చేసుకునేందుకు చిత్తశుద్దితో విద్యార్థులు కృషి చేయాలన్నారు. పేపర్ బాయ్ నుండి ప్రపంచం గర్వపడే విధంగా అంతరిక్ష పరిశోధనలో దేశాన్ని అగ్రగామిగా నిలుపడంతోపాటు భారత రాష్టప్రతిగా పనిచేసి ప్రపంచ దేశాలను తనవైపు తిప్పుకోగలిగిన అపూర్వ శాస్తవ్రేత్తను చూసి మనమంతా గర్వపడాలన్నారు. ఈ కార్యక్రమంలో బనగానపల్లె కృషి విజ్ఞాన కేంద్రం సాయిల్ సైన్స్ శాస్తవ్రేత్త డా.కెవి రమణయ్య మాట్లాడుతూ 1928 ఫిబ్రవరి 28వ తేదీన సివి రామన్ పరిశోధన ఫలితంగా కాంతి పరివర్తన సిద్దాంతానికి నోబుల్ బహుమతి దక్కిందని, ఆ రోజునే జాతీయ సైన్స్ డేగా దేశమంతా జరుపుకుంటున్నామన్నారు. సైన్స్ అంటే ప్రకృతి, ప్రకృతి సంపదను దేశ సంపదగా మలుచుకోవాలంటే సైన్స్‌కు అనుసంధానం చేస్తూ టెక్నాలజి కొత్త పుంతలు తొక్కాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. స్వాతంత్రం వచ్చిన సమయంలో 30 కోట్ల జనాభాకు భారతదేశంలో సరిపడ ఆహార ధాన్యాలు పండించలేని పరిస్థితుల్లో శాస్తవ్రేత్తల కృషి ఫలితంగా హరిత విప్లవం సాధించిన ఫలితమే నేడు 120 కోట్ల జనాభాకు సరిపడ ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకోవడం వెనుక టెక్నాలజి సాధించిన విజయమేనన్నారు. ఈ కార్యక్రమంలో డిఇఓ తాహెరా సుల్తానా, శాస్తవ్రేత్తలకు ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి డిఇఓ సుమతి, ఎంఇఓ వెంకటరమణమ్మ, గురురాజ కానె్సప్ట్ స్కూలు డైరెక్టర్ షేక్‌షావలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆదోనిలో రోడ్ల విస్తరణ చేపట్టాలి
* బిజెవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలకంఠ
ఆదోని, ఫిబ్రవరి 26:ఆదోనిలో రోడ్లు విస్తారణపై చర్యలు చేపట్టాలని బిజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునిగిరి నీలకంఠ స్పష్టం చేశారు. మహేశ్వరి కళ్యాణ మంఠపంలో ఆదివారం బిజెపి నగర పార్టీ సమావేశం జరిగింది. ఈసమావేశంలో పాల్గొన్న కునిగిరి నీలకంఠ మాట్లాడుతూ ఆదోనిలో ట్రాఫిక్ సమస్య పెద్ద ఎత్తున ఉందని దాని వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని కావున జిల్లా సర్వేయర్‌ను నియమించి రోడ్ల పనులను వేగవంతం చేయాలని కోరారు. రోడ్లుకు ఇరువైపుల ఉన్న అక్రమ కట్టడాలను ఎలాంటి పక్ష పాతం లేకుండా తొలగించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించి రోడ్డు ప్రమాదాలు నివారించాలని కోరారు. మున్సిపాలిటి ఆదాయానికి వేలాల ద్వారా రావాల్సిన ఆదాయానికి చాలా మంది గండి కొడుతున్నారని కావున మార్కెట్ సొమ్మును వసూళ్లు చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కాంట్రాక్టర్లు సోమ్ములు చెల్లించకపోతే వారి ఆస్తులను జప్తు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కాంట్రాక్టర్లపైన ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. మత ఘర్షణలో ఆమాయకులపైన పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. తాగునీటి ఎద్దడిని నివారించడానికి ముందస్తు చర్యలను తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌జైన్ మాట్లాడుతూ పోలీసులు వీడియో ఆధారంగా మత ఘర్షణల కేసులు పెట్టడం ఎంత మాత్రం తగదని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌జైన్ అన్నారు. 2011 సంవత్సరంలో జరిగిన ఘర్షణలను పోలీసులు అదుపు చేయడంలో విఫలం చెందారని పేర్కొన్నారు. కేవలం ఒక వీధిలో చెలరేగిన ఘర్షణలను అదుపు చేయలేక పట్టణం వరకు వ్యాపింప చేయడానికి పోలీసుల చర్యలే కారణమన్నారు. వాస్తవానికి ఒక లారీకి నిప్పులో కాలుతుండగా మంటలను ఆర్పుతున్న వ్యక్తుల వీడియోలను తీసి కేసులు పెట్టడం సమంజసం కాదని అన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, సిఎం చంద్రబాబునాయుడుకు ఒక్క మాట చెపితే మత ఘర్షణల కేసులను రద్దు చేస్తారని ఆయన అన్నారు. ఆదోని మున్సిపాలిటిలో వైకాపా, టిడిపి పార్టీలు నిధులను సమానంగా పంచుకుంటూ అభివృద్ధిని మరిచిపోయారని అందువల్లనే అనేక సమస్యలు పట్టణంలో ఉన్నాయని చెప్పా రు. రోడ్లు విస్తర్ణ కార్యక్రమం ఒక్కసారి జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మొన్నటి వరకు కేవలం అక్రమణల స్థలాల్లో నిర్మించిన కట్టడాలను తొలగించారని మళ్ళీ ఇప్పుడు రోడ్లు విస్తర్ణం కార్యక్రమం పేరుతో లేదా ఎన్ హెచ్ రోడ్డు పనుల పేరుతో అక్రమ కట్టడాలను తొలగిస్తే ప్రజలు నష్టపోతారని అన్నారు. కావున రోడ్ల విస్తరణ కార్యక్రమం ఒకే సారి చేపట్టాలని ఒకే మారు కట్టడాలను కూల్చాలని అప్పు డే ప్రజలు నష్టపోయారని చెప్పారు. మాటి మాటి రోడ్లు విస్తర్ణ పేరుతో కట్టుకున్న భవనాలను తొలగిస్తే పేద లు, ప్రజలు ఆర్థికంగా నష్టపోతారన్నారు. అలాగే పట్టణంలో మట్కా జోరుగా సాగుతుందని మట్కాను నివారించడానికి పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. మట్కా వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అవుతున్నాయని అన్నారు. వేలం వేసిన మార్కెట్ల రుసుం చెల్లించకుండా చాలా మంది కాంట్రాక్టర్లు మున్సిపాలిటికి కోట్ల రూపాయాలు అప్పులు ఉన్నారని వాటిని మాఫి చేసుకోవడానికి లేదా అధికారులు చర్యలు తీసుకోకుండా ఉండేందుకు మార్కెట్ వేలం పాడిన వ్యాపారులు ఏపార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి మారి మున్సిపాలిటికి చెల్లించాల్సిన మార్కెట్ సొమ్ముకు ప్రతి సంవత్సరం ఎగనామం పెడుతున్నారని విమర్శించారు. కావున మున్సిపాలిటి అధికారులు చర్యలు తీసుకోని బకాయిలు వసూళ్లు చేయాలని కోరా రు. బిజెపి స్థానిక సమస్యలపైన దృష్టి పెట్టి స్థానిక ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తుందని ఆయన చెప్పారు. సమావేశంలో బిజెపి పట్టణ అధ్యక్షులు కునిగిరి నాగరాజు, సీనియర్ నాయకులు శ్రీరాములు, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ్‌కృష్ణ,మహిళ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హేమలతరెడ్డి, మహిళ మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి వినీతగుప్తా, ఆంజూసిగాంధీ తదితరులు పాల్గొన్నారు.
క్రమశిక్షణకు మారుపేరు
ఏరాసు కుటుంబం
* కర్నూలును క్రీడల నగరంగా మారుస్తా
* ఎంపి టిజి వెంకటేష్
కర్నూలుటౌన్, ఫిబ్రవరి 26:జిల్లాలో మాజీ మంత్రి ఏరాసు అయ్యపురెడ్డి సేవలు మరువలేనివని, వారి కుటుం బం క్రమశిణకు మారుపేరు అని రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ కొనియాడారు. నగరంలోని కర్నూలుక్లబ్ మైదానంలో ఆదివారం రాయలసీమ స్థాయి టెన్నిస్ టోర్నీ ముగింపు కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథులుగా టిజితో పాటు మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, ఏరాసు అవినాష్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఏరాసు మాట్లాడుతూ తన తండ్రి జ్ఞాపకార్థం గత 8 ఏళ్లుగా టెన్నిస్ టోర్నీ నిర్వహిస్తున్నామని, మున్ముందు మరింత పెద్దటోర్నీలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూ పొందించామన్నారు. టిజి వెంకటేష్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు అని ఆయన జిల్లాలో క్రీడల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నారన్నారు. ఎంపి టిజి వెంకటేష్ మాట్లాడుతూ అయ్యపురెడ్డి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా పని చేసి క్రమశిక్షణతో సేవలు అందించారని, ప్రతిఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అరవింద్‌రెడ్డి మాట్లాడుతూ టెన్నిస్ పోటీలను పెద్దఎత్తున నిర్వహిస్తామన్నారు. అనంతరం విజేతలకు నగదు, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సముద్రాల హనుమంతరావు, విశ్రాంత ప్రిన్సిపాల్ ప్రభాకర్‌రెడ్డి, క్రీడకారులు పాల్గొన్నారు.
అమెరికాలో భారతీయులకు
రక్షణ కల్పించాలి
* తాగునీటి ఎద్దడిని అధిగమించాలి
* సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ
కర్నూలు సిటీ, ఫిబ్రవరి 26:అమెరికాలో ఉన్న భారత ప్రజలు, విద్యార్థులకు రక్షణ కల్పించాలని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. నగరంలోని చండ్రరాజేశ్వరరావు భవన్‌లో ఆదివారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. వలసలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా శే్వత జాతీయులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇంజినీర్ కూచిబొట్ల శ్రీనివాస్‌ను దారుణంగా హతమార్చారని, ఈ సంఘటనతో అమెరికాలో ఉన్న భారతీయులు ఆందోళన చెందుతున్నారన్నారు. స్వతంత్రంగా మాతృభాష మాట్లాడుకోవటాన్ని నేరంగా భావించడం అన్యాయమన్నారు. అమెరికా దుశ్చర్యను ప్రపంచ దేశాలన్నీ ఖండించాలన్నారు. దేశాభివృద్ధిలో భాగస్వాములైన భారతీయులను ప్రోత్సహించాల్సింది పోయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. అమెరికాలో భారత ప్రజలు, విద్యార్థులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.
అలాగే రాయలసీమ జిల్లాల్లో తీవ్రమైన కరవు నెలకొందని, అయినా ప్రభుత్వం కరవు నివారణలో నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి నిధులను పెంచినా రాష్ట్ర ప్రభుత్వం వాటిని సక్రమంగా వినయోగించుకోవటం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులు కల్పించకపోవడంతో ప్రజలు బెంగళూరు, చెన్నై, కొచ్చిన్, సేలం వంటి సుదూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారన్నారు. ప్రధానంగా జిల్లాలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని, ఆ సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ఇక జిల్లాలో గుండ్రేవుల, వేదావతి, సిద్దేశ్వరం అలుగు వంటి ప్రాజెక్టులను చేపట్టి శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. హంద్రీనీవా ద్వారా చెరువులను నీటితో నింపాలని, అప్పుడే పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలు పెరగటమే కాకుండా నీటి సమస్య తీరుతుందన్నారు. అంతేకాకుండా ఎన్‌టిఆర్ వైద్యసేవలో అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని, ఫలితంగా ఎందరో నిరుపేదలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ప్రభుత్వం ఎన్‌టిఆర్ వైద్యసేవపై సమగ్రమైన విచారణ చేపట్టి పేదలకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి మనోహర్‌మాణిక్యం, సిపిఐ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, జిల్లా కార్యవర్గ సభ్యులు జగన్నాథం, నగర కార్యదర్శి రసూల్, తదితరులు పాల్గొన్నారు.