కర్నూల్

కన్నుల పండువగా ప్రహ్లాదవరదుని రథోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, మార్చి 12:ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన దిగువ అహోబిలంలో ఆదివారం ఉదయం శ్రీ ప్రహ్లాద వరదునికి రథోత్సవం 46వ పీఠిధిపతి శ్రీవన్ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్‌స్వామి ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తులైన శ్రీ ప్రహ్లాదవరదుడు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాలన్, ఆలయ ఈఓ మల్లికార్జున ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం నుండి రథం వరకు తీసుకొనివచ్చి రథంలో కొలువుంచి ప్రత్యేక పూజలనంతరం శంఖం పూరించి రథోత్సవం ప్రారంభించారు. రథశ్య కేశవం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అన్నట్లు రథంలోని స్వామిని దర్శస్తే పునర్జన్మ ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి. కల్యాణం రోజున భక్తులందరికి దర్శన భాగ్యం కలిగే అవకాశం లేనందున రథోత్సవంలో ఊరేగింపుగా వస్తున్న స్వామిని దర్శించుకునే భాగ్యం కలిగించేందుకు రథోత్సవం నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి జమ్మలమడుగుకు చెందిన పి లక్ష్మమ్మ, ఓబులరెడ్డి అండ్ సన్స్ ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ రధోత్సవంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొని పూజలనంతరం పీఠాదిపతుల ఆశీర్వాదం పొందింది. వైకాపా నాయకులు గంగుల ప్రభాకరరెడ్డి, బ్రిజేంధ్రనాధరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం నిర్వహించారు.
ఎగువ అహోబిలంలో..
ఎగువలో కొలువుదీరిన శ్రీ జ్వాలా నరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు అర్చకులు లక్ష్మినరసింహాచార్యులు సంప్రదాయంగా వేదమంత్రోఛ్చారణల మద్య పంచామృతాభిషేకం నిర్వహించారు. సాయంత్రం స్వామి వారికి ద్వాదశారాధనం, పుష్పయాగం కార్యక్రమాలను నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో స్వామికి జరిగిన ఆరాధనాదోషములు నివృత్తి చేసుకోవడం కోసం స్వామికి 12 సార్లు తిరువారాధనం చేసి, 12 రకాల భక్ష్యాలను, 12 రకాల అన్నమును నివేదిస్తారు. వాహనసేవలలో పాల్గొన్న స్వామికి ఆ శ్రమ పోగొట్టడం కోసం పుష్పాలతో చక్రాబ్ద మండలం చేసి ఆ పుష్పాలతో స్వామి తిరుమేనికి అభిషేకం చేయడమే పుష్పయాగం. ఈ కార్యక్రమానికి అహోబిలం ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాలన్ ఉభయదారులుగా వ్యవహరించారు.